
ప్రతీకాత్మక చిత్రం
మైసూరు(కర్ణాటక): భార్య వేధిస్తోందని, బంగారం కాజేసిందని భర్త పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు.. మైసూరు వివి పురం పరిధిలోని విజయనగరలో ఎం.రఘు కారియప్ప (70), భార్య జాస్మిన్‌తో నివసిస్తున్నాడు. జాస్మిన్ టీచర్‌గా పనిచేస్తుంది. జాస్మిన్ గత 5 సంవత్సరాల నుంచి తనను వేధిస్తోందని, అనేకసార్లు హత్యాయత్నం చేసిందని రఘు కారియప్ప ఫిర్యాదులో తెలిపాడు.
ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీన 6 బంగారు ఉంగరాలు, 2 బంగారు నాణేలు, ఒక చైన్, ఒక పెద్ద గాజును తన భార్య దొంగిలించిందని చెప్పాడు. నగలు ఏవని అడిగితే తీసుకున్నట్లు చెప్పిందని, తిరిగి అడిగితే ఇవ్వడం లేదని వాపోయాడు. తన వస్తువులను ఇప్పించాలని పోలీసులను కోరగా వారు పట్టించుకోలేదు. దీంతో కోర్టులో అర్జీ వేయగా, కేసు నమోదు చేసి విచారించాలని పోలీసులను జడ్జి ఆదేశించారు.
చదవండి: పెళ్లి పీటలెక్కనున్న నటి.. కాబోయే భర్త ఎవరంటే?
Comments
Please login to add a commentAdd a comment