
హంతకుడు ఎవరు?
గోవాలో ఓ హత్య జరుగుతుంది. ఆ హత్య చేసిందెవరు? హంతకుణ్ణి పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనే కథతో రూపొందుతోన్న సినిమా ‘స్ట్రేంజర్’. ఫణికుమార్ అద్దేపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శివ హరీశ్, సమీర్ హీరోలు. దివా ఆలియా, తేజారెడ్డి హీరోయిన్లు.
‘‘మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, కథనాలు ఆద్యంతం ఆసక్తి కలిగిస్తాయి. ఈ నెలాఖరు నుంచి గోవాలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి కెమేరా: అశ్విన్–ప్రేమ్‌చంద్, స్టైలింగ్: సరస్వతి అద్దేపల్లి, సంగీతం: జితేందర్.