దారుణం: భార్యను సముద్రంలో ముంచి చంపి.. ఆపై..! | Hotel Manager Murders Wife To Hide Affair Portray It As Accident | Sakshi
Sakshi News home page

దారుణం: భార్యను సముద్రంలో ముంచి చంపి.. ఆపై..!

Jan 21 2024 11:01 AM | Updated on Jan 21 2024 2:47 PM

Hotel Manager Murders Wife To Hide Affair Portray It As Accident - Sakshi

పనాజీ: గోవాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను సముద్రంలో ముంచి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వివాహేతర సంబంధంపై భార్య ప్రశ్నించినందుకు నిందితుడు హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోవాలోని కాబో డి రామా బీచ్‌లో ఈ ఘటన జరిగింది.

గౌరవ్ కటియార్(29) సౌత్‌ గోవాలోని ఓ లగ్జరీ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. దీక్షా గంగ్వార్‌(27) అనే యువతిని గతేడాదే వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ లక్నోకు చెందినవారు. గోవాలోనే నివసిస్తున్నారు. అయితే.. కటియార్ వివాహేతర సంబంధంపై గంగ్వార్ ఇటీవల ప్రశ్నించింది. దీంతో భార్యను హత్య చేయాలనే కుట్ర పన్నిన కటియార్.. ఆమెను బీచ్‌కు షికారుకు తీసుకువెళ్లాడు. ఎవరూ లేని రాళ్ల ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆమెను నీళ్లలో ముంచి చంపేశాడు. ఆ తర్వాత యథావిధిగా కార్యాలయానికి తీరిగివచ్చాడు. 

తన భార్య చనిపోయిందో? లేదో నిర్దారించుకోవడానికి మళ్లీ ఓ సారి వెళ్లి చూశాడు. ఆ తర్వాత తన భార్య నీళ్లలో మునిగి చనిపోయిందని పోలీసులకు తెలిపాడు. ఆందోళన పడుతున్నట్లు హంగామా సృష్టించాడు. అయితే.. ఓ యాత్రికుడు తీసిన వీడియో ఆధారంగా కటియార్ కుట్ర బయటపడింది. కటియార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: డబ్బుల కోసం బామ్మను చంపేశాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement