ప్రధాన వార్తలు

YSR Jayanthi: ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్ తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు.వైఎస్ జగన్ రాకతో ఇడుపులపాయ కోలాహలంగా మారింది. జననేతను చూసేందుకు, కరచలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు భారీ ఎత్తున అభిమానులు ఘాట్ వద్దకు పోటెత్తారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)మిస్ యూ డాడ్.. వైఎస్సార్ జయంతిని ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. మిస్ యూ డాడ్ అంటూ ఎక్స్ ఖాతాలో ఇవాళ ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఫొటోలను పంచుకున్నారు.Miss you Dad! pic.twitter.com/0jINDcR1Fj— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2025ఆందోళన వద్దు.. అండగా ఉంటాంకడపలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) అనుమతి లేకపోవడం, ADCET విడుదలపై వారం రోజులుగా స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇడుపులపాయలో వైఎస్ జగన్‌ను వాళ్లు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని వైఎస్ జగన్ అన్నారు. ‘‘విద్యార్ధులకు మంచి యూనివర్సిటీ కడితే ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తోంది. వైఎస్సార్సీపీ విద్యార్ధులకు అన్ని విధాల అండగా ఉంటుంది వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల నేతలు విద్యార్థుల వెంట ఉన్నారు.

సీఎం రేవంత్‌కు కేటీఆర్ మరో సవాల్
బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల సవాల్ అప్డేట్స్.. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో కేటీఆర్ కామెంట్స్..ముఖ్యమంత్రికి బేసిక్ నాలెడ్జ్ లేదు.18 నెలలుగా రైతులను మోసం చేశారు.ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా రంకెలేస్తున్నారు.రేవంత్‌కు రచ్చ చేయడం తప్ప.. చర్చ చేయడం రాదు.రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తే చర్చకు ఆయన రాలేదు.రేవంత్ మాట తప్పుతారని తెలిసినా సవాల్‌ను స్వీకరించాం.సీఎం కాకపోయినా మంత్రి అయినా వస్తారని అనుకున్నాం.తెలంగాణ నిధులు ఢిల్లీకి పారిపోతున్నాయి.రైతులపై సీఎం రేవంత్ రెడ్డి గౌరవం లేదు.ఢిల్లీకి సీఎం ఎందుకు వెళ్లారని అడిగితే ఎరువుల కోసం అని చెబుతున్నారు.రైతుబంధు అందరికీ ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు.కొడంగల్‌లో ఎంత మంది రైతులకు రైతుబంధు పడలేదో లిస్ట్ రెడీగా ఉంది.రైతుల మరణాల లిస్ట్ కూడా తీసుకొచ్చాం.ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది. ఇప్పటికైనా మరోసారి సవాల్ చేస్తున్నా. రేవంత్‌తో చర్చకు సిద్ధం.. ప్లేస్ ఎక్కడో డిసైడ్ చేయాలని సవాల్ చేస్తున్నా. డేట్ కూడా మీరే ఫిక్స్ చేయండి.. ఎక్కడి రమ్మంటే అక్కడి వస్తాం. చర్చ కోసం రేవంత్ ఇంటికి రమ్మనా వెళ్తాం. రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు.. మేము చాలు. మీకు నిజాయితీ ఉంటే చర్చకు రండి. లేదంటే క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలీ కేటీఆర్చర్చకు వచ్చే సత్తా లేనప్పుడు.. రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ చేయొద్దురేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళింది యూరియా బస్తాల కోసం కాదుఏ బస్తాలు మోసి రేవంత్ ముఖ్యమంత్రి పదవి కాపాడుకుంటున్నారో అందరికీ తెలుసురేవంత్ రెడ్డికి రచ్చ చేయటమే తెలుసు. చర్చ చేయటం రాదుఏ బేసిన్ ఎక్కడుందో తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిరేవంత్ హాయాంలో నీళ్ళు ఆంధ్రకు.. నిధులు ఢిల్లీకి.. నియామకాలు రేవంత్ తొత్తులకుగురువు చంద్రబాబు కోసం తెలంగాణ నీళ్ళను ఆంధ్రకు పంపుతున్నారునాలుగు రోజులు మోసాలు చేసి రేవంత్ తప్పించుకోవచ్చు. ప్రజలు క్షమించరుసవాల్ విసిరి మాట తప్పటం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటు2018లో కొండగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పాడు అసెంబ్లీకి కాంగ్రెస్ నేతలు..అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుఅసెంబ్లీ వేదికగానే సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం.అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారు.సభ పెట్టేందుకు కేసీఆర్‌తో లేఖ రాయించండి.9 రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం.బీఆర్ఎస్ మాటలపై చర్చ పెడదాం. ప్రెస్‌క్లబ్‌కు కేటీఆర్‌ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్న కేటీఆర్‌ప్రెస్‌క్లబ్ వద్దకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు. ప్రెస్‌కబ్ల్‌లో సీఎం రేవంత్‌కు కుర్చీ వేసిన కేటీఆర్. తెలంగాణ భవన్ నుంచి ప్రెస్‌క్లబ్‌కు బయలుదేరిన కేటీఆర్‌భారీ కాన్వాయ్‌తో ప్రెస్‌క్లబ్‌కు కేటీఆర్. ప్రెస్‌క్లబ్ వద్ద టెన్షన్ టెన్షన్.. కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. బహిరంగ చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈరోజు ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకోనున్నారు. ఇక, ఇప్పటికే సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ వద్దకు బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు. దీంతో, ప్రెస్‌క్లబ్ ఎదుట భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.మరోవైపు.. తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రైతు సంక్షేమంపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ సవాల్ చేశారు. రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నాం. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నేతలు మర్చిపోయారు. హామీలు అమలు చేయాలని 18 నెలలుగా కోరుతున్నాం. అడ్డగోలు హామీలతో రైతులతో పాటు అందరినీ మోసం చేశారు. అసెంబ్లీలో చర్చ పెట్టరు.. పెట్టినా మాకు మైక్ ఇవ్వరు. దమ్ముంటే చర్చకు రావాలని రేవంత్ సవాల్ విసిరారు. రేవంత్ సవాల్‌ను స్వీకరించి ప్రెస్‌క్లబ్‌కు వెళ్తున్నాను. రేవంత్ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మంత్రులు అయిన వస్తారేమో చేస్తాం. మంత్రులతోనైనా మేం చర్చలకు సిద్దం అని అన్నారు.

భారత్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
జులై 10 నుంచి లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగబోయే మూడో టెస్ట్ కోసం 16 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ గస్ అట్కిన్సన్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. మిగతా జట్టు యధాతథంగా కొనసాగింది. రెండో టెస్ట్‌కు ముందు మరో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే తొలి మ్యాచ్‌లో గెలవడంతో ఇంగ్లండ్ అదే జట్టును రెండో టెస్ట్‌లోనూ కొనసాగించింది. దీంతో ఆర్చర్‌కు ఛాన్స్ దక్కలేదు. మూడో టెస్ట్ తుది జట్టులో ఆర్చర్ లేదా అట్కిన్సన్‌లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. తొలి రెండు టెస్ట్‌ల్లో పెద్దగా ప్రభావం చూపని క్రిస్ వోక్స్ స్థానంలో ఆర్చర్ లేదా అట్కిన్సన్ను ఆడించవచ్చు. మిగతా జట్టు మొత్తం యధాతథంగా కొనసాగే అవకాశం ఉంది.భారత్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు..బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్కాగా, తాజాగా ఎడ్జ్‌బాస్టన్‌లో ముగిసిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ 336 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో సత్తా చాటి చారిత్రక విజయం సాధించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు ఇదే తొలి విజయం (58 ఏళ్ల తర్వాత).608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 271 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆకాశ్‌దీప్ (21.2-2-99-6) నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్‌దీప్ మొత్తంగా 10 వికెట్ల ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి భారత గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. అంతకుముందు లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. నాలుగో టెస్ట్ జులై 23 నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో.. ఐదో టెస్ట్ జులై 31నుంచి ఓవల్‌లో ప్రారంభం కానుంది.

జన్మ సార్థకత వైఎస్‌కే చెల్లింది!
‘పుట్టిన రోజు పండగే ప్రతి ఒక్కరికి.. పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే’’ పాత సినిమా పాట ఇది. కాకపోతే... దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అతికినట్లు సరిపోతుంది ఇది. వచ్చిన అవకాశాలను ప్రజల కోసం వినియోగించిన తీరు గమనిస్తే పుట్టింది ఎందుకో తెలిసిన వ్యక్తులలో వైఎస్సార్ అగ్రభాగాన ఉంటారు. సంపన్న కుటుంబంలో జన్మించినా సామాన్యుల ప్రగతి కోసం తాపత్రయపడడం ఆయన ప్రత్యేకత. ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఆ విద్యకు సార్థకత తేవడానికి జమ్మలమడుగులో పేదల కోసం వైద్యశాల నిర్వహించారు. రూపాయి డాక్టర్‌గా సేవలందించి ప్రజల మన్నన చూరగొన్నారు. రాజకీయాలలోనూ ఆయన తన విధానాలను వదులుకోలేదు. ఎన్నో ఎగుడు దిగుడులు చూశారు. సవాళ్లు ఎదుర్కున్నారు. అయినా ఓటమి ఎరుగని నేతగా రికార్డు సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు... విభజిత ఏపీలోనూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఈ రికార్డు దక్కింది వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు జగన్‌కు మాత్రమే. ఎమ్మెల్యేగా పోటీచేసినా, ఎంపీగా ఎన్నికల బరిలో దిగినా ప్రజలు మాత్రం వారికే పట్టం కట్టారు. 1996లో కడప లోక్‌సభ సీటు నుంచి పోటీచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డిని ఓడించాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ అన్నింటినీ పటాపంచలు చేస్తూ గెలవడం ఒక సంచలనం. 1999లోనే ఆయన ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయి ఉండేవారు. కాని అప్పట్లో టీడీపీ బీజేపీతో అవకాశవాద పొత్తు పెట్టుకోవడం, కార్గిల్ యుద్ద ప్రభావం, ఒక్క ఓటుతో వాజ్ పేయి ప్రభుత్వాన్ని కోల్పోయారన్న సానుభూతి వంటి కారణాలు కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా చేశాయి. ఆ దశలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు వైఎస్ నాయకత్వం వహించారు. అప్పట్లోనూ చంద్రబాబు నాయుడు తన సహజశైలిలో వైఎస్ వ్యక్తిత్వ హననం నానా ప్రయత్నాలూ చేశారు. బ్యానర్లు కట్టారని, ఎన్నికల నిబంధనలు సరిగా పాటించలేదని, ర్యాలీలు తీశారన్న చిన్న చిన్న కారణాలపై కూడా కేసులు పెట్టించి వ్యతిరేక ప్రచారం చేసేవారు. వాటిని బూతద్దంలో చూపించే ప్రయత్నం జరిగేది. ఇందుకు టీడీపీ మీడియా తోడు ఉండనే ఉంది.1999లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా వైఎస్ దానిని ఛాలెంజ్ గా తీసుకున్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. తదుపరి పాదయాత్రను ప్లాన్ చేసుకుని జనంలోకి వెళ్లినప్పుడు కాంగ్రెస్ లోని ఇతర వర్గాలు వ్యతిరేకించాయి. సొంతంగా ఎదగడానికి యత్నిస్తున్నారని, భవిష్యత్తులో సోనియా గాంధీని కూడా ధిక్కరిస్తారని పితూరీలు చెప్పేవారు. అధిష్టానం కూడా అలాంటివాటిని ప్రోత్సహిస్తూండేది. దాంతో వైఎస్ కొన్నిసార్లు ఇబ్బందులు పడేవారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా మండు వేసవిలో పాదయాత్ర చేస్తూ రాజమండ్రి వద్ద అనారోగ్యానికి గురయ్యారు. సోనియా గాంధీని అక్కడకు తీసుకురావాలని కొంతమంది నేతలు యత్నించారు కాని ఎందువల్లో ఆమె రాలేదు. అయినా వైఎస్ తన పాదయాత్రను వదలి పెట్టలేదు. 2003లో చంద్రబాబు నాయుడుపై నక్సల్స్ దాడి చేసినప్పుడు వైఎస్ తిరుపతి వెళ్లి పరామర్శ చేసి దాడికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం వద్ద దీక్ష నిర్వహించారు. అప్పట్లో చంద్రబాబు సానుభూతి వస్తుందని ఆశించి శాసనసభను రద్దు చేశారు. కాని వివిధ కారణాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి. సానుభూతిని క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు చూశారు. పాదయాత్ర ద్వారా ప్రజలలో వచ్చిన ఆదరణను నిలబెట్టుకునేందుకు వైఎస్ యత్నించారు. ఆ క్రమంలో కాంగ్రెస్ గ్రూపులను సైతం కలుపుకుని వెళ్లడానికి సిద్దపడ్డారు. అక్కడ నుంచి ఆయన రాష్ట్ర చరిత్రను ,గతిని మార్చేశారని చెప్పాలి. 2004లో కాంగ్రెస్‌ను విజయపథంలోకి తీసుకువచ్చిన తర్వాత ఆయనకు సీఎం పదవి దక్కరాదని కొన్ని యత్నాలు జరగకపోలేదు. అయినా ఆయన తొణకలేదు. చివరికి వైఎస్ కాకుండా మరెవరికైనా సీఎం పదవి ఇస్తే ప్రభుత్వం నడవడం కష్టమని తెలుసుకుని, అధిష్టానం ప్రజల అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం మొదలు అనేక హామీల అమలుకు కృషి చేశారు. అంతకుముందు ఒకసారి ఎంపీల సమావేశంలోకాని, ఇతరత్రాకాని నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టకపోతే చరిత్ర హీనులవుతారని ఆనాటి పాలకులను రాజశేఖరరెడ్డి హెచ్చరించే వారు. వైఎస్‌కు భయపడి ఎన్నికలకు ముందు అప్పట్లో చంద్రబాబు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కాని 2004 వరకు ఆయన వాటిని ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. ఆ సమయంలో వైఎస్ ఒక కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన శిలాఫలకాల వద్ద పూలు పెట్టివచ్చారు. ఆ సంగతులు అన్నిటిని గుర్తుంచుకున్న వైఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన మరుసటి రోజునుంచే ప్రాజెక్టులపై సమీక్ష చేసి వాటిని ఎలా పరుగు పెట్టించాలా అని ఆలోచన చేశారు. వైఎస్ ఈ రోజు మన మధ్య లేకపోవచ్చు. ఉమ్మడి ఏపీలో ప్రాంతాలకు అతీతంగా ఆయన చేపట్టిన ప్రాజెక్టులు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తాయి. రాయలసీమకు ఉపయోగపడే పోతిరెడ్డిపాడు విస్తరణతో సహా హంద్రీ నీవా, గాలేరు-నగరి, గండికోట ఇలా పలు ప్రాజెక్టులను చేపట్టారు. తెలంగాణలో ఎల్లంపల్లి, కల్వకర్తి, బీమా, ప్రాణహిత-చేవెళ్ల మొదలైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కోస్తాంద్రలో పోలవరం, పులిచింతల, వంశధార, తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదలైవని ఉన్నాయి. పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలో తెలంగాణ వారితో పాటు ఆంధ్రకు చెందిన టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు, నిరసనలు ఎదుర్కున్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు తవ్వుతుంటే టీడీపీ ఎన్నో ఆటంకాలు కల్పించింది. అయినా ఆయన ఆగలేదు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి కావల్సిన అనుమతులు తేవడంలో వైఎస్ చూపిన శ్రద్ద నిరుపమానం. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ఒప్పుకున్నదంటే ఆ ఘనత ఆయనదే. పులిచింతల నిర్మాణం దశాబ్దాల తరబడి స్తంభించిపోతే వైఎస్సార్ దానిని చేసి చూపించారు. దానిని వ్యతిరేకించే తెలంగాణ కాంగ్రెస్ నేతలను సైతం ఒప్పించి మరీ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారు. ఒక నేత ఈ భారీ ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి కావని భావిస్తే, వైఎస్ మాత్రం మనం మొదలుపెడితే ఎవరో ఒకరు పూర్తి చేస్తారంటూ విశాల దృక్పథంతో ఆరంభించారు. ఈ రోజు విభజిత ఆంధ్ర ఈ మాత్రమైనా నిలబడిందంటే అది వైఎస్ గొప్పదనమని అంగీకరించక తప్పదు. ఇది మాబోటివాళ్లం ఇప్పుడు చెప్పడం లేదు. 2009 నుంచే చెబుతున్నాం. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం కట్టిన ఒక సీఎం హైదరాబాద్ తానే నిర్మించానని ప్రచారం చేసుకుంటారు. కాని వైఎస్ ప్రచారం లేకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఒక రూపం తెచ్చారు. అదంతా ఒక ఆధునిక నగరంగా మారిందంటే బీపీ ఆచార్య అనే ఐఎఎస్ అధికారిని నియోగించి వైఎస్ చేసిన కృషే అని చాలామందికి తెలియక పోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా దానిని ప్రచారం చేసుకోలేకపోయింది. టీడీపీ మీడియా నుంచి విపరీతమైన వ్యతిరేకతను భరిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం మూడువంతులు పూర్తిచేశారు. హైదరాబాద్ దశ, దిశను మార్చిన గొప్ప ప్రాజెక్టు అది. శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణమే కాకుండా, అక్కడకు వెళ్లడానికి వీలుగా ఎక్స్‌ప్రెస్ వంతెనను 13 కిలోమీటర్ల దూరం నిర్మించడం ద్వారా ఆయనకు ఉన్న విజన్‌ను ప్రజలకు తెలియ చేశారు. పేదల కోసం ఆరోగ్యశ్రీని తీసుకువచ్చిన నేతగా, విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ ను ప్రవేశపెట్టి పేదలకు విద్యాదానం చేసిన వ్యక్తిగా చరిత్రపుటలలోకి ఎక్కారు. 2009లో ఆయనను ఓడించడానికి టీడీపీ ఏకంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీర్మానం చేసిందంటేనే వైఎస్ ఎంత శక్తిమంతుడుగా అవతరించారో అర్థం చేసుకోవచ్చు. పరస్పర విరుద్ద భావాలు కలిగిన టీడీపీ, టీఆర్ఎస్(నేటి బీఆర్ఎస్), సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు కూటమి కట్టినా 2009లో వైఎస్‌ను ఓడించలేకపోయాయి. మొత్తం బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మరోసారి రావడానికి కూడా వైఎస్ కారణభూతులయ్యారు. అయినా ఆ తర్వాత పరిణామాలలో కాంగ్రెస్ అధిష్టానం ఎందుకో తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. వైఎస్ జీవించి ఉన్నా, వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్‌ను సీఎంగా చేసినా ఉమ్మడి ఏపీ భవిష్యత్తు మరోలా ఉండేదని చాలామంది నమ్ముతారు. ఏది ఏమైనా వైఎస్ సీఎంగా చేసింది ఐదేళ్ల మూడునెలల కాలమే అయినా, ఒక శతాబ్దానికి సరిపడా పేరు తెచ్చుకుని గొప్పనేతగా ప్రజల మదిలో నిలిచిపోయారు.వైఎస్ రాజశేఖరరెడ్డికి జయంతి సందర్భంగా ఇదే నివాళి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ ఈ రోజు పుంజుకుంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

నా తల్లిని బెదిరించారు.. నేను ఇంట్లో ఉంటే చంపేవారు: ప్రసన్నకుమార్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయి. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. ఈ నేపథ్యంలో పచ్చ మూకల దాడిపై ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంట్లో ఉంటే ఆయనను కచ్చితంగా హత్య చేసేవారిని అన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిన్న రాత్రి నా నివాసం పై జరిగిన దాడి నన్ను హతమార్చడానికే అని అర్థమవుతోంది. నేను ఇంట్లో ఉండి ఉంటే నన్ను ఖచ్చితంగా చంపేసేవారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నా తల్లిని బెదిరించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయాలకు పాల్పడతారని అనుకోలేదు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చరిత్ర నెల్లూరు వాసులు అందరికీ తెలిసిన విషయమే. నేను చేసిన ప్రతీ వ్యాఖ్యకి కట్టుబడి ఉన్నాను. గతంలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఈ దాడి విషయంలో పోలీస్ శాఖ న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు లేదు. ఇటువంటి దాడులపై పవన్ కళ్యాణ్ స్పందించాలి. డిప్యూటీ సీఎం అయిపోయినంత మాత్రాన కుర్చీలో కూర్చుని పోవటం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. మరోవైపు.. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మీ మాట్లాడుతూ..‘200 మంది అరాచక వ్యక్తులు ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించారు. కంటికి కనపడిన వస్తువులు అన్నింటినీ ధ్వంసం చేశారు. నీ కుమారుడు ఎక్కడ అంటూ నన్ను బెదిరించారు. నాకు ఆరోగ్యం సరిగా లేదు. నిన్న రాత్రి జరిగిన ఘటనతో భయాందోళనకు గురయ్యాను. ఇలాంటి దాడులు ఏనాడు చూడలేదు. నా కుమారుడు ఇంట్లో ఉండి ఉంటే అతన్ని చంపేసేవారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మారణాయుధాలతో దాడి..ఇదిలా ఉండగా.. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. 70–80 మంది సోమవారం రాత్రి 9 గంటల సమయంలో మారణాయుధాలతో నెల్లూరు నగరం సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. వారిని ఎవరూ గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను ముందుగా ధ్వంసంచేశారు. ఇంటి ముందు నుంచి కొందరు.. వెనుక వైపు కిచెన్ తలుపులను పగులగొట్టి మరికొందరు లోపలికి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. కింద గదితోపాటు పైభాగంలోని గదిలో వస్తువులన్నింటినీ పగులగొట్టారు. అడ్డుకోబోయిన సిబ్బందిపైనా పచ్చమూకలు దాడిచేశాయి. పోర్టికోలో ఉన్న రెండు కార్లను ధ్వంసం చేశారు. అరగంట పాటు నానా బీభత్సం సృష్టించారు. కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ టీడీపీ మూకల దాడితో భీతిల్లిపోయి కుప్పకూలిపోయారు. తమతో పెట్టుకుంటే అంతుచూస్తామని, ఎవరిని వదిలిపెట్టబోమని దుండగులు హెచ్చరించారు.అయితే, పోలీసులు వస్తున్నారని తెలుసుకుని దుండగులు బైక్‌లపై పరారయ్యారు. దాడి సమాచారం అందుకున్న నెల్లూరు నగర డీఎస్పీ పి. సింధుప్రియ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. మంత్రి లోక్‌శ్ నెల్లూరులో ఉండగానే ఈ ఘటన జరగడం చూస్తే.. దీని వెనుక పెద్దస్థాయిలో కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రసన్నను హత్య చేసేందుకేనా?దుండగులు పథకం ప్రకారం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని హత్యచేసేందుకే ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. రాత్రయితే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో ఉంటారని భావించిన దుండగులు మారణాయుధాలతో ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆ సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డి లేకపోవడంతో ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. కోవూరు సమావేశం అనంతరం ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆయన కుమారుడు, స్థానిక నేతలతో కలిసి కోవూరులోనే ఉన్నారు. ఇంట్లో ఉండి ఉంటే ఆయన పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు.

సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి పితృవియోగం కలిగింది. కీరవాణి తండ్రి 'శివశక్తి దత్త' (92) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఆయన తెలుగు సినిమా గీత రచయిత, స్క్రీన్ రైటర్, చిత్రకారుడిగా గుర్తింపు పొందారు. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా గీత రచయితగా అనేక పాటలను రచించారు. ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘రామం రాఘవం’ ను ఆయనే రాశారు. అతను తెలుగు చిత్రాలలో సంస్కృతం ఆధారిత పాటలకు సాహిత్యాన్ని వ్రాసినందుకు ప్రసిద్ధి చెందారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్తా సోదరులు అనే విషయం తెలిసిందే.ఆంధ్ర ప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలోని కొవ్వూరుకు చెందిన శివశక్తి దత్తా అప్పట్లోనే ఇంటర్ వరకు చదువుకున్నారు. చిన్నప్పటి నుంచీ కళల వైపు మొగ్గు చూపిన అతను చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయి ముంబైలోని సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చేరారు . రెండు సంవత్సరాల తరువాత డిప్లొమా పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత మళ్లీ తన స్వస్థలం కొవ్వూరుకు తిరిగి వచ్చారు. చిత్రకారుడిగా కమలేష్ అనే కలం పేరును ఉపయోగించడం ప్రారంభించారు . తరువాత సుబ్బారావు తన పేరును శివ శక్తి దత్తగా మార్చుకున్నారు. దత్తాకు సంగీతంపై కూడా ఆసక్తి ఉంది. గిటార్ , సితార్ , హార్మోనియం వాయించడం నేర్చుకున్నారు.రాఘవేంద్రరావుతో తొలిసారి జానకి రాముడు (1988) కోసం స్క్రీన్ రైటర్‌గా శివశక్తి దత్తా పనిచేశారు. సై , చత్రపతి , రాజన్న , బాహుబలి: ది బిగినింగ్ , బాహుబలి 2: ది కన్‌క్లూజన్ , RRR , హను-మాన్ వంటి చిత్రాలలో వివిధ పాటలకు సాహిత్యం రాశారు . దర్శకుడిగా చంద్రహాస్ (2007) సినిమా కోసం ఆయన పనిచేశారు. బాహుబలి సినిమాలో 'సాహోరే బాహుబలి' , 'మమతల తల్లి' 'దీవర' వంటి సాంగ్స్ రాశారు.

ఎన్నికల వేళ.. బీహార్‌కు కనీవినీ ఎరుగని వరాలు
పట్నా: ఈ ఏడాది చివరిలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ సందడి మొదలయ్యింది. వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో తలమునకలై ఉన్నాయి. ఇదే సమయంలో కేంద్ర రైల్వే మంత్రి బీహార్‌లో కొత్తగా ప్రారంభమయ్యే రైళ్లు, రైలు ప్రాజెక్టులు, టెక్ పార్కుల గురించిన వివరాలను వెల్లడించారు.బీహార్‌లో పర్యటించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో చేపట్టబోయే కార్యక్రమాలను మీడియాకు తెలిపారు. బీహార్‌ను దేశంలోని పలు నగరాలతో అనుసంధానించే బహుళ రైలు సర్వీసుల ప్రణాళికలను ఆవిష్కరించారు.కొత్త రైళ్లుపట్నా నుండి ఢిల్లీ: పట్నా-ఢిల్లీ కారిడార్‌ను బలోపేతం చేస్తూ, కొత్తగా రోజూ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపనున్నట్లు మంత్రి తెలిపారు.దర్భంగా నుండి లక్నో (గోమతి నగర్): వారంలో ఒక్కరోజు నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ప్రారంభం కానుంది.మాల్డా టౌన్ నుండి లక్నో (గోమతి నగర్): పశ్చిమ బెంగాల్- ఉత్తరప్రదేశ్‌లను బీహార్ ద్వారా కలుపుతూ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నారు.జోగ్బాని నుండి ఈరోడ్ (తమిళనాడు): బీహార్‌ను దక్షిణ భారతానికి అనుసంధానించే రోజువారీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపైకి ఎక్కనుంది.సహర్సా నుండి అమృత్సర్: పంజాబ్‌కు కనెక్టివిటీని పెంచేందుకు కొత్తగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టనున్నారు.మౌలిక సదుపాయాలుభాగల్పూర్-జమాల్పూర్ మూడవ లైన్: రూ. 1,156 కోట్ల అంచనా వ్యయంతో 53 కి.మీ. మేరకు కొత్త మూడవ రైల్వే లైన్ త్వరలో మంజూరు కానుంది.భక్తియార్పూర్-రాజ్‌గిర్-తిలైయా డబ్లింగ్: రూ. 2,017 కోట్ల అంచనా వ్యయంతో 104 కి.మీ. కంటే ఎక్కువ ట్రాక్‌ల డబ్లింగ్ ఏర్పాటు కానుంది.రాంపూర్హాట్-భాగల్పూర్ డబ్లింగ్: రూ. 3,000 కోట్ల అంచనా వ్యయంతో 177 కి.మీ. మేరకు మరో డబ్లింగ్ ప్రాజెక్ట్ మంజూరు కానుంది.సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులురైల్వే మౌలిక సదుపాయాలతో పాటు, బీహార్‌లో సాంకేతిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా రెండు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

తప్పెవరిది?.. తమిళనాడు ఘోర ప్రమాదంపై చర్చ
తమిళనాడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఓ స్కూల్ వ్యాన్ పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.సాక్షి, చెన్నై: తమిళనాడు కడలూరులో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం చెమ్మంగుప్పం వద్ద ఓ స్కూల్ వ్యాన్ రైలు పట్టాలను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది విధ్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే.. గేట్‌మేన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందన్న విమర్శలు వినిపిస్తుండగా.. మరోవైపు డ్రైవర్ కోరితేనే తాను గేటు తెరిచానని గేట్‌మేన్ చెబుతున్నాడు. ఈ క్రమంలో తప్పెవరిదనే చర్చ నడుస్తోంది. ఈలోపు గేట్‌మేన్ పంకజ్‌శర్మను రైల్వే అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రమాదం ధాటికి వ్యాన్ చిన్నారుల మృతదేహాలు ముక్కలై పడ్డాయి. రైలు ఢీ కొట్టిన వేగానికి 50 మీటర్ల దూరం ఎగిరిపడి తుక్కు అయిన వ్యాన్ దృశ్యాలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి.கேட் கீப்பரின் அலட்சியத்தால் பள்ளி வேன் மீது ரயில் மோதி 2 மாணவர்கள் ப**யான கோர விபத்து... தண்டவாளத்தில் சிதறிக்கிடந்த புத்தகப்பை... மனதை நொறுக்கிய காட்சிகள்....!#Cuddalore | #SchoolVan | #RailwayTrack | #GateKeeper | #CuddaloreAccidentUpdate | #TrainAccident | #PolimerNews pic.twitter.com/yv79s6oamO— Polimer News (@polimernews) July 8, 2025

వాకింగూ కాదు, రన్నింగూ కాదు అరవైలో ఇరవైలా ఫిట్‌గా : ఇవిగో టిప్స్
సాక్షి, హైదరాబాద్: వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అధిక శాతం మంది నడక లేదా స్వల్ప శరీర వ్యాయామమే సరిపోతుందనుకుంటారు. అయితే.. తాజాగా హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్య యనం ప్రకారం చూస్తే.. వయసు పైబడినవారు ఆరో గ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే కేవలం నడక సరిపో దని.. మొత్తంగా వారి ఆలోచనల్లో మార్పు రావడానికి శారీరకంగా చైతన్యంగా ఉండేందుకు కదలికలు అవసరమని వెల్లడైంది. ఈ ప్రయోగంలో శరీరానికి మాత్రమే కాక, మనసుకు కూడా ఉత్తేజం కలిగించే వ్యాయామాల ప్రాధాన్యాన్ని వివరించారు. తై చీ, ఐకిడో, వింగ్ చున్.. వంటి మార్షల్ ఆర్ట్స్ పద్ధతులు వృద్ధుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఈ అధ్యయ నంలో పేర్కొన్నారు.ఏమిటీ అధ్యయనం..?హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ పీటర్ ఎం.వె యిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరిశీలనలో తై చీ వంటి నెమ్మదిగా, స్వల్ప కదలి కలతో సాగే మార్షల్ ఆర్ట్స్ మనుషుల శరీరంలో ‘ఫిజి యొలాజికల్ కాంప్లెక్సిటీ’ ను పెంచుతాయని వెల్లడైంది. అంటే.. వృద్ధాప్యంలో ఎదురయ్యే అడ్డంకులకు మెరుగ్గా స్పందించే సామర్థ్యం శరీరానికి పెరుగుతుందని తేలింది.ఇవి కేవలం శారీరక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాక, జీవన నాణ్యత మెరుగుదలకు తోడ్పడుతున్నట్టు స్పష్ట మైంది. ఇప్పటిదాకా మన దగ్గర పెద్దల ఆరోగ్యంపై దృష్టి చికిత్సాపరంగా ఉండేది. కానీ తాజా అధ్యయనం సూచిస్తున్న మార్గం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, పునరావాస కేంద్రాలు, సామాజిక కార్యక్రమాల రూపంలో మార్షల్ ఆర్ట్స్ వంటి చురుకైన లేదా మృదువైన కదలికలతో కూడిన వ్యాయామాలను ప్రవే శపెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది.నడకతో పోలిస్తే ?నడక.. కేవలం కాలి కదలికలతో పరిమితమైన వ్యాయామం. తైచీ.. శరీరం, శ్వాస, మేధస్సు.. మూడింటినీ ఒకే సమయంలో సమతుల్యంగా ఉత్తేజపరిచే ప్రక్రియ. వృద్ధులకు.. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి సులభ, స్వల్ప తరహా మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయి.ఇది వృద్ధుల్లో.. తూలిపడిపోవడం వంటి వాటిని తగ్గిస్తుందినిద్ర నాణ్యత మెరుగవుతుందిమానసిక స్థైర్యం పెరుగుతుందితెలుగు రాష్ట్రాల్లో వృద్ధుల పరిస్థితి మార్పు ఆవశ్యకత..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వృద్ధుల జనాభా అనేది 13 శాతానికి పైగా ఉందని 2011 జనగణన ద్వారా వెల్లడైంది. 2036 నాటికి ఇది 20 శాతం దాటే అవకాశం ఉంది. ఈ వయోధిక వర్గానికి సరిపడే ఆరోగ్య విధానాలు, శారీరక దృఢత్వం కలిగించే వ్యాయామాలను అందుబాటులోకి తేవడం అత్యవసరం.వృద్ధులకు ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ తగినవి.. ఉపయోగాలు..తై చీ: నెమ్మదిగా జరిగే ప్రవాహ రూప కదలికలు, శ్వాస నియంత్రణ, శరీర సమతుల్యత, మానసిక ప్రశాంతతఐకిడో: శక్తిని మళ్లించే శక్తివంతమైన కాన్సెప్ట్, కణజాలానికి మెరుగైన కదలికలువింగ్ చున్: ఓ మోస్తరు క్లిష్టమైన కదలికలు, మెరుగైన ప్రతిస్పందన సామర్థ్యం, స్వీయ రక్షణఇదీ చదవండి: జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గిందివృద్ధాప్యం ఓ ప్రతిబంధకం కాదు. అది మనం కొత్త విషయాలు నేర్చుకోవాలనే సంకల్పానికి తెరలేపే అవకాశంగా భావించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశంపై వృద్ధుల్లోనే కాకుండా అందరి ఆలోచనా ధోరణిలోనూ మార్పు వచ్చి అవగాహన పెరిగితే సమాజానికి మంచి ప్రయోజనా లు చేకూరుతాయని స్పష్టం చేస్తున్నా రు. వృద్ధుల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడడంతో పాటు.. 60 ఏళ్ల తర్వాత జీవితానికి సంబంధించి కచ్చితమైన అవగాహన, చైతన్యం ఏర్పడతాయని వారు పేర్కొంటున్నారు.చదవండి: 300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు
జైలు నుంచే స్కెచ్ గీసి.. గోపాల్ ఖేమ్కా కేసులో షాకింగ్ విషయాలు
ఓటీటీలోకి ముగ్గురు హీరోల మాస్ డ్రామా ‘భైరవం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
భారత్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
అరుదైన వ్యాధికి ఎక్మో చికిత్స: 11 నెలల చిన్నారిని కాపాడిన అంకుర వైద్యులు
కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..
‘మాతృభాష తప్పనిసరి’.. ఆ రాష్ట్రాలకు ఆర్ఎస్ఎస్ మద్దతు?
ఆ అధికారిణి ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే..! భారీ కింగ్ కోబ్రానే..
జట్టులోనే ఉండడు.. ఖేల్ ఖతం అనుకున్నాం.. కానీ: భారత మాజీ బ్యాటర్
హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రారంభం
HYD: నేడు వైఎస్సార్ అభిమానుల ఆత్మీయ సమావేశం
జియో కొత్త ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఏడాది వ్యాలిడిటీ
'కన్పప్ప'లో వాళ్లను చూస్తుంటే ఇరిటేషన్ వచ్చింది: తమ్మారెడ్డి భరద్వాజ
ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఆకస్మిక ధనలాభం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
అలాగే, తనకు నోబెల్ వచ్చేటట్లు అర్జంటుగా ఏదైనా ఒక చట్టం చేయమంటున్నారు!!
వనిందు హసరంగా ప్రపంచ రికార్డు.. వన్డేల్లో తొలి ప్లేయర్‌గా
సర్కారు ఇప్పుడొద్దన్నవారికీ ఇందిరమ్మ ఇళ్లు!
ఒక్క ఏడాదిలో రూ.8,500 కోట్లు తీసుకొచ్చా..
డేట్ ఫిక్స్?
'సంక్రాంతికి వస్తున్నాం-2 వస్తే ఆరుగురు ఉంటారు'
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. సంఘంలో ఆదరణ
ఫ్రాన్స్ సంచలన ఆరోపణలు.. చైనా, పాక్‌లు కలిసి..!
శాంతించిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం డోసు కాస్త తగ్గింది..!
క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని వదిలేసిన సౌతాఫ్రికా కెప్టెన్
ప్రాణం తీసుకున్న బీటెక్ విద్యార్థిని.. కారణం ఆమె స్నేహితులే!
మస్క్ అమెరికా పార్టీ అమెరికన్ల స్వేచ్ఛ కోసమేనని వ్యాఖ్యలు
ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు
అయ్యో.. ఇలా ఎందుకు చేశావు గిల్?.. చిక్కుల్లో కెప్టెన్?!
బాబుకు హైకోర్టు షాక్.. మీ ఇష్టమొచ్చినట్టు అరెస్టులు చేస్తే కుదరదు
జైలు నుంచే స్కెచ్ గీసి.. గోపాల్ ఖేమ్కా కేసులో షాకింగ్ విషయాలు
ఓటీటీలోకి ముగ్గురు హీరోల మాస్ డ్రామా ‘భైరవం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
భారత్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
అరుదైన వ్యాధికి ఎక్మో చికిత్స: 11 నెలల చిన్నారిని కాపాడిన అంకుర వైద్యులు
కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..
‘మాతృభాష తప్పనిసరి’.. ఆ రాష్ట్రాలకు ఆర్ఎస్ఎస్ మద్దతు?
ఆ అధికారిణి ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే..! భారీ కింగ్ కోబ్రానే..
జట్టులోనే ఉండడు.. ఖేల్ ఖతం అనుకున్నాం.. కానీ: భారత మాజీ బ్యాటర్
హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రారంభం
HYD: నేడు వైఎస్సార్ అభిమానుల ఆత్మీయ సమావేశం
జియో కొత్త ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఏడాది వ్యాలిడిటీ
'కన్పప్ప'లో వాళ్లను చూస్తుంటే ఇరిటేషన్ వచ్చింది: తమ్మారెడ్డి భరద్వాజ
ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఆకస్మిక ధనలాభం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
అలాగే, తనకు నోబెల్ వచ్చేటట్లు అర్జంటుగా ఏదైనా ఒక చట్టం చేయమంటున్నారు!!
వనిందు హసరంగా ప్రపంచ రికార్డు.. వన్డేల్లో తొలి ప్లేయర్‌గా
సర్కారు ఇప్పుడొద్దన్నవారికీ ఇందిరమ్మ ఇళ్లు!
ఒక్క ఏడాదిలో రూ.8,500 కోట్లు తీసుకొచ్చా..
డేట్ ఫిక్స్?
'సంక్రాంతికి వస్తున్నాం-2 వస్తే ఆరుగురు ఉంటారు'
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. సంఘంలో ఆదరణ
ఫ్రాన్స్ సంచలన ఆరోపణలు.. చైనా, పాక్‌లు కలిసి..!
శాంతించిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం డోసు కాస్త తగ్గింది..!
క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని వదిలేసిన సౌతాఫ్రికా కెప్టెన్
ప్రాణం తీసుకున్న బీటెక్ విద్యార్థిని.. కారణం ఆమె స్నేహితులే!
మస్క్ అమెరికా పార్టీ అమెరికన్ల స్వేచ్ఛ కోసమేనని వ్యాఖ్యలు
ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు
అయ్యో.. ఇలా ఎందుకు చేశావు గిల్?.. చిక్కుల్లో కెప్టెన్?!
ముగ్గురు పిల్లల తల్లి.. యువకుడితో వివాహేతర సంబంధం..!
సినిమా

'విక్రమ్ వేద' తర్వాత బిగ్ హీరోతో దర్శక ద్వయం సినిమా
సౌత్ ఇండియా చిత్రపరిశ్రమకు చెందిన నటుడు శివకార్తికేయన్( Sivakarthikeyan) సక్సెస్ఫుల్ బాటలో పరిగెడుతున్నాడు. ఇప్పటికే అయలాన్, మావీరన్, అమరన్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన ఆయన ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మదరాసీ, సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో మదరాసీ చిత్రం ముందుగా తెరపైకి రానుందని సమాచారం. కాగా పరాశక్తి తరువాత శివకార్తికేయన్ నటించే చిత్రం ఏమిటన్న ప్రశ్నకు సమాధానంగా తాజాగా ఒక ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు మాధవన్, విజయ్‌సేతుపతి హీరోలుగా విక్రమ్ వేదా వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన పుష్కర్–గాయత్రిల దర్శక ద్వయం ఆ తరువాత మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు. అయితే సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి సుడల్ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. అలాంటిది తాజాగా ఈ దర్శక ద్వయం మళ్లీ మెగాఫోన్ పట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటుడు శివకార్తికేయన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. పుష్కర్–గాయత్రి చెప్పిన కథ శివకార్తికేయన్‌కు నచ్చిందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. కాగా నటుడు శివకార్తికేయన్ గుడ్‌నైట్ చిత్రం ఫేమ్ వినాయక్ చంద్రశేఖరన్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి వీటిలో ఏ చిత్రం ముందుగా సెట్‌పైకి వెళుతుందో చూడాలి.

పూరి సేతుపతి ఆరంభం
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పూరి సేతుపతి’ (వర్కింగ్ టైటిల్) సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. సంయుక్త హీరోయిన్గా, టబు, విజయ్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పణలో పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా సోమవారం నుంచి హైదరాబాద్‌లో ‘పూరి సేతుపతి’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందని ప్రకటించారు మేకర్స్.‘‘విజయ్ సేతుపతి, సంయుక్తలతో పాటు ఇతర కీలక తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇందుకోసం భారీ సెట్ వేశాం. ఎలాంటి బ్రేక్స్ లేకుండా షూటింగ్ శరవేగంగా జరిగేలా ప్లాన్ చేశాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది.

జోరుగా హుషారుగా...
‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత కొత్త సినిమాలను ఖరారు చేయడంలో వెంకటేష్ జోరు పెంచారు. ఆయన నటించనున్న కొత్త సినిమాలపై స్పష్టత వచ్చింది. అమెరికాలో జరిగిన ‘నాట్స్–2025’ వేడుకల్లో తన తర్వాతి చిత్రాల గురించి వెంకటేశ్ హుషారుగా మాట్లాడారు. ‘‘త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నాను. అలాగే చిరంజీవి సినిమాలో అతిథి పాత్రలో నటిస్తాను.మీనాతో కలిసి ఓ సినిమా చేస్తాను (దృశ్యం 3). ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత అనిల్ రావిపూడి దర్వకత్వంలోనే మరో సినిమా ఉంది. ఈ చిత్రాలతో పాటు నా మిత్రుడు, తెలుగులో ఓ పెద్ద స్టార్ హీరోతో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాను’’ అని తెలిపారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ చేయబోయే సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’ అని, అలాగే వెంకటేశ్ ప్రస్తావించిన భారీ ప్రాజెక్ట్ బాలకృష్ణతో ఉంటుందనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బీచ్‌లో యాంకర్ శ్రీముఖి పోజులు.. మిచిగాన్ వీధుల్లో సమంత చిల్!
గ్రీన్ డ్రెస్‌లో సింగర్ కెన్నీషా హోయలు..లండన్‌లో చిల్ అవుతోన్న లక్ష్మీ రాయ్..బీచ్‌లో యాంకర్ శ్రీముఖి పోజులు...మిచిగాన్ వీధుల్లో హీరోయిన్ సమంత..వెకేషన్లో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ చిల్.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Neha Kakkar (@nehakakkar) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by KENEESHAA (@keneeshaa1) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

బాధపడకు తమ్ముడు!.. ఇంకో ఆర్నెళ్ల సమయం ఉంది.. అన్నీ తానై..
లక్నో: భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) విజయవంతమైన బౌలింగ్ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసిన అతని సోదరి అఖండ్ జ్యోతి సింగ్ భావోద్వేగానికి గురైంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న జ్యోతికి.. ఎడ్జ్‌బాస్టన్‌లోని పది వికెట్ల ప్రదర్శన అంకితమిస్తున్నట్లు మ్యాచ్ ముగిసిన అనంతరం ఆకాశ్‌దీప్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ఓ వార్తా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన జ్యోతి తన సోదరుడికి తన ఆనారోగ్యంపై చింతించకుండా దేశం కోసం శ్రమించాలని చెప్పినట్లు వెల్లడించింది.మా నాన్న చనిపోయినపుడు..క్యాన్సర్ బారిన పడటంతో తన కుటుంబానికి దూరమైన ఆనందాన్ని ఆకాశ్‌దీప్ తన ఆటతీరు ద్వారా తిరిగి తీసుకొచ్చాడని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తమ కుటుంబాన్ని 2015 ఏడాది పెను విషాదంలో ముంచిందని... మళ్లీ ఇన్నాళ్లకు ఆనందం వెల్లివిరిసిందని జ్యోతి చెప్పింది. ‘మా నాన్న చనిపోయినపుడు ఆకాశ్ ఢిల్లీలో క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే ఆశించిన ఎదుగుదల రాలేదు. దీంతో నేను గట్టిగా చెప్పాను. క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకుంటేనే రాణిస్తావని చెప్పా. ఇక్కడ కుదరకపోతే మరో చోటయినా ప్రయత్నించాలని సూచించాను. దీంతో 2017లో కోల్‌కతాకు మారాక బెంగాల్ అండర్–23 జట్టు తరఫున నిలకడగా రాణించడం మొదలుపెట్టాడు. ఒకే ఏడాది తండ్రి, ఓ తమ్ముడు మరణించడంతో మా కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అయినా సరే దేనికి దిగులు చెందక ఆకాశ్ లక్ష్యాన్ని చేరుకునేందుకు మా వంతు ప్రయత్నం మేం చేశాం’ అని జ్యోతి వివరించింది.జబ్బు గురించి చెప్పాలనుకోలేదు ఈ మ్యాచ్‌ను మేమంతా చూశాం. వికెట్ తీసిన ప్రతీసారి గట్టిగా చప్పట్లతో సంబరం చేసుకున్నాం. దీంతో ఇరుగు పొరుగువారు వచ్చి ఏమైందని అడిగి వెళ్లిపోయారు. దేశానికి విజయాన్నిచ్చిన అతని ప్రదర్శన మాకైతే పండగను తెచ్చింది. ఇక మీడియాలో నా జబ్బు సంగతి చెప్పినట్లు మొదట తెలియదు.ఎందుకంటే నా క్యాన్సర్ గురించి బయటికి వెల్లడించేందుకు మా కుటుంబం సిద్ధంగా లేదు. బహుశా నాపై అప్యాయత కొద్దీ ఆ క్షణం భావోద్వేగానికి గురై అక్కకు అంకితం చేస్తున్నానని చెప్పి ఉండొచ్చు. నేనన్నా... కుటుంబమన్నా అతనికి వల్లమాలిన ప్రేమ. నాకిప్పుడు క్యాన్సర్ మూడో దశలో ఉంది. ఇంకో ఆర్నేళ్ల చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఆ తర్వాతే ఏమవుతుందో చూడాలి. ఐపీఎల్ సమయంలో హాస్పిటల్‌కు... ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించే ఆకాశ్ లీగ్ జరిగే సమయంలో పది వేదికలు మార్చి మార్చి ఆడే అంతటి బిజీ షెడ్యూల్లోనూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నన్ను పరామార్శించేందుకు మ్యాచ్ ముందో, తర్వాతో తప్పకుండా వచ్చేవాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికపై విజయం సాధించాక రెండుసార్లు వీడియో కాల్లో మాట్లాడుకున్నాం.అప్పుడు అతను.. నాతో .. ‘‘అక్క ఏమాత్రం బాధపడకు. దేశం మొత్తం మనవెంటే ఉందని చెప్పడంతో ఆ క్షణం నన్ను నేను నియంత్రించుకోలేక భావోద్వేగానికి గురై ఏడ్చేశాను. నిజం చెబుతున్నా... ఇలాంటి తమ్ముడు చాలా అరుదుగా ఉంటాడు. మాకెప్పుడు అండగా ఉంటాడు. మాకు చెప్పందే ఏదీ చేయడు. ప్రతి విషయాన్ని కుటుంబంతో పంచుకుంటాడు. ఆర్నెళ్ల వ్యవధిలోనే మా నాన్న, ఒక సోదరుడు మరణించడంతో కుటుంబభారాన్ని ఆకాశే అన్నీ తానై మోస్తున్నాడు.ఆకాశమంత ధైర్యం నేను క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆకాశ్ మాటలే నా స్థయిర్యాన్ని పెంచేవి. నా ఆరోగ్యం గురించే ఆలోచించేవాడు. అప్పుడు నేను అతని దృష్టి ఆటపైనే కేంద్రీకరించేందుకు ధైర్యం చెప్పేదాన్ని. ‘నేనిప్పుడు బాగానే ఉన్నాను. నా కోసం బాధపడొద్దు. నాకు తోడుగా నా భర్త ఉన్నాడు. నీవేం విచారించకు’ అని చెబితే... వెంటనే కల్పించుకుని తానేం చేసినా, సాధించినా సోదరిల కోసం, కుటుంబం కోసమే అని బదులిచ్చాడు.మా తల్లిదండ్రులకు మేం ఆరుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలం. ఆకాశ్ అందరికంటే చిన్నవాడు. నేను తనకంటే పదేళ్లు పెద్ద. చిన్నప్పటి నుంచి కూడా మా ఇద్దరి మధ్య ఆప్యాయత ఎక్కువే. మ్యాచ్‌కు ముందు, తర్వాత నాకు వీడియో కాల్ చేసి మాట్లాడతాడు. నేను తీసిన ఈ వికెట్లు నీ కోసం, దేశం కోసం’ అని గర్వంగా చెబుతాడు.రాగానే దహీ వడ తినిపిస్తా ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి రాగానే ఆకాశ్ దీప్‌కు ఇష్టమైన వంట చేసి పెడతా. తనకిష్టమైనవే కాదు... తను ఏం కావాలన్నా సరే వండిపెడతా. నేను చేసే దహీ వడ అంటే అతనికెంతో ఇష్టం. ఆకుకూరలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటాడు. మా ఇంటికి ఎప్పుడొచ్చినా అవే చేసిపెట్టాలంటాడు. చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్

వరుసగా మూడో మ్యాచ్‌లోనూ సెంచరీ చేసిన టీమిండియా యువ సంచలన
టీమిండియా యువ సంచనలం ముషీర్ ఖాన్ ఇంగ్లండ్ పర్యటనలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోతున్నాడు. వరుస సెంచరీలు, ఐదు వికెట్ల ప్రదర్శనలతో దుమ్మురేపుతున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎమర్జింగ్ టీమ్ (MCA Colts) తరఫున ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న ముషీర్ ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నాడు.ఈ పర్యటనలో Notts 2nd XIతో జరిగిన తొలి మ్యాచ్‌లో 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 123 పరుగులు చేసిన ముషీర్.. ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ ఇరగదీసి 6 వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం జులై 3న ఛాలెంజర్స్‌తో (కంబైన్డ్ నేషనల్ కౌంటీస్) ప్రారంభమైన రెండో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (127 బంతుల్లో 125; 11 ఫోర్లు, సిక్స్) చేసిన ముషీర్.. బౌలింగ్‌లోనూ చెలరేగి ఆ మ్యాచ్ మొత్తంలో పది వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 4) తీశాడు.తాజాగా ముషీర్ లౌబరో UCCE జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో ముషీర్ 146 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ముషీర్‌కు ఇంగ్లండ్ పర్యటనలో ఇది వరుసగా మూడో సెంచరీ.హ్యాట్రిక్ సెంచరీలు, అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శనలతో ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపుతున్న ముషీర్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. భారత క్రికెట్‌కు మరో భవిష్యత్ తార దొరికాడని టీమిండియా అభిమానులు సంబురపడిపోతున్నారు. 20 ఏళ్ల ముషీర్ గతేడాది సెప్టెంబర్‌లో కారు ప్రమాదానికి గురైన తర్వాత ఆడుతున్న తొలి రెడ్ బాల్ టోర్నీ ఇది.ఈ టోర్నీలో ముషీర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ భారత సీనియర్ టీమ్ సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. ఇప్పటికే భారత జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ముషీర్ అన్న సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఫామ్‌లో ఉన్నా టీమిండియా బెర్త్ దక్కడం లేదు. మరోవైపు కౌంటీల్లో సత్తా చాటుతూ ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా భారత టెస్ట్ జట్టు బెర్త్ వైపు చూస్తున్నారు. ఇంత పోటీలో ముషీర్ టీమిండియా వైపు ఎలా వస్తాడో చూడాలి. ఇక్కడ ముషీర్‌కు ఓ అడ్వాంటేజ్ ఉంది. ముషీర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఇరగదీస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన ముషీర్.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు కూడా సత్తా చాటాడు.ముషీర్‌కు దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్.. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్ సెంచరీ కూడా ఉంది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముషీర్ బౌలర్‌గానూ రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్ 2024 అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్‌గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.

వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. ఇంగ్లండ్ చేతిలో ఓడిన టీమిండియా
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిసారి శాంతించాడు. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్.. నిన్న (జులై 7) జరిగిన చివరి మ్యాచ్‌లో ఓ మోస్తరు ఇన్నింగ్స్‌తో (42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్‌రేట్‌తో 33 పరుగులు) సరిపెట్టాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తక్కువ స్కోర్‌కే పరిమితమై.. ఆతర్వాత ఆ స్కోర్‌ను కాపాడుకోవడంలో విఫలమైంది. ఈ మ్యాచ్‌లో ఓడినా టీమిండియా 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్ 1,3,4 వన్డేలు గెలువగా.. ఇంగ్లండ్ 2, 5 వన్డేల్లో నెగ్గింది. భారత్ త్వరలో ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌ల యూత్ టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ జులై 12 నుంచి 15 వరకు బెకెన్హమ్లో జరుగనుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 210 పరుగులు మాత్రమే చేసింది. ఆర్ఎస్ అంబ్రిష్ (66) అజేయ అర్ద శతకంతో రాణించి టీమిండియాకు ఈ మాత్రం స్కోరైనా అందించాడు. జట్టులో నెక్స్ హైయ్యెస్ట్ స్కోర్ వైభవ్‌దే. రాహుల్ కుమార్ (21), హర్వంశ్ పంగాలియా (24), కనిశ్క్ చౌహాన్ (24), యుద్దజిత్ గుహా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆయుశ్ మాత్రే (1) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మరో స్టార్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (1) కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్, ఆల్బర్ట్ చెరో 2 వికెట్లు తీయగా.. ఫిర్బాంక్, మోర్గాన్, గ్రీన్, ఎకాంశ్ సింగ్ తలో వికెట్ తీశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 31.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలుత బెన్ డాకిన్స్ (66), ఆతర్వాత బెన్ మేస్ (82 నాటౌట్), కెప్టెన్ థామస్ రూ (49 నాటౌట్) రాణించి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో నమన్ పుష్పక్ 2, దిపేశ్ దేవేంద్రన్ ఓ వికెట్ తీశాడు.శాంతించిన వైభవ్ఈ సిరీస్‌లో వైభవ్ 100 లోపు స్ట్రయిక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వైభవ్ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 130కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు.తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు. ఈ సిరీస్ వైభవ్ విధ్వంసం ధాటికి ఇంగ్లండ్ యువ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వైభవ్ ప్రతి మ్యాచ్‌ల కనీసం రెండైనా సిక్సర్లు కొట్టాడు. ఐదో వన్డేలో నిదానంగా ఆడినా 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.

అందుకే లారా క్వాడ్రపుల్ సెంచరీ (400) రికార్డును బద్దలు కొట్టలేదు: వియాన్ ముల్దర్
జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్దర్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (367) చెలరేగాడు. ఈ ట్రిపుల్‌తో ముల్దర్ చాలా రికార్డులను బద్దలు కొట్టాడు.విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా..సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ (297 బంతుల్లో) చేసిన ఆటగాడిగా..టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున హాషిమ్ ఆమ్లా (311 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.ఈ రికార్డులన్నీ పక్కన పెడితే ముల్దర్ ఓ చారిత్రక రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశాన్ని వదిలేసి వార్తల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో అత్యంత అరుదైన క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే అవకాశాన్ని ముల్దర్ చేజేతులారా జారవిడిచాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా మాత్రమే క్వాడ్రపుల్ సెంచరీ చేశాడు.మ్యాచ్ రెండో రోజు తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసిన ముల్దర్.. క్వాడ్రపుల్ సెంచరీకి 33 పరుగుల దూరంలో (367 నాటౌట్) ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.టెస్ట్ క్రికెట్లో ఎప్పుడో కాని ఇలాంటి అవకాశం రాదు. అలాంటిది ముల్దర్ ఈ అవకాశాన్ని వదిలేసి చారిత్రక తప్పిదం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముల్దర్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే మరో 20 బంతుల్లో ఈజీగా క్వాడ్రపుల్ సెంచరీ పూర్తయ్యేది. అయితే అతను అనూహ్యంగా లంచ్ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి సంచలన నిర్ణయం తీసకున్నాడు.తగినంత సమయం, అవకాశం ఉండి కూడా ముల్దర్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. అత్యంత అరుదుగా వచ్చే అవకాశాన్ని కాదనుకొని ముల్దర్ చాలా పెద్ద తప్పిదం చేశాడని వాపోతున్నారు. ప్రస్తుత జమానాలో ఇలాంటి అవకాశం బహుశా ఎవరికీ రాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.ఈ ఇన్నింగ్స్ అనంతరం వియాన్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడంపై స్పందించాడు. లారా ఓ దిగ్గజం. అలాంటి ఆటగాడి పేరు మీదనే క్వాడ్రపుల్ సెంచరీ రికార్డు ఉండాలి. ఆ రికార్డును నిలబెట్టుకోవడానికి అతను అర్హుడు. నాకు మళ్లీ క్వాడ్రపుల్ సెంచరీ చేసే అవకాశం వచ్చినా ఇలాగే చేస్తాను. ఈ విషయాన్ని షుక్రీ కాన్రడ్తో (దక్షిణాఫ్రికా హెడ్ కోచ్) చెప్పాను. అతను కూడా నా అభిప్రాయంతో ఏకీభవించాడు. లంచ్ విరామం తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడానికి మరో కారణం కూడా ఉంది. మ్యాచ్ గెలవడానికి సరిపడా స్కోర్ చేశామని భావించాను. ఈ రెండు కారణాల చేత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.MULDER TALKS ABOUT HIS DECLARATION:"Lara's Record is exactly where it Should be". pic.twitter.com/PWwKGlvoL6— Johns. (@CricCrazyJohns) July 7, 2025ముల్దర్ కామెంట్స్ విన్న తర్వాత యావత్ క్రికెట్ ప్రపంచం అతనికి సెల్యూట్ కొట్టింది. దిగ్గజాలను గౌరవించే సంస్కారవంతమైన క్రికెటర్ అంటూ జేజేలు పలికింది. లారా క్వాడ్రపుల్ రికార్డును త్యాగం చేసి చిరకాలం తన పేరును స్మరించుకునేలా చేశాడని కామెంట్లు చేస్తుంది. నిస్వార్థ నాయకుడు, గొప్ప ఆటగాడని కీర్తిస్తుంది. వ్యక్తిగత రికార్డులు కాకుండా జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే ఇలాంటి నాయకుడిని చూడలేమని జేజేలు పలుకుతుంది.వియాన్ లారా క్వాడ్రపుల్ సెంచరీ రికార్డు కాదనుకున్నా టెస్ట్‌ల్లో ఐదో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో అత్యధిక పరగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో లారా (400 నాటౌట్), మాథ్యూ హేడెన్ (380), బ్రియాన్ లారా (375), మహేళ జయవర్దనే (374) మాత్రమే ముల్దర్ కంటే ముందున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్దర్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు) చెలరేగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్ బెడింగ్హమ్ 82, లుహాన్ డ్రి ప్రిటోరియస్ 78, డెవాల్డ్ బ్రెవిస్ 30, వెర్రిన్ 42 (నాటౌట్) పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం సౌతాఫ్రికా బౌలర్లు కూడా రెచ్చిపోవడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఫాలో ఆన్ ఆడుతుంది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌ను సుబ్రాయన్ (10-1-42-4), కోడి యూసఫ్ (7-1-20-2), కార్బిన్ బాష్ (7-1-27-1), ముత్తస్వామి (13-2-59-1) కుప్పకూల్చారు. అజేయ ట్రిపుల్‌తో రికార్డులను తిరగరాసిన ముల్దర్ బౌలింగ్‌లోనూ రాణించాడు. 6 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (83 నాటౌట్) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఫాలో ఆన్ ఆడుతూ జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. 31 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే స్కోర్ 51/1గా ఉంది. కైటానో (34), నిక్ వెల్చ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే మరో 405 పరుగులు చేయాలి. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది.
బిజినెస్

స్కోడా ’గ్రూప్’లో బెంట్లీ
న్యూఢిల్లీ: భారత్‌లో స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్) గొడుగు కిందికి మరో బ్రాండ్ వచ్చి చేరింది. బ్రిటన్‌కు చెందిన సూపర్ లగ్జరీ బ్రాండ్ బెంట్లీని ఆరో బ్రాండ్‌గా చేర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. దీంతో ఇకపై బెంట్లీ వాహనాల దిగుమతులు, విక్రయం, సరీ్వసింగ్ మొదలైనవన్నీ ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్ చేపడుతుంది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. బెంట్లీ ఇండియా బ్రాండ్ డైరెక్టరుగా అబీ థామస్ నియమితులయ్యారు. భారత్‌లో పెరుగుతున్న అత్యంత సంపన్న వర్గాలకు(యూహెచ్‌ఎన్‌ఐ) ఈ డీల్‌తో ప్రయోజనం చేకూరుతుందని ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్ ఎండీ పీయుష్ ఆరోరా తెలిపారు.

ఎఫ్‌అండ్‌వోలో రిటైలర్లకు నష్టాలే..
న్యూఢిల్లీ: గతేడాది(2024–25) ఈక్విటీ డెరివేటివ్స్‌లో అత్యధిక శాతం రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోయినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అంతక్రితం ఏడాది నమోదైన రీతిలోనే డెరివేటివ్స్‌లో చిన్న ఇన్వెస్టర్లు భారీగా దెబ్బతిన్నట్లు తెలియజేసింది. ఈ విభాగంలో వ్యక్తిగత ఇన్వెస్టర్ల నికర నష్టాలు వార్షికంగా 41 శాతం పెరిగి రూ. 1,05,603 కోట్లను తాకినట్లు వెల్లడించింది. ఎఫ్‌అండ్‌వో విభాగంలో రిటైలర్లకు 2023–24లో రూ. 74,812 కోట్ల నష్టాలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ బాటలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో లావాదేవీలు చేపట్టే వ్యక్తిగత ఇన్వెస్టర్ల సంఖ్య సైతం 20 శాతం తగ్గినట్లు నివేదిక తెలియజేసింది. అంతకుపూర్వం రెండేళ్లలో ఈ విభాగంలో లావాదేవీలు చేపట్టే ప్రత్యేక రిటైలర్ల సంఖ్య 24 శాతం పుంజుకోవడం గమనార్హం! ఈక్విటీ ఇండెక్స్ డెరివేటివ్స్ మార్గదర్శకాలను పటిష్టపరుస్తూ 2024 అక్టోబర్ 1 నుంచి కొత్త చర్యలు ప్రకటించాక ఈక్విటీ డెరివేటివ్ విభాగంలో లావాదేవీలపై సెబీ విశ్లేషణ చేపట్టింది. ఇందుకు 2024 డిసెంబర్ నుంచి 2025 మే వరకూ మొత్తం రిటైల్ ఇన్వెస్టర్ల వ్యక్తిగత లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంది. మొత్తం రిటైల్ ట్రేడర్ల లాభనష్టాలను విశ్లేíÙంచాక దాదాపు 91 శాతం మంది నష్టపోయినట్లు గుర్తించింది. 2024 బాటలోనే రిటైల్ ట్రేడర్లు భారీగా పెట్టుబడులను కోల్పోయినట్లు సెబీ నివేదిక వివరించింది. నష్టాల తీరిలా: గత ఆరు నెలల కాలంలో ఇండెక్స్ ఆప్షన్స్ టర్నోవర్ ప్రీమియంలవారీగా చూస్తే వార్షికంగా 9 శాతం క్షీణించినట్లు సెబీ నివేదిక పేర్కొంది. నోషనల్‌గా మదింపు చేస్తే 29 శాతం తగ్గింది. అయితే రెండేళ్ల క్రితం పరిస్థితితో పోలిస్తే ఇండెక్స్ ఆప్షన్స్ పరిమాణం ప్రీమియంలవారీగా 14 శాతం పుంజుకుంది. నోషనల్‌గా 42 శాతం ఎగసింది. ఈక్విటీ డెరివేటివ్ విభాగంలో ప్రీమియంలవారీగా రిటైలర్ల టర్నోవర్ 11 శాతం క్షీణించింది. అయితే రెండేళ్ల క్రితం ఇదే కాలంలో 36 శాతం జంప్‌చేసింది. ఈ హెచ్చుతగ్గులు దేశీ మార్కెట్లో ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ప్రధానంగా ఇండెక్స్ ఆప్షన్స్‌లో అధిక లావాదేవీలను పట్టిచూపుతున్నట్లు నివేదిక ప్రస్తావించింది. ఇన్వెస్టర్ల పరిరక్షణ, మార్కెట్ నిలకడ యోచనతో ఇండెక్స్ ఆప్షన్స్‌లో లావాదేవీలు, టర్నోవర్‌ను పర్యవేక్షిస్తున్నట్లు సెబీ వివరించింది. ఈ బాటలోనే 2025 మే 29న రిస్కుల పర్యవేక్షణా విధానాలు తదితరాలకు సెబీ తెరతీసింది. జేన్ స్ట్రీట్ లాంటి రిస్క్‌లు పెద్దగా లేవు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే 3ముంబై: మార్కెట్లో కలకలం రేపిన హెడ్జ్ ఫండ్ జేన్ స్ట్రీట్ తరహా రిసు్కలేమీ పెద్దగా కనిపించడం లేదని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. నిఘాపరమైన సవాళ్ల వల్లే ఈ ఉదంతం చోటు చేసుకుందని, ఈ నేపథ్యంలో సర్వైలెన్స్‌పై సెబీ మరింతగా దృష్టి పెడుతోందని ఆయన చెప్పారు. నియంత్రణాధికారాలకు లోబడే జేన్ స్ట్రీట్‌పై చర్యలు తీసుకున్నామని, అయితే నిఘా, నిబంధనలను పటిష్టంగా అమలు చేయడం ద్వారానే నేరాలకు పాల్పడేవారిని కట్టడి చేయడానికి వీలవుతుందని పాండే పేర్కొన్నారు. డెరివేటివ్స్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు నియంత్రణ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకున్నా అవి డేటా ఆధారితమైనవిగానే ఉంటాయని చెప్పారు. క్యాష్, డెరివేటివ్స్ విభాగాల్లో పొజిషన్లతో సూచీలను ప్రభావితం చేయడం ద్వారా రెండేళ్ల వ్యవధిలో అక్రమంగా ఆర్జించిన రూ. 4,800 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో ఖాతాకు బదలాయించాలని ఆదేశిస్తూ, జేన్ స్ట్రీట్ గ్రూప్ సంస్థలు భారత మార్కెట్లో లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

డ్రోన్ మార్కెట్ @ రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: రక్షణ, వ్యవసాయం, లాజిస్టిక్స్, మౌలికం తదితర ఎన్నో రంగాల్లో డ్రోన్ల వినియోగంతో మంచి ఫలితాలు కనిపిస్తుండడంతో ఈ మార్కెట్ వచ్చే ఐదు సంవత్సరాల్లో గణనీయంగా వృద్ధి చెందనుందని నెక్స్‌జెన్ సంస్థ అంచనా వేసింది. 2030 నాటికి దేశీ డ్రోన్ తయారీ పరిమాణం 23 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.96 లక్షల కోట్లు) చేరుకోవచ్చని పేర్కొంది. ఆధునిక యుద్ధ తంత్రాల్లో డ్రోన్లు కీలకంగా మారిన విషయాన్ని ప్రస్తావించింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌లో డ్రోన్ల వినియోగం స్పష్టమైన మార్పునకు నిదర్శనంగా పేర్కొంది. 15 పట్టణాలకు చెందిన 150 కంపెనీల అభిప్రాయాలను నెక్స్‌జెన్ తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. ముఖ్యంగా వ్యవసాయం, కచ్చితమైన సాగు అవసరాలు 2030 నాటికి డ్రోన్ల డిమాండ్‌కు కీలకంగా నిలుస్తాయని 40 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ఆ తర్వాత రక్షణ రంగం నుంచి ఎక్కువ డిమాండ్ వస్తుందని పేర్కొన్నాయి. స్మార్ట్ సాగు రూపంలో వచ్చే ఐదేళ్లో గ్రామీణ వ్యవసాయంలో డ్రోన్లు బూమ్‌ను సృష్టిస్తాయని నమ్ముతున్నట్టు సర్వేలో 20 శాతం కంపెనీల ప్రతినిధుల తెలిపారు. లాజిస్టిక్స్ (వస్తు రవాణా), ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు సైతం డ్రోన్ల తయారీకి చోదకంగా నిలుస్తాయని 15 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఢిల్లీలో అంతర్జాతీయ డ్రోన్స్ ప్రదర్శన ఈ డిమాండ్‌నకు మరింత మద్దతునిచ్చే చర్యల్లో భాగంగా ఈ నెల 31 నుంచి ఆగస్ట్ 1 వరకు ఢిల్లీలో అతిపెద్ద ‘డ్రోన్ అంతర్జాతీయ ప్రదర్శన 2025’ నిర్వహించనున్నట్టు నెక్స్‌జెన్ తెలిపింది. నెక్స్‌జెన్ ఎగ్జిబిషన్స్ దీన్ని నిర్వహిస్తుండడం గమనార్హం. రష్యా, తైవాన్, కెనడా, ఉక్రెయిన్, భారత్ సహా ఆరు దేశాలు తమ నూతన డ్రోన్ ఆవిష్కరణలను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నట్టు వెల్లడించింది. అలాగే, 50కు పైగాఅంతర్జాతీయ డ్రోన్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్టు తెలిపింది. ‘‘ఆపరేషన్ సింధూర్ సమయంలో డ్రోన్లు చూపించిన అద్భుత సామర్థ్యాలను యావత్ ప్రపంచం గమనించింది. దేశీ తయారీ డ్రోన్లను ప్రోత్సహించడం ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తుందని, పలు రంగాల్లో దేశ శ్రేయస్సుకు మేలు చేస్తుందని భావిస్తున్నాను’’అని నెక్స్‌జెన్ ఎగ్జిబిషన్స్ డైరెక్టర్ ఆధార్ బన్సాల్ తెలిపారు. వ్యవసాయంలో విత్తనాలు నాటడం, మందుల పిచికారీతోపాటు నిఘా, పంటల ఆరోగ్యం పరిశీలన సహా ఎన్నో రూపాల్లో డ్రోన్లు సేవలు అందిస్తుండడం గమనార్హం. అంతర్జాతీయంగా వ్యవసాయ డ్రోన్ల మార్కెట్ 2030 నాటికి చేరుకోవచ్చని 6 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్న అంచనాలను నెక్స్‌జెన్ నివేదిక ప్రస్తావించింది.

ఆకాశ ఎయిర్‌తో జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఎంఆర్ ఏరో టెక్నిక్ వెల్లడించింది. దీని కింద ఆకాశ ఎయిర్‌కి చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు తమ అధునాతన ఎంఆర్వో కేంద్రంలో (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్) మెయింటెనెన్స్ సేవలు అందించనున్నట్లు వివరించింది. ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. తమ సాంకేతిక నైపుణ్యాలు, నిర్వహణ సామర్థ్యాలపై విమానయాన సంస్థలకు గల నమ్మకానికి ఈ డీల్ నిదర్శనమని జీఎంఆర్ ఏరో టెక్నిక్ ప్రెసిడెంట్ అశోక్ గోపీనాథ్ తెలిపారు. దేశీయంగా ఎంఆర్వో వ్యవస్థ అభివృద్ధి చెందడంలో మద్దతిచ్చేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆకాశ ఎయిర్ సహ–వ్యవస్థాపకుడు బెల్సన్ కొటిన్హో పేర్కొన్నారు.
ఫ్యామిలీ

300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు
మనం తినే ప్రతి మెతుకు వెనుక ఒక రైతు శ్రమ ఉంటుంది. అలాగే ఎంతో ఆనందంగా ఆస్వాదించే ప్రతీ చాక్లెట్, చాక్లెట్ బార్ వెనుక ఒక రైతు కథ ఉంటుంది. చాక్లెట్లలో చెప్పుకోదగ్గది మన దేశానికి చెందిన, వెరీ వెరీ స్పెషల్ ఏంటి అంటే చెప్పుకోవాల్సింది ‘మనం’ చాక్లెట్ గురించే. హైదరాబాద్‌లో ఉన్న భారతదేశపు చాక్లెట్ బ్రాండ్. వరల్డ్ చాక్లెట్ డే సందర్భంగా ఆ విజయ గాధ ఏంటో తెలుసుకుందాం పదండి. ‘మనం’ కథ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరిలోని కోకో పొలాలలోమొదలువుతుంది. ఈ ఆంధ్రా-ఆధారిత చాక్లెట్ బ్రాండ్ 300+ మంది రైతులకు సాధికారత కల్పించి తొలి ఏడాదిలో సంవత్సరంలో రూ. 8.7 కోట్లు సంపాదిండం విశేషం. అంతేకాద గత ఏడాది ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల’ జాబితాలో చోటు సంపాదించుకుంది. స్వదేశీ పదార్థాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిందంటూ ‘మనం చాక్లెట్’ను కొనియాడింది. భారత్‌లో పండించే కోకోతో చాక్లెట్ల తయారు చేసి ‘మనం చాక్లెట్’ పాపులర్ అయింది. ఈ చాక్లెట్లకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. 2023 ఆగస్టులో మనం చాక్లెట్ కార్ఖానాను ముప్పాల చైతన్య స్థాపించారు. దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. < View this post on Instagram A post shared by Manam Chocolate® (@manamchocolate) హైదరాబాద్‌లో పుట్టినా, చైతన్య బాల్యంలో ఎక్కువ భాగం పూణేలో గడించింది. అక్కడ సహ్యాద్రి స్కూల్ KFI (జిడ్డు కృష్ణమూర్తి బోర్డింగ్ స్కూల్)లో పెరిగాడు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయంలోని సౌడర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి జనరల్ బిజినెస్ మేనేజ్మెంట్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ డెవలపింగ్ ఎకానమీస్ నుండి స్టాన్ఫోర్డ్ సీడ్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తర్వాత తండ్రి అనారోగ్యం కారణంగా ఇండియా తిరిగి వచ్చారు. తండ్రి నిర్వహించే ఆల్మండ్ హౌజ్ మిఠాయి దుకాణం బాధ్యతలు చేపట్టారు. ఒకే ఒక్క దుకాణంతో ఉన్న చిన్న వ్యాపారంలోని లోపాలను పరిష్కరించుకుంటూ, తనదైన శైలిలో అభివృద్ది చేశారు. గత 10 సంవత్సరాలలో దానిని చాలా పెద్ద వ్యాపారంగా విస్తరించారు. దాదాపు 200 మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ కంపెనీ మొదటి సంవత్సరంలోనే రూ. 8.79 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఎనిమిది నెలల్లోనే దీన్ని సాధించడం విశేషం.బీన్స్ పట్ల ఆయనకున్న మక్కువే తన సొంత బ్రాండ్‌ను రూపొందించేలా చేసింది. చాక్లెట్ వస్తువులు అందుబాటులో లేకపోవడం, ఆ సమయంలో చాక్లెట్ గురించి మాకు ఏమీ తెలియదు ఎందుకంటే చాక్లెట్ ఎల్లప్పుడూ సరఫరాదారు నుండి కొనుగోలు చేసేవాళ్లమని, అదే చాక్లెట్ మార్కెట్లోకి ప్రవేశించాలనే ఆలోచన అతని ఆసక్తిని రేకెత్తించింది అంటారు. మనం చాక్లెట్‌ను ప్రవేశపెట్టిన సంస్థ డిస్టింక్ట్ ఆరిజిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (DOPL) CEO చైతన్య ముప్పాల. తాము సంవత్సరానికి 150శాతం వృద్ధి చెందుతున్నామని, ఇది తమ విజయవంతమైన మార్కెట్ వ్యూహానికి నిదర్శనమన్నారు. కోకో బీన్స్ పొలం నుంచి చాక్లెట్ టాబ్లెట్‌గా రూపాంతరం చెందే ప్రయాణంలో రైతుల అమూల్యమైన మద్దతు లేకుండా తమ సాధ్యం కాదు అని తెలిపారు.ఎన్నో వెరైటీలుడార్క్ చాక్లెట్లు, చాక్లెట్ ట్యాబ్లెట్స్, స్నాక్స్, ఒకే ప్రదేశంలో పండించినవి, అంతర్జాతీయంగా పండించిన కోకో నుంచి తయారైనవి, పాల మిశ్రమంతో చేసినవి ఇలా ఎన్నో రకాల వెరైటీ చాక్లెట్లు ఈ కార్ఖానాలో లభిస్తుంటాయి. పండ్లు, ప్లేన్, వీగన్ వంటి చాక్లెట్ల రకాలు కూడా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన పది రకాల చాక్లెట్లను అవార్డులు కూడా వరించాయి.

జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది
అధిక బరువుకు కారణాలనేకం. జీవన శైలి, ఆహార అలవాట్లు, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అయితే ‘‘చిన్నప్పటినుంచీ నేనింతే’’ అని కొంతమంది సరిపెట్టుకుంటే, మరికొంతమంది మాత్రం భిన్నంగా ఉంటారు. అధిక బరువుతో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా అయితేనే నేమి, అందంగా ఆరోగ్యంగా ఉండాలనే కోరికతోనేమి కష్టపడి శరీర బరువును తగ్గించు కుంటారు. అలా జిమ్ కెళ్లకుండానే 95 కిలోల వెయిట్ నుంచి 65 కిలోలకు చేరుకుందో యవతి. అదెలాగో తెలుసుకుందాం.ఇది ఉదితా అగర్వాల్ వెయిట్ లాస్ జర్నీ. బరువు తగ్గడం అనేది కష్టమైన ప్రయాణం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ బరువు తగ్గాల్సి వస్తే ఇంకా కష్టం. అందుకే కారణాలను విశ్లేషించుకుని నిపుణుల సలహాతో ముందుకు సాగాలి. అలా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అయిన ఉదితా అగర్వాల్ కేవలం ఫిట్నెస్ కోసం మాత్రమే కాకుండా తన ఆరోగ్యాన్ని మెరుగుపరచు కోవడానికి కూడా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. అద్బుతమైన విజయాన్ని సాధించింది.ఇదీ చదవండి: 300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లుఉదితా చిన్నప్పటి నుంచి ఊబకాయంతో బాధపడేది. దీనికి తోడు పిగ్మెంటేషన్, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, విపరీతంగా జుట్టు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద అన్వాంటెడ్ హెయిర్ ఇలా సవాలక్ష సమస్యలతో సతమతమయ్యేది. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలికి మారడం ద్వారా 8 నెలల్లో 30 కిలోల బరువు తగ్గింది. అదీ జిమ్‌కు వెళ్లకుండానే 95 కిలోల బరువున్న ఉదితా 65 కిలోలకు చేరుకుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడింది. View this post on Instagram A post shared by Udita Agarwal (@udita_agarwal20) తన వెయిట్ లాస్ జర్నీ గురించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. శుభ్రమైన ఆహారాలు తినడం ద్వారా ఆమె సహజంగానే 30 కిలోల బరువు తగ్గింది. ముఖ్యంగా "బరువు తగ్గడంలో జంక్ ఫుడ్‌ను మానేయడమే అది పెద్ద చాలెంజ్’’ అని ఆమె చెప్పుకొచ్చింది.చదవండి: చిన్నతనం నుంచే ఇంత పిచ్చా, పట్టించుకోకపోతే ముప్పే : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ఉదిత వెయిట్ లాస్లో సాయపడిన అలవాట్లుడీటాక్స్ వాటర్: ప్రతిరోజూ డీటాక్స్ వాటర్ తీసుకునేది. ముఖ్యంగా జీరా, అజ్వైన్, సోంపు, మెంతిని నీటిలో మరిగించి తాగేది. ఇది ఉబ్బరాన్ని నివారించి జీర్ణక్రియకు సహాయపడుతుంది.ఆహారంపై దృష్టి: అప్పుడప్పుడు చీట్ మీల్ తీసుకున్నా.. ఆరోగ్యకరమైన ఆహార నియమాన్ని కచ్చితంగా పాటించేది.ఒక్కోసారి వెయిట్ పెరిగినా నిరాశపడలేదు: ప్రతీ రోజు వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండేది. ఒకసారి బరువు పెరిగినా నిరుత్సాహ పడేది కాదు,అసలు ఆ హెచ్చుతగ్గులను పట్టించుకోలేదు.ఇంటి ఫుడ్: ఇంట్లో ఉన్నా, బయటికెళ్లినా, ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినేది. చియా సీడ్ వాటర్: చియా విత్తనాలను అర లీటరు నీటి నాన బెట్టి రోజుకు 3-4 లీటర్ల చొప్పున రోజంతా తాగేది. రోజుకు ఒకసారి టీ, మైదా ఫుడ్‌కు దూరంగా ఉంటూ అతిగా తినకుండా ఉండటానికి ఉదిత ప్రతి భోజనానికి ముందు నీరు త్రాగేది.

మహా కుంభాభిషేకం : భక్తజన సంద్రం.. తిరుచెందూరు
సాక్షి, చెన్నై: తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం (Arulmigu Subramania Swamy Temple) ఆరుపడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడకు నిత్యం భక్తులు పోటెత్తుతుంటారు. సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాలను తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలిరావడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ ఆలయ మహా కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన పనులకు హిందూ మత దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పదిహేను సంవత్సరాల తర్వాత ఈ మహోత్సవం జరగనున్నడంతో దేశ విదేశాల నుంచి మురుగన్ భక్తులు తిరుచెందూరు వైపుగా కదిలారు. ఏర్పాట్లు పూర్తి.. కుంభాభిషేకం మహోత్సవం నిమ్తితం జూలై 1 నుంచి పూజలు మొదలయ్యాయి. ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన యాగ శాలలో విశిష్ట పూజలు జరుగుతూ వచ్చాయి. యాగాలు,హోమాలు విజయవంతంగా పూర్తి చేశారు. మహాకుంభాభిషేకం నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించ లేదు. ఆలయం ఆవరణలో మూల విరాట్, వళ్లి, దేవానై అమ్మవార్లకుయాగాది పూజలు జరిగాయి. రాత్రి నుంచి వేకువ జాము వరకు 12 కాల యాగ పూజలు జరిగాయి. Thoothukudi, Tamil Nadu: The Maha Kumbabhishekam at Tiruchendur Subramania Swamy Temple marked the culmination of ₹300 crore renovations. Held with elaborate rituals, holy water anointing, drone blessings, and live broadcasts, it drew thousands of devotees, secured by 6,000… pic.twitter.com/1OHDv5u40O— IANS (@ians_india) July 7, 2025 సోమవారం ఉదయం 6.15 గంటల నుంచి 6.50 గంటల మధ్య రాజగోపురంలోని తొమ్మిది కుంభ కలశాలలో పవిత్ర జలాలలను పోయనున్నారు. అదే సమయంలో విమాన ప్రకారం, మూల విరాట్, షణ్ముగర్, వళ్లి, దేవానై, పెరుమాల్, నటరాజర్ వంటి అన్ని పరివార మూర్తుల గోపురంలోని కలసాలలోపవిత్ర జలాలను పోసి శా్రస్తోక్తంగా కుంభాభిషేక మహోత్సవం పూర్తి చేయడానికి సర్వందం చేశారు. ఈ మహోత్సవాన్ని భక్తులు తలికించేందుకు వీలుగా సముద్ర తీరం, పరిసరాలలో భారీ ఏర్పాట్లు చేశారు. స్వామి ఆలయం పరిసరాలలో విద్యుత్ వెలుగులు, సప్తవర్ణ పుష్పాలతో దేదీప్యమానంగా వెలుగొందుతు న్నాయి. ఈ మహోత్సవం కోసం రూ.15 లక్షలు విలువగల డ్రై ఫుడ్స్‌తో మాలలను స్వామి, అమ్మవార్ల కోసం సిద్ధం చేశారు. తిరుచెందూరులో మహా కుంభాభిషేకం వేడుకకు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం జరిగే ఈ వేడుకను కనులార వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుచెందూరు వైపుగా పోటెత్తుతున్నారు. దీంతో నిఘా వలయంలోకి ఆధ్యాత్మిక పట్టణాన్ని తీసుకొచ్చారు. నిఘా కట్టుదిట్టం నిఘా నీడలో.. భక్తులకు మెరుగైన సేవలే కాదు, భద్రత పరంగా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఇలం భగవత్, ఎస్పీ ఆల్బర్ట్ జాన్‌లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మానవ రహిత విమానాలను రంగంలోకి దించారు. సముద్ర తీరంలో జనం చొచ్చుకు వెళ్లకుండబా పెద్ద ఎత్తున రక్షణ కవచంగా బారికెడ్లను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తిరుచెందూరు వైపుగా పోటెత్తుతుండటంతో ప్రత్యేక బస్టాండ్లను ఏర్పాటు చేశారు. తిరుచెందూరు వైపుగా పలు పట్టణాలు,నగరాల నుంచి బస్సులు రోడ్డెక్కించారు. పది లక్షల మంది భక్తులు తరలి రావచ్చు అన్న సంకేతాలతో అందుకు తగిన ఏర్పాట్లు జరిగాయి.ఆహారం, తాగునీరు వంటి సౌకార్యలు కల్పించారు. అక్కడక్కడ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

