న్యూఢిల్లీ: రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారంటూ బీజేపీ తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీలో తిస్‌హజారీ కోర్టులో ఫిర్యాదు చేసింది. గంభీర్ దాఖలు చేసిన డాక్యుమెంట్లన్నీ సరైనవేనని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ స్పష్టం చేశారు. రెండు చోట్ల ఓటు హక్కు, రెండు ఓటరు కార్డులు కలిగి ఉండటం నేరమని, ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీకి గంభీర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని ఆప్ తూర్పు ఢిల్లీ అభ్యర్థి అతిషి డిమాండ్ చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సందర్భంగా తనకు రాజేంద్రనగర్‌లో ఓటు హక్కు ఉందంటూ గంభీర్ తన అఫిడవిట్‌లో డిక్లరేషన్ ఇచ్చారని, కానీ రాజేంద్రనగర్‌తోపాటు కరోల్‌బాగ్‌లోనూ గంభీర్‌కు ఓటు హక్కు ఉందని అతిషి ఆరోపించారు. ఎవరైన అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉండి తప్పుడు డిక్లరేషన్ ఇస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆ అభ్యర్థికి ఏడాది జైలుశిక్షగాని, జరిమానాగానీ, జరిమానాతోపాటు జైలుశిక్షగానీ విధించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment