complains
-
ఐటీడీపీపై YSRCP నేతల ఫిర్యాదు
-
భార్య వేధిస్తోంది.. భర్త ఫిర్యాదు.. కారణం తెలిస్తే షాకే..?
మైసూరు(కర్ణాటక): భార్య వేధిస్తోందని, బంగారం కాజేసిందని భర్త పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు.. మైసూరు వివి పురం పరిధిలోని విజయనగరలో ఎం.రఘు కారియప్ప (70), భార్య జాస్మిన్‌తో నివసిస్తున్నాడు. జాస్మిన్ టీచర్‌గా పనిచేస్తుంది. జాస్మిన్ గత 5 సంవత్సరాల నుంచి తనను వేధిస్తోందని, అనేకసార్లు హత్యాయత్నం చేసిందని రఘు కారియప్ప ఫిర్యాదులో తెలిపాడు. ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీన 6 బంగారు ఉంగరాలు, 2 బంగారు నాణేలు, ఒక చైన్, ఒక పెద్ద గాజును తన భార్య దొంగిలించిందని చెప్పాడు. నగలు ఏవని అడిగితే తీసుకున్నట్లు చెప్పిందని, తిరిగి అడిగితే ఇవ్వడం లేదని వాపోయాడు. తన వస్తువులను ఇప్పించాలని పోలీసులను కోరగా వారు పట్టించుకోలేదు. దీంతో కోర్టులో అర్జీ వేయగా, కేసు నమోదు చేసి విచారించాలని పోలీసులను జడ్జి ఆదేశించారు. చదవండి: పెళ్లి పీటలెక్కనున్న నటి.. కాబోయే భర్త ఎవరంటే? -
అర్థరాత్రి అస్వస్థతకు గురైన పుతిన్....3 గంటల పాటు అత్యవసర చికిత్స అందించి
Russian leader complained of “severe nausea”: రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని రష్యా టెలిగ్రామ్ ఛానెల్ పేర్కొంది. దీంతో హుటాహుటిని రెండు వైద్య బృందాలు ఆయన నివాసానికి తరలివచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు పుతిన్‌కి అర్థారాత్రి సుమారు 1 గంట సమయంలో తీవ్ర వికారంతో బాధపడినట్లు తెలిపింది. దీంతో మెడికల్ ఎమర్జెన్సీ సుమారు మూడు గంటల పాటు మెరుగైన చికిత్స అందిచిందని వెల్లడించింది. ప్రస్తుతం పుతిన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేసింది. అదీగాక ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ దాడికి దిగినప్పటి నుంచి పుతిన్ ఆరోగ్యం పై రకరకాలు పుకార్లు వచ్చాయి. అందులో భాగంగానే ఆయనకు పార్కిన్సన్ క్యాన్సర్ అని, బహిరంగ సమావేశాల్లో ఆయన వణుకుతూ కనిపించాడని రకరకాలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఐతే మాస్కో ఈ వ్యాఖ్యలన్నింటిని కొట్టిపారేసింది. అదీగాక యూకే ఆర్మీ అధికారులు సైతం పుతిన్ అనారోగ్యం బారిన పడ్డాడంటూ వాదిస్తూనే ఉండటం గమనార్హం. (చదవండి: ఈ వ్యాధి అలానే సోకదు... ఒక్కోసారి..: డబ్ల్యూహెచ్ఓ) -
బీమా బ్రోకింగ్ సంస్థలు...
