
మహిళ మెడలో గొలుసు చోరీ
వరంగల్ జిల్లాలోని బ్యాంకుకాలనీలో బుధవారం సరిత అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు.
వరంగల్ టౌన్: వరంగల్ జిల్లాలోని బ్యాంకుకాలనీలో బుధవారం సరిత అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. దొంగిలించిన బంగారు గొలుసు 10 గ్రాములు ఉంటుందని బాధితురాలు తెలిపింది.
బాధితురాలి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.