Russian leader complained of “severe nausea”: రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని రష్యా టెలిగ్రామ్ ఛానెల్ పేర్కొంది. దీంతో హుటాహుటిని రెండు వైద్య బృందాలు ఆయన నివాసానికి తరలివచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు పుతిన్‌కి అర్థారాత్రి సుమారు 1 గంట సమయంలో తీవ్ర వికారంతో బాధపడినట్లు తెలిపింది. దీంతో మెడికల్ ఎమర్జెన్సీ సుమారు మూడు గంటల పాటు మెరుగైన చికిత్స అందిచిందని వెల్లడించింది.
ప్రస్తుతం పుతిన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేసింది. అదీగాక ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ దాడికి దిగినప్పటి నుంచి పుతిన్ ఆరోగ్యం పై రకరకాలు పుకార్లు వచ్చాయి. అందులో భాగంగానే ఆయనకు పార్కిన్సన్ క్యాన్సర్ అని, బహిరంగ సమావేశాల్లో ఆయన వణుకుతూ కనిపించాడని రకరకాలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఐతే మాస్కో ఈ వ్యాఖ్యలన్నింటిని కొట్టిపారేసింది. అదీగాక యూకే ఆర్మీ అధికారులు సైతం పుతిన్ అనారోగ్యం బారిన పడ్డాడంటూ వాదిస్తూనే ఉండటం గమనార్హం.
(చదవండి: ఈ వ్యాధి అలానే సోకదు... ఒక్కోసారి..: డబ్ల్యూహెచ్‌ఓ)
Comments
Please login to add a commentAdd a comment