న్యూఢిల్లీ: బీమా బ్రోకింగ్ సంస్థలను కూడా అంబుడ్స్‌మన్ పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పాలసీదారులు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా కల్పించింది. ఇందుకు సంబంధించి ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ నిబంధనలను సవరించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం వెల్లడించింది. అంబుడ్స్‌మన్‌కి కేవలం వివాదాలపైనే కాకుండా బీమా సంస్థలు, ఏజెంట్లు, బ్రోకర్లు, ఇతరత్రా మధ్యవర్తులు అందించే సేవల్లో లోపాలపైన కూడా ఫిర్యాదు చేసే విధంగా కంప్లైంట్ల పరిధిని విస్తృతం చేసినట్లు వివరించింది. ఇన్సూరెన్స్ సేవల్లో లోపాలపై వచ్చే ఫిర్యాదులను సత్వరం, తక్కువ వ్యయాలతో, నిష్పక్షపాతంగా పరిష్కరించే విధంగా బీమా రంగ అంబుడ్స్‌మన్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ నిబంధనలు–2017కి ఈ మేరకు సమగ్రమైన సవరణలు చేసినట్లు పేర్కొంది. నిర్దిష్ట సవరణల ప్రకారం.. పాలసీదారులు ఇకపై ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేయొచ్చు. ఆయా ఫిర్యాదుల స్థితిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే తెలుసుకునేలా ప్రత్యేక మేనేజ్మెంట్ వ్యవస్థ ఉంటుంది. వీడియో–కాన్ఫరెన్సింగ్ ద్వారా అంబుడ్స్‌మన్ విచారణ నిర్వహించవచ్చు. అంబుడ్స్‌మన్ ఎంపిక ప్రక్రియ పూర్తి స్వతంత్రంగా, సమగ్రంగా జరిగే విధంగా తత్సంబంధ నిబంధనలను సవరించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. బీమా రంగంలో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కృషి చేసిన వారిని కూడా సెలక్షన్ కమిటీలో చోటు ఉంటుందని పేర్కొంది. -
గంభీర్‌కు 2 ఓటర్‌ఐడీలు!
న్యూఢిల్లీ: రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారంటూ బీజేపీ తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీలో తిస్హజారీ కోర్టులో ఫిర్యాదు చేసింది. గంభీర్ దాఖలు చేసిన డాక్యుమెంట్లన్నీ సరైనవేనని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ స్పష్టం చేశారు. రెండు చోట్ల ఓటు హక్కు, రెండు ఓటరు కార్డులు కలిగి ఉండటం నేరమని, ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీకి గంభీర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని ఆప్ తూర్పు ఢిల్లీ అభ్యర్థి అతిషి డిమాండ్ చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సందర్భంగా తనకు రాజేంద్రనగర్‌లో ఓటు హక్కు ఉందంటూ గంభీర్ తన అఫిడవిట్లో డిక్లరేషన్ ఇచ్చారని, కానీ రాజేంద్రనగర్‌తోపాటు కరోల్‌బాగ్‌లోనూ గంభీర్‌కు ఓటు హక్కు ఉందని అతిషి ఆరోపించారు. ఎవరైన అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉండి తప్పుడు డిక్లరేషన్ ఇస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆ అభ్యర్థికి ఏడాది జైలుశిక్షగాని, జరిమానాగానీ, జరిమానాతోపాటు జైలుశిక్షగానీ విధించవచ్చు. -
ఎయిర్‌టెల్‌ను టార్గెట్ చేసిన జియో
సాక్షి, న్యూఢిల్లీ: ముకేష్ అంబానీ అధీనంలోని రిలయన్స్ జియో మరోసారి తన ప్రధాన ప్రత్యర్తి భారతి ఎయిర్‌టెల్‌పై గుర్రుగా ఉంది. ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లఘించిందని ఆరోపిస్తూ ఎయిర్‌టెల్‌పై డాట్‌కు ఫిర్యాదు చేసింది. ఆపిల్ వాచ్ సిరీస్ 3లో ఉపయోగించే ‘ఈ-సిమ్’ సర్వీస్ విషయంలో ఎయిర్టెల్ లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘించిందనేది జియో ఆరోపణ. ఈ మేరకు మే 11 తేదీన జియో టెలికాం శాఖకు ఒక లేఖ రాసింది. ఆపిల్ వాచ్ సిరీస్ 3 సర్వీస్ విషయంలో ఎయిర్టెల్ ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లంఘించిందని జియో ఆరోపించింది. దీనికి సంబంధించి ఎయిర్‌టెల్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని.. తగిన జరిమానా విధించాలని కోరింది. ఈ-సిమ్’ నాడ్ సాంకేతికత ఇండియాలో ఏర్పాటు చేయలేదని ఇది నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందనేది జియో వాదన. మరోవైపు జియో వాదనలను ఎయిర్టెల్ కొట్టిపారేసింది. దీనికి సంబంధించిన అన్ని చర్యలు తాము చేపట్టామని తెలిపింది. వినియోగదారుల సమాచారం, నెట్వర్క్ నాడ్స్ వంటి అన్ని వివరాలు అత్యంత భద్రంగా ఉండేలా ఏర్పాట్లు చేశామని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని డాట్‌కు వివరిస్తామని ఆయన తెలిపారు. ఇది ఇలా ఉంటే ఈ ఉల్లంఘన కింద, సర్కిల్‌కు 50కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని టెలికాం నిపుణులు భావిస్తున్నారు. ఈ-సిమ్ ఐఫోన్‌లోని సిమ్‌తో వైర్‌లెస్‌గా నెట్వర్క్ నాడ్ సాయంతో కనెక్ట్ అవుతుంది. ఐఫోన్లో ఉపయోగించే నెంబర్‌నే ఆపిల్ వాచ్‌లోనూ ఈ-సిమ్ ద్వారా వినియోగిస్తూ కాల్స్ చేయొచ్చు. కాగా జియో, ఎయిర్టెల్ సంస్థలు తమ అవుట్‌లెట్స్ ద్వారా మే 11 నుంచి ఆపిల్ వాచ్ సిరీస్3 ని విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. -
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా..?
హైదరాబాద్ : హెల్మెట్ లేకుండా పోలీసులకు దొరక్కుండా ఎంచక్కా తిరిగి ఇంటికి చేరుకున్నానని సంబరపడకండి. పోలీసులు లేని ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఎక్కడ పడితే అక్కడ కారును పార్క్ చేసినా అడిగే వారెవరున్నారని అనుకుంటున్నారా? అయితే పోలీసుల నుంచి తప్పించుకున్నా ఇకపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నెటిజన్ల దృష్టిలో పడ్డారో ఇక అంతే. నెటిజన్ల నుంచి ట్విట్టర్లో అందిన ఫిర్యాదులను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్వీకరించి చలానాలు విధిస్తున్నారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మీ కంటపడితే చేయాల్సిందల్లా ఒక్క ఫోటో తీసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక ట్విట్టర్ ఖాతాకు(@HYDTP) ట్యాగ్ చేస్తే చాలు. అంతే ఇక తర్వాతి సంగతి పోలీసులే చూసుకుంటారు. ఇటీవలే నెటిజన్ల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు విధించిన చలానాల వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఓ పోలీసు అధికారి హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం పై వెళుతున్న ఫోటోను తీసి ఓ నెటిజన్ ట్విట్టర్లో పోలీసులు అధికారిక ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేశాడు అంతే వారు సదరు ద్విచక్రవాహనానికి చలానా విధించారు. మరో సంఘటనలో ఓ కారును నిర్లక్ష్యంగా ముసారాంబాగ్‌లోని ఆర్టీవో ఆఫీసు ముందున్న రోడ్డు పక్కన పార్క్ చేసుందని మరో నెటిజన్ ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకురావడంతో సదరు కారుకు కూడా చలానా విధించారు. Action taken on Twitter complains - Challans generated on Vehicles for violating Traffic rules pic.twitter.com/LVFMzWGUW1 — HYDTP (@HYDTP) September 27, 2017 -
ఫిర్యాదుదారుల చెంతకే అధికారులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ‘మీ కోసం’ కార్యక్రమంలో అందే ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఇకపై అధికారులు ఫిర్యాదుదారుని వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. సమస్యలతో సతమతం అవుతున్న వారు, ప్రభుత్వ సహాయం అర్థించే వారు ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు రావ డం.. వినతిపత్రాలు ఇవ్వడం.. సమస్య పరిష్కారం కాకపోవడంతో పదేపదే అధికారుల చుట్టూ తిరగడం సర్వసాధారణ విషయంగా మారింది. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పలువురు కలెక్టరేట్ వద్దే ఆత్మహత్యకు యత్నించిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 24న నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నుంచి ‘మీ కోసం’లో వచ్చిన అర్జీలను స్వీకరించిన అనంతరం.. వాటిని పరిష్కరించాలి్సన బాధ్యత గల అధికారి అర్జీదారుని వద్దకు వెళ్లాలి. ఫిర్యాదుదారు ఇచ్చిన అర్జీని చదివి వినిపించాలి. ఆ తర్వాత ఆ సమస్యను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కరించాలి. పరిష్కరించిన విధానాన్ని కూడా అర్జీదారునికి చదివి వినిపించాలి. అర్జీదారుడు తన సమస్య పరిష్కారమైనట్టు సంతృప్తి చెందినదీ, లేనిది వీడియోలో చిత్రీకరించాలి. అనంతరం అర్జీదారునితో సంబంధిత అధికారి సెల్ఫీ తీసుకుని దానిని పరిష్కార నివేదికతోపాటు మీ కోసం వెబ్‌పోర్టల్‌లో పొందుపరచాలి. ఒకవేళ ఆ సమస్య ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కరించడానికి వీలుకాని పక్షంలో ఆ విషయాన్ని అర్జీదారునికి ఎండార్స్మెంట్ ఇచ్చి, దాన్ని వెబ్సైట్లో పొందుపరచాలి. రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలకు సంబంధించిన దరఖాస్తులకు సెల్ఫీతోపాటు వీడియో కూడా కచ్చితంగా అప్లోడ్ చేయాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
భార్య, ప్రియుడ్ని పోలీసులకు పట్టించిన భర్త
టీనగర్: నాట్రాంపల్లి సమీపాన ఇంట్లో ఉన్న భార్య, ప్రియుడ్ని భర్త పోలీసులకు పట్టించిన సంఘటన జరిగింది. వేలూరు జిల్లా, నాట్రాంపల్లి సమీపాన మూక్కనూరు అనే గ్రామం ఉంది. ఈ ఊరికి చెందిన కుమార్(28)కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఐదేళ్ల కుమార్తె ఉంది. వివాహమైన కొద్ది రోజుల్లో కుమార్ సింగపూర్‌కు వెళ్లాడు. ఇలావుండగా అతని భార్యకు, అదే ప్రాంతానికి చెందిన దేవేంద్రన్(23) అనే యువకుడితో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారం కుమార్ తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో సింగపూర్‌లోని తమ కుమారుడికి విషయం తెలిపారు. దీంతో కుమార్ వెంటనే సొంతవూరికి వచ్చాడు. తన భార్యతో యువకుడితో సంబంధాన్ని వదులుకోమని తెలిపాడు. అయినప్పటికీ భార్య వినకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆగ్రహించిన భార్య విలగనత్తంలోని తన పుట్టింటికి వెళ్లింది. తర్వాత భార్యను తీసుకువచ్చేందుకు కుమార్ వెళ్లలేదు. కొద్దిరోజుల్లో కుమార్ సేలంలోని బేకరీలో పనికి చేరాడు. ఇదే సమయంలో కూక్కనూరు నుంచి దేవేంద్రన్ తరచూ విలగనత్తంకు వెళుతూ వచ్చాడు. ఈ వ్యవహారం కుమార్‌కు తెలిసింది. ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు నిర్ణయించాడు. ఆదివారం దేవేంద్రన్‌పై నిఘా ఉంచాడు. రాత్రి 11 గంటల సమయంలో తన భార్య ఇంట్లో దేవేంద్రన్ ఉన్న విషయం తెలుసుకుని, ఇంటి బయట తాళం వేశాడు. తర్వాత బిగ్గరగా కేకలు వేసి ఊరి ప్రజలను రప్పించాడు. వారి సమక్షంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని నాట్రాంపల్లి పోలీసు స్టేషన్లో అప్పగించాడు. ఇది క్లిష్టమైన కేసు కావడంతో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉండడంతో కుమార్‌ను చట్టపూర్వక చర్యలు తీసుకోమని చెప్పి పంపివేసినట్లు తెలిసింది. ఈ సంఘటన మూక్కనూరు, విలగనత్తంలలో సంచలనం కలిగించింది. -
ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు
-
'మాగుంట అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి'
-
ఏడాదిగా భార్యను వేదిస్తున్న SI అనిల్