హత్యకు గురైన వెంకటేశ్ (రోజా)
సిద్దిపేట కమాన్: ట్రాన్స్‌జెండర్‌గా మారి వేధిస్తున్నాడంటూ సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించింది ఓ భార్య. సుపారీ కింద రూ.18 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకొని.. రూ.4.60 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించింది. సిద్దిపేట వన్‌టౌన్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్‌ఐ రంజిత్‌కుమార్ కథనం ప్రకారం.. సిద్దిపేట బోయిగల్లికి చెందిన వేదశ్రీకి నాసర్‌పూరకు చెందిన దరిపల్లి వెంకటేశ్(33)కు 2014లో వివాహమైంది.
2015లో వీరికి ఒక పాప జన్మించింది. కొద్ది రోజుల తర్వాత వెంకటేశ్‌కు మానసిక ఆలోచనల్లో మార్పు వచ్చింది. అమ్మాయిలాగా ప్రవర్తించడం చెవులకు కమ్మలు, ముక్కుకు పుడక పెట్టుకుని రాత్రి సమయంలో ఆడవారి దుస్తులు ధరించడం చేస్తుండేవాడు. అదనపు కట్నం కోసం కూడా వేధింపులకు గురి చేసేవాడు. 2019లో ఏకంగా వెంకటేశ్ ట్రాన్స్‌జెండర్‌గా మారి భార్యను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు.
వేధింపులకు ఉద్యోగం పోవడంతో పగబట్టి..
రోజాగా పేరుమార్చుకున్న వెంకటేశ్ పలుమార్లు చీరకట్టుకుని వేదశ్రీ పనిచేస్తున్న స్కూలుకు వెళ్లి వేధిస్తుండటంతో తన ఉద్యోగాన్ని కోల్పోయింది. మరో స్కూల్లో చేరినా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో తనకు పరిచయమైన సిద్దిపేట నాసర్‌పూర వాస్తవ్యుడు బోయిని రమేశ్‌తో తన బాధను చెప్పుకొని వాపోయింది. తనను, పాపను వేధిస్తున్న వెంకటేశ్ (రోజా)ను ఎలాగైనా అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది.
దీంతో వేదశ్రీ, రమేశ్ కలిసి పట్టణంలోని కాకతీయ ఫుట్‌వేర్ యజమాని రమేశ్‌తో వెంకటేశ్(రోజా) హత్య కోసం 2023 సెప్టెంబర్‌లో రూ. 18లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు అడ్వాన్స్‌గా వేదశ్రీ మొదటగా రూ.2లక్షలు చెల్లించింది. ఈ క్రమంలో ఫుట్‌వేర్ రమేశ్‌కు మిత్రుడైన నంగునూరు మండలం నాగరాజుపల్లికి చెందిన ఇప్పల శేఖర్‌కు హత్య విషయం తెలిపారు. దీంతో ఇప్పల శేఖర్ ముందుగా వేసుకున్న పథకంలో భాగంగా వెంకటేశ్ (రోజా)తో పరిచయం చేసుకుని తరచూ అతడిని కలుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇప్పల శేఖర్ వెంకటేశ్(రోజా)కు ఫోన్ చేసి వరంగల్ నుంచి సిద్దిపేటకు పిలిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment