
హైదరాబాద్ :
హెల్మెట్ లేకుండా పోలీసులకు దొరక్కుండా ఎంచక్కా తిరిగి ఇంటికి చేరుకున్నానని సంబరపడకండి. పోలీసులు లేని ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఎక్కడ పడితే అక్కడ కారును పార్క్ చేసినా అడిగే వారెవరున్నారని అనుకుంటున్నారా? అయితే పోలీసుల నుంచి తప్పించుకున్నా ఇకపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నెటిజన్ల దృష్టిలో పడ్డారో ఇక అంతే.
నెటిజన్ల నుంచి ట్విట్టర్లో అందిన ఫిర్యాదులను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్వీకరించి చలానాలు విధిస్తున్నారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మీ కంటపడితే చేయాల్సిందల్లా ఒక్క ఫోటో తీసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక ట్విట్టర్ ఖాతాకు(@HYDTP) ట్యాగ్ చేస్తే చాలు. అంతే ఇక తర్వాతి సంగతి పోలీసులే చూసుకుంటారు.
ఇటీవలే నెటిజన్ల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు విధించిన చలానాల వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఓ పోలీసు అధికారి హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం పై వెళుతున్న ఫోటోను తీసి ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోలీసులు అధికారిక ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేశాడు అంతే వారు సదరు ద్విచక్రవాహనానికి చలానా విధించారు.
మరో సంఘటనలో ఓ కారును నిర్లక్ష్యంగా ముసారాంబాగ్‌లోని ఆర్టీవో ఆఫీసు ముందున్న రోడ్డు పక్కన పార్క్ చేసుందని మరో నెటిజన్ ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకురావడంతో సదరు కారుకు కూడా చలానా విధించారు.
Action taken on Twitter complains - Challans generated on Vehicles for violating Traffic rules pic.twitter.com/LVFMzWGUW1
— HYDTP (@HYDTP) September 27, 2017