చాక్లెట్ డే : చాక్లెట్‌తో ఆరోగ్యం, ఇంట్రస్టింగ్ ఫాక్ట్స్
World Chocolate Day 2025: ప్రతీ సంవత్సరం జూలై 7న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ఉద్దేశం. ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ ప్రియులు ప్రపంచ చాక్లెట్ దినోత్సవం కోసం ఎదురు చూస్తారు. చిన్న చాక్లెట్ బార్ నుండి ఫ్యాన్సీ డెజర్ట్‌ల వరకు ప్రతి రూపంలో చాక్లెట్‌ను ఆస్వాదించాలని ఆరాట పడతారు. 1550, జూలై 7న ఐరోపాలో మొదటిసారిగా చాక్లెట్ తయారయిందట. దీనికి గుర్తుగానే తొలిసారిగా 2009, జూలై 7న ప్రపంచ చాక్లెట్ దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి అదే ఆనవాయితీగా వస్తోంది. అయితే చాక్లెట్ దినోత్సవం ఒక్కో దేశంలో ఒక్కో రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారని మీకు తెలుసా?చాక్లెట్ దినోత్సవం తేదీ దేశాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. పశ్చిమ ఆఫ్రికాలోనే కోకో వంటి సంస్థల రెండవ అతిపెద్ద ఉత్పత్తి దేశమైన ఘనాలో ఫిబ్రవరి 14న చాక్లెట్ దినోత్సవం జరుపుకుంటారు. అలాగే లాట్వియాలో జూలై 11న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. జనవరి 10న బిట్టర్‌స్వీట్ చాక్లెట్, జూలై 28న మిల్క్ చాక్లెట్, సెప్టెంబరు 22న వైట్ చాక్లెట్, డిసెంబరు 16న చాక్లెట్ కవర్డ్ వంటి దినోత్సవాలు జరుపుకుంటారు.చాక్లెట్ ఒక ఎమోషన్యూరోపియన్లు అమెరికాను కనుగొన్న తర్వాత, చాక్లెట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సందర్భంలోనే ఒక ఎమోషన్లాగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహంలేదు. ప్రతిరోజూ ఆనందించే ఒక స్వీట్ నథింగ్‌గా ఆదరణ పొందింది.మెదడు పనితీరును మెరుగు పరచడంతోపాటు, చాక్లెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలున్నాయి. చాక్లెట్లో అధిక కొవ్వు , చక్కెర కంటెంట్ ఉండటం వల్ల చాలా ఒత్తిడికి చెక్ చెబుతుందట. గుండె జబ్బులు , స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఇటీవల కొన్ని అధ్యయనాలు తెలిపాయి.చాక్లెట్లో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని, చాక్లెట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలదని ,జ్ఞాపకశక్తి క్షీణతను నిరోధించవచ్చని సూచించాయి . అయితే మరింత అధ్యయనం జరగాల్సి ఉందని స్పష్టం చేశాయి.డార్క్ చాక్లెట్కొకోవా కంటెంట్ ఎక్కువగా ఉన్న డార్క్ చాక్లెట్ సాధారణంగా తక్కువ చక్కెర కంటెంట్ , అధిక యాంటీఆక్సిడెంట్ స్థాయిల కారణంగా ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ పుష్కలంగా ఉండే డార్క్ చాక్లెట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది, ముఖ్యంగా ఫ్లేవనాల్స్, ఇది హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మెదడు పనితీరును, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలు రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడతాయి. చర్మ రక్షణను కూడా అందిస్తుంది. వయస్సు సంబంధిత మతిమరుపునుంచి రక్షణ కల్పింస్తుంది.నోట్: చాక్లెట్ తినడం మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది మొటిమలు, ఊబకాయం,మధుమేహం, కరోనరీ హార్ట్ డిసీజ్ , హైపర్‌టెన్షన్ ఉన్నవారు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతారు. చాక్లెట్లో పెద్ద సంఖ్యలో కేలరీలు ఉంటాయి, కనుక బరువు తగ్గాలని కోరుకునే వారు చాక్లెట్‌ను మితంగా మాత్రమే తినాలి.
ఫొటోలు
అంతర్జాతీయం

బ్రిక్స్‌కు మద్దతిచ్చే దేశాలపై 10% అదనపు సుంకాలు: ట్రంప్
వాషింగ్టన్/బీజింగ్: బ్రిక్స్ కూటమివి అమెరికా వ్యతిరేక విధానాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆ కూటమికి మద్దతిచ్చే ఏ దేశమైనా తమనుంచి 10 శాతం అదనపు సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని సోమవారం హెచ్చరించారు. ‘‘బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలతో జతకట్టే ఏ దేశం మీదైనా అదనంగా 10% సుంకం విధిస్తాం. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవు’’ అని ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. కొత్త టారిఫ్ నియమాలు, సవరించిన వాణిజ్య ఒప్పంద నిబంధనలను వివరిస్తూ ఆయా దేశాలకు తక్షణం అధికారిక లేఖలు పంపుతున్నట్టు ప్రత్యేక పోస్టులో తెలిపారు. ట్రంప్ ప్రకటనను చైనా తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఇలా సుంకాలను ఆయుధంగా వాడటం దారుణమని మండిపడింది. ఇది ఎవరికీ లాభం చేయబోదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. ‘‘అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి బ్రిక్స్ ఒక వేదిక. అది ఏ దేశానికీ వ్యతిరేకంగానో, లక్ష్యంగానో లేదు’’ అని స్పష్టం చేశారు.ఖండించిన రియో డిక్లరేషన్బ్రెజిల్లోని రియోడి జనీరోలో జరిగిన బ్రిక్స్ తాజా శిఖరాగ్ర సమావేశం అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. ట్రంప్ సుంకాల విధానాలను బ్రిక్స్ దేశాధినేతలు తీవ్రంగా విమర్శించారు. ‘రియో డి జనీరో డిక్లరేషన్’లో ఈ మేరకు స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘సుంకాలను విచక్షణారహితంగా పెంచడం ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీసి మరింత తగ్గించే ప్రమాదముంది. ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల్లో అనిశ్చితికి కారణమవుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నియమాల ఆధారిత, బహిరంగ, పారదర్శక, న్యాయమైన, సమానమైన బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థకు తమ మద్దతును పునరుద్ఘాటించారు. అనంతరం దీనిపై ట్రంప్ మరోసారి తీవ్రంగా ప్రతిస్పందించారు. అమెరికా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న దేశాలపై 10% అదనపు సుంకాలు తప్పవని పునరుద్ఘాటించారు. భారత్‌తో సహా అనేక దేశాల దిగుమతులపై అదనపు సుంకాలను ప్రకటించిన ట్రంప్ తర్వాత వాటి అమలును 90 రోజుల పాటు నిలిపేయడం తెలిసిందే. ఆ గడువు జూలై 9తో ముగుస్తుంది. తదనంతరం అమెరికా మార్కెట్లోకి ప్రవేశించే భారత వస్తువులపై అదనంగా 26 శాతం దిగుమతి సుంకం పడుతుంది. ప్రస్తుత సుంకాల బెదిరింపులతో ఆ భారాన్ని మరింత పెంచనుంది.

మస్క్‌ను చూస్తే జాలేస్తోంది.. అమెరికా అధ్యక్షుడి సంచలన ఆరోపణలు
అమెరికాలో రాజకీయంగా మరో సంచలనం రేగింది. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా పార్టీ ఏర్పాటుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మస్క్ పార్టీని అసంబద్ధమైనదిగా ఆయన అభివర్ణిస్తూ.. తీవ్ర ఆరోపణలే చేశారాయన. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. పరిపాలన సజావుగా సాగిపోతోంది. మరోవైపు డెమొక్రట్లు తమ ప్రాబల్యం కోల్పోతున్నారు. అయినప్పటికీ అమెరికా రాజకీయ వ్యవస్థ ఈ రెండు పార్టీలకు అనుకూలంగా ఉంది. ఈ తరుణంలో మూడో పార్టీ ఏర్పాటు అనేది అసంబద్దమైన చర్య. మూడో పార్టీ అమెరికా చరిత్రలో ఎప్పుడూ విజయవంతం కాలేదు అని ట్రంప్ అన్నారు. మూడో పార్టీని ఎవరు ఏర్పాటు చేసుకున్నా(మస్క్‌ను ఉద్దేశిస్తూ..) తమకేం ఫరక్ పడదని, అయితే ఆ పార్టీ వల్ల అమెరికా రాజకీయాల్లో గందరగోళం నెలకొంటుంది. దేశంలో అస్తవ్యస్తత నెలకొని కలహాలు చెలరేగే అవకాశమూ ఉంది అని ట్రంప్ హెచ్చరించారు. మస్క్ గతంలో తనకు మద్దతు ఇచ్చినా.. ఇప్పుడు పూర్తిగా మారిపోయారని ట్రంప్ అంటున్నారు. ‘‘మస్క్‌ను చూస్తే జాలేస్తోంది. గత ఐదువారాలుగా ఆయన అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఓ పోస్ట్ చేశారు. నేను ప్రవేశపెట్టిన బిల్లులో Electric Vehicle (EV) Mandate రద్దు చేయడం ముఖ్యాంశంగా ఉంది. దీని వల్ల ప్రజలు ఇకపై గ్యాస్, హైబ్రిడ్ లేదా కొత్త టెక్నాలజీ వాహనాలను స్వేచ్ఛగా కొనుగోలు చేయవచ్చు. అయితే మస్క్ గతంలో ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చి.. ఇప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అంతేకాదు.. మస్క్ తన సన్నిహితులను NASA చీఫ్‌గా నియమించాలనుకున్నారు. కానీ ఆ వ్యక్తి రిపబ్లికన్ పార్టీకి మద్దతు లేని డెమొక్రాట్ కావడం వల్లే అలా నియమించడం అనుచితమని భావించా. అమెరికా ప్రజలను రక్షించడమే నా ముందుకు ప్రధాన కర్తవ్యం’’ అంటూ ట్రంప్ పోస్టులో ప్రస్తావించారు.ఇదిలా ఉంటే.. బిగ్ బ్యూటీఫుల్ బిల్లును వ్యతిరేకిస్తూ ట్రంప్ పాలనా విభాగం డోజ్ నుంచి బయటకు వచ్చేసిన ఎలాన్ మస్క్ విమర్శలను తీవ్రతరం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో బిల్లు ఆమోదం గనుక పొందితే మూడో పార్టీ పెడతానంటూ చెబుతూ వచ్చారు. తాజాగా అదీ జరగడంతో శనివారం రాత్రి తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(పూర్వపు ట్విటర్)లో ‘అమెరికా పార్టీ’ని ప్రకటించారు. అమెరికాలో రెండు ప్రధాన పార్టీలు.. ఒకే పార్టీ వ్యవస్థగా మారిందని, ప్రజలకు తిరిగి స్వేచ్ఛ ఇవ్వడమే తన లక్ష్యమని చెబుతూ అమెరికా పార్టీ పేరును ప్రకటించారు. అలాగే.. ప్రజలలో 65% మంది మూడవ పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఓ పోల్‌ను చూపించారు. ఈ క్రమంలో ట్రంప్ ప్రవేశపెట్టిన భారీ ఖర్చుల బిల్లును(బిగ్ బ్యూటీఫుల్ బిల్)ను మరోసారి తీవ్రంగా విమర్శించారు.

భారత్-పాక్‌లను ఒకేలా తూచలేం: ‘బ్రిక్స్’లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ, దానిని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఖండించడంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పాక్ ఉగ్రవాద మద్దతుదారని, భారత్ ఉగ్రవాద బాధిత దేశమని.. ఈ రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.ఉగ్రవాదులకు నిశ్శబ్దంగా అనుమతి ఇవ్వడం కూడా ఆమోదయోగ్యం కాదని ప్రధాని పేర్కొన్నారు. పాకిస్తాన్ తన గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఉగ్రవాదాన్ని ఎలా విస్తరిస్తున్నదో స్పష్టమైన ఆధారాలతో భారత్ పదేళ్లుగా చూపిస్తున్నదన్నారు. కాగా ‘రియో డి జనీరో డిక్లరేషన్’లో బ్రిక్స్ గ్రూపు నేతలు ఉగ్రవాద చర్యలను నేరపూరితమైనంటూ తీవ్రంగా ఖండించారు. జమ్ముకశ్మీర్‌లో 2025, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమ నిబద్ధతను మేము పునరుద్ఘాటిస్తున్నామని పేర్కొన్నారు.ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటానికి సహకారం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని, అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసి ఆమోదించాలని పిలుపునిస్తున్నామని బ్రిక్స్ నేతలు పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాద సంస్థలపై సమిష్టి చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలకు పిలుపునిస్తున్నామని రియో డి జనీరో డిక్లరేషన్ పేర్కొంది. కాగా పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించి, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.

చైనాలో అధికార వికేంద్రీకరణ!
బీజింగ్: చైనాలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శకం ముగిసిందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. 12 ఏళ్లుగా ఇనుప పిడికిలితో దేశాన్ని పాలిస్తున్న ఉన్న ఆయన నెమ్మదిగా అధికారాన్ని పార్టీలోని కీలక విభాగాలకు అప్పగించడం ప్రారంభించారు. దాంతో చైనాలో అధికార మార్పిడి రంగం సిద్ధమైనట్టు కన్పిస్తోంది. 24 మందితో కూడిన అధికార చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీపీసీ)పొలిటికల్ బ్యూరో జూన్ 30న సమావేశమైంది. పార్టీలోని వివిధ సంస్థల పనులపై నిబంధనలను సమీక్షించింది. ఆయా సంస్థలు ప్రభావవంతమైన నాయకత్వాన్ని, సమన్వయాన్ని ప్రదర్శించాలని, ప్రధానమైన పనుల ప్రణాళికతోపాటు చర్చించడం, పర్యవేక్షించడంపై దృష్టి పెట్టాలని సూచించింది. ఈ విషయాలన్నీ ప్రభుత్వ అధీనంలోని వార్తా సంస్థ జిన్హువా తెలపడంతో అధికార మార్పిడి గురించి ఊహాగానాలు చెలరేగాయి. పార్టీ సంస్థలపై నిబంధనలు జిన్‌పింగ్ పదవీ విరమణ దిశగా సన్నాహాలను సూచిస్తున్నాయని పార్టీలోని కీలక సభ్యుడు ఒకరు తెలిపారు. సీపీసీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా గుర్తింపు పొందిన జిన్‌పింగ్ పెద్ద సమస్యలపై దృష్టి పెట్టడానికి కొన్ని అధికారాలను ఇలా ఇతరులకు అప్పగిస్తున్నారని కొందరంటున్నారు. ఆదివారం రియో డి జనీరోలో మొదలైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి కూడా జిన్‌పింగ్ హాజరలేదు. ఈ సమావేశానికి ఆయన గైర్హాజరవ్వడం గత 12 ఏళ్లలో ఇదే మొదటిసారి. 2012లో సీపీసీ జనరల్ సెక్రటరీగా జిన్‌పింగ్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి పాలనపై వేగంగా పట్టుసాధించారు. చైనాలో అతిపెద్ద అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తూ, అధికార నిర్మాణాలను తన చేతిలోకి తెచ్చుకున్నారు. పది లక్షల మందికి పైగా అధికారులను శిక్షించారు. డజన్ల కొద్దీ అగ్ర జనరల్‌లను తొలగించారు. పార్టీ ‘ముఖ్య నాయకుడు’గా తనను తాను ప్రకటించుకున్నారు. మావో తరువాత ఈ హోదాను దక్కించుకున్నది జిన్‌పింగ్ మాత్రమే. ఆ తర్వాత నియమాలను సవరించి మరీ చైనా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2022లో పార్టీ జనరల్ సెక్రటరీగా, 2023లో అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి కొనసాగారు. దాంతో బహుశా ఆయన జీవితాంతం అధ్యక్షుడిగా కొనసాగుతారని అంతా భావించారు.
జాతీయం

బంగ్లాను ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం
న్యూఢిల్లీ: అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సోమవారం తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన అద్దె బంగ్లాకు ఇప్పటికే కొంత సామాను కూడా పంపించామన్నారు. మిగతాది కూడా ప్యాకింగ్ పూర్తి చేసి స్టోర్ రూంలో ఉంచామని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ కృష్ణ మీనన్ మార్గ్‌లోని ఐదో నంబర్ బంగ్లాలో చంద్రచూడ్ దంపతులు దివ్యాంగులైన ఇద్దరు కుమార్తెలతో ఉంటున్నారు. అయితే, అనుమతించిన సమయానికి మించి ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాయడం కలకలం రేపింది. ఈ అంశం వివాదాస్పదం కావడం తనకెంతో విచారం కలిగించిందన్నారు. ‘నా కుమార్తెలు ప్రియాంక, మహిలు నెమాలిన్ మయోపతి అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఇంట్లో కూడా వారిని అత్యంత పరిశుభ్రతతో కూడిన వాతావరణంలో ఉంచాల్సి ఉంది. వారికోసం ప్రత్యేకంగా నర్సును ఏర్పాటు చేశాం. వారిని వీల్‌చైర్‌లో తిప్పేందుకు అనువుగా ఉండే ఇల్లు ఎంతో అవసరం. పెయిన్, స్పీచ్ థెరపీతోపాటు వారికి నిత్యం చెస్ట్, రెస్పిరేటరీ, న్యూరలాజికల్ థెరపీనీ చేయించాల్సి ఉంటుంది. కొత్త ఇల్లు సిద్ధమైందని చెప్పిన వెంటనే ఖాళీ చేస్తాం..అందుకు రెండు రోజులు, రెండు వారాలు కూడా పట్టొచ్చు..’అని చంద్రచూడ్ చెప్పారు.

రీల్ కోసం పాకులాట
జైపూర్: రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తె ప్రాణాలను పణంగా పెట్టి రీల్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిండుగా తొణికిసలాడుతున్న భరత్పూర్ జిల్లాలోని బంధ్ బరైతా రిజర్వాయర్‌పై ఉన్న ఇనుప ఫ్రేమ్‌పై భయపడుతున్న తన కూతురిని బలవంతంగా అతడు కూర్చోబెడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ నెల 4న ఉమా శంకర్ తన భార్య, కుమార్తెతో జలాశయం వద్దకు వెళ్లాడు. వీడియో చిత్రీకరించేందుకు గాను ప్రమాదకరంగా ఉన్న ఇనుప ఫ్రేమ్‌పై తీవ్రంగా భయపడుతున్న తన కుమార్తెను గద్దించి కూర్చోబెట్టాడు. అక్కడ ఆమె కిందపడకుండా పట్టుకునేందుకు సైతం ఎలాంటి రక్షణ ఏర్పాటూ లేకపోవడం గమనార్హం. ఆ రిజర్వాయర్ ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. ఇటీవల వర్షాలకు జలకళ సంతరించుకుంది. ఇలాంటి పరిస్థితులు ఉమా శంకర్ తీసి, సోషల్ మీడియాలో పెట్టిన వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం కూతురు పట్ల ఇంత బాధ్యత లేకుండా వ్యవహరించే తల్లిదండ్రులు కూడా ఉంటారా అని నిలదీశారు. దీంతో, ఉమా శంకర్ తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేశాడు. పోలీసులు దీనిపై ఇంకా స్పందించలేదు.

బ్రహ్మపుత్రలో కొత్త చేప
దిబ్రుగఢ్: జీవవైవిధ్యానికి నెలవైన బ్రహ్మపుత్ర నదీజలాల్లో మరో కొత్త జాతి చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తోక సమీపంలో పెద్ద నల్ల మచ్చతో ఉన్న ఈ చిన్న చేపకు శాస్త్రవేత్తలు వెంటనే పేథియా దిబ్రూఘర్నేసిస్ అనే పేరుపెట్టేశారు. ఈశాన్య భారతంలోని అస్సాంలో బ్రహ్మపుత్ర నదీజలాల్లో ఈ నూతన మత్స్యజాతిని గుర్తించారు. దిబ్రూగఢ్ సమీప జలాల్లో ఈ మంచినీటి చేపను కనుగొన్నారు. అందుకే దిబ్రూగఢ్ పేరు ధ్వనించేలా పేథియా దిబ్రూఘర్నేసిస్ అని పేరుపెట్టారు. ఈ మత్స్యం నెత్తల్లు వంటి చిన్నచేపలుండే సైప్రినిడ్ జాతికి చెందినదిగా వర్గీకరించారు. బ్రహ్మపుత్ర నదీ ప్రవాహం వెంట ఉన్న భిన్నజాతుల చేపలు, వాటి సంతతి, వృద్ధి, ఇతర రకాల జలచరాల వివరాలను తెల్సుకునేందుకు సర్వే చేపట్టగా ఆ క్రమంలో అధ్యయనకారులకు ఈ చేప కంటబడింది. మిగతా చేపలతో పోలిస్తే కొత్తరకం చేప కాస్తంత భిన్నమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎన్నెన్నో ప్రత్యేకతలు తాను ఈదుతున్న నీటిలో ఏదైనా షార్క్, డాలి్ఫన్, ఆక్టోపస్ వంటి శత్రుజలచరాలు కదిలితే నీటి తరంగాలతో వాటి కదలికలను కనిపెట్టి అప్రమత్తం చేసే జ్ఞానేంద్రియ రేఖ(లేటరల్ లైన్) ఈ చేపలో అసంపూర్ణంగా అభివృద్ధి చెందింది. ఈ కారణంగా దీనిని ఇతర జీవులు వేటాడటం సులభం అవుతుంది. ఇది పెద్దగా కష్టపడకుండానే వాటి నోటికి చిక్కుతుంది. తోక సమీపంలో పెద్ద నల్ల మచ్చ దీని ప్రత్యేకత. తోక చుట్టూతా 10 పొలుసులు భిన్నంగా ఉన్నాయి. అదీకాకుండా పై భాగంలోని రెక్కకు, లేటరల్ లైన్‌కు మధ్యలో నాలుగు పొలుసుల వరసలు, అదే విధంగా కింది రెక్కకు, లేటరల్ లైన్‌కు మధ్యలో మరో నాలుగు పొలుసుల వరసలు ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. ‘‘పిల్లి మీసాల్లాగా చేప నోటి వద్ద ఉండే నిర్మాణం ఈ జాతి చేపకు లేదు. చేప కన్ను తర్వాత వెనక్కివెళ్లే కొద్దీ తొలుత కనిపించే ప్రాంతంలో దీనికంటూ ప్రత్యేకంగా ఎలాంటి మచ్చలు, రంగులు లేవు. కానీ తోక సమీపంలో విచిత్రంగా నల్లని, పొడవాటి మచ్చ ఉంది. ఈ జాతిచేపలన్నింటిలో ఈ మచ్చ ఉంది. బ్రహ్మపుత్ర జలాలు జీవవైవిధ్యానికి పట్టుగొమ్మలని ఈ చేప మరోసారి నిరూపించింది’’ అని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. ‘‘ నదీ ప్రవాహం వెంట చిత్తడి నేలల పరిరక్షణ, మితిమీరిన చేపల వేటను తగ్గించడం వంటి చర్యలతో ఇలాంటి అరుదైన చిన్న కొత్త చేపలను పరిరక్షించవచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి’’ అని అధ్యయనకారులు సూచించారు.

అందమైన శత్రువు..
పరిమితికి మించి పాదరసం ఉన్న సౌందర్య సాధనాల (కాస్మెటిక్స్) విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డి.సి.జి.ఐ.) నేతృత్వంలోని కమిటీ ఒకటి.. పాదరసం కలిసిన సౌందర్య సాధనాల ఉత్పత్తులపై నివేదికను సమర్పించింది. ఈ విషయాన్ని జూన్17న జరిగిన సమావేశం మినిట్స్‌లో డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) ధ్రువీకరించింది. చట్టప్రకారం కాస్మెటిక్స్‌లో పాదరసం నిర్దేశిత మోతాదుపై ఎలాంటి మార్పూ చేయనప్పటికీ.. సౌందర్య సాధనాల తయారీపై నిఘాను కఠినతరం చేయనుంది. అసలింతకీ ప్రమాదకర లక్షణాలు పాదరసంలో ఏమున్నాయి.. ఇంతకూ దాన్ని సౌందర్య సంబంధ ఉత్పత్తుల్లో ఎందుకు వాడతారు? – సాక్షి, స్పెషల్ డెస్క్భారత్లో కాస్మెటిక్స్ అన్నది సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం. అమ్మకాల పరంగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద మార్కెట్ మనది. చాలా సౌందర్య సాధనాల్లో స్వల్ప స్థాయుల్లో పాదరసం వినియోగిస్తారు. అయితే పాదరసం మానవ ఆరోగ్యాన్నీ, పర్యావరణాన్నీ రెండింటినీ ప్రభావితం చేసే విషపూరిత మూలకం. అందుకే కాస్మెటిక్స్ తయారీలో ఈ లోహం వాడకాన్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.2013 ‘మినామాటా కన్వెన్షన్ ’..: పాదరసం, పాదరస సమ్మేళనాల హానికర ప్రభావాల నుండి మానవాళిని, పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో 2013లో జపాన్ వేదికగా ‘మినామాటా కన్వెన్షన్ ’ (మినామాటా అంతర్జాతీయ ఒప్పందం) కుదిరింది. దాని ప్రకారం సౌందర్య సాధనాలలో 1 పీపీఎం (ఒక పార్ట్స్ పర్ మిలియన్ – అంటే 0.0001 శాతం) కంటే ఎక్కువ పాదరసం ఉండకూడదు. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పరిమితి దాటి పాదరసం ఉన్న కాస్మెటిక్స్ ఎగుమతులను, దిగుమతులను, తయారీని, ఇంకా ఇతర లోపాలను గుర్తించేందుకు డీసీజీఐ 2024లో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. మనదేశంలోని ప్రస్తుత కాస్మెటిక్స్ చట్టం.. ‘మినామాటా కన్వెన్షన్ ’ ఒప్పందానికి లోబడే ఉందని ఆ ఉపసంఘం నివేదిక పరిశీలించిన డీసీసీ స్పష్టం చేసింది.దిగుమతులే ఆధారంమనదేశం పాదరసం విషయంలో దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2023లో మనదేశం 32.77 లక్షల డాలర్ల విలువైన 73,085 కిలోల పాదరసం దిగుమతి చేసుకుంది. మనకు ఎగుమతి చేసే ప్రధాన దేశాలు పెరు, థాయ్‌లాండ్, జపాన్, జర్మనీ, యూకే. మనదేశ నిబంధనల ప్రకారం కంటి ప్రాంతంలో ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులలో కలిపే పాదరసం స్థాయి 70 పీపీఎంలకు (అంటే 0.007 శాతం) మించకూడదు. ఇతర సౌందర్య సాధనాలలో ఇది 1 పీపీఎంను దాటకూడదు.అన్ని రంగాల నిపుణులతో..‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ ఏర్పాటు చేసిన సిఫారసుల కమిటీకి చైర్మన్‌గా – ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి డెర్మటాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్.ఎన్. భట్టాచార్య, సభ్యులుగా ఫార్మకాలజీ, టాక్సికాలజీ విభాగాల వైద్య నిపుణులు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అధికారులు, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందినవారు ఉన్నారు. ‘అందానికి’ పాదరసం ఎందుకు?పాదరసాన్ని సాధారణంగా చర్మాన్ని తెల్లగా చేసే ఉత్పత్తుల్లో వాడతారు. చర్మాన్ని కాంతిమంతం చేసే క్రీములు; చర్మంపై చిన్న చిన్న మచ్చలు, నల్ల మచ్చలను పోగొట్టే సౌందర్య సాధనాలు; వయసును కనపడనీయని యాంటీ–ఏజింగ్ సొల్యూషన్ లు, ఇంకా కొన్ని రకాలైన మేకప్ పదార్థాలు.. పాదరసాన్ని కాస్తయినా కలపకుండా తయారు కావు. చర్మం రంగు నల్లగా ఉండటానికి చర్మంలోని ‘మెలనిన్’ కారణం. పాదరసం ఆ మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. తద్వారా నల్లదనం తగ్గుతుంది. అలాగే పాదరసం కొన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగస్‌లను చంపగలదు. కొన్ని సౌందర్య సాధనాలలో సంరక్షణకారిగానూ ఉపయోగపడుతుంది.చాలా ప్రమాదకరంప్రపంచ ఆరోగ్య సంస్థ పాదరసాన్ని అత్యంత ప్రమాదకరమైన టాప్ 10 రసాయనాల జాబితాలో చేర్చింది. పాదరసం కలిసి ఉన్న కాస్మెటిక్స్‌ను దీర్ఘకాలం వాడటం వల్ల మూత్ర పిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు పాదరసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాదరసం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. » ఒంటిమీద దద్దుర్లు, రంగు పోవడం» జీర్ణ సంబంధమైనవి» వ్యాధి నిరోధక శక్తి తగ్గడం» ఆందోళన, ఒత్తిడి» నాడీ సంబంధమైనవి» జ్ఞాపకశక్తి సమస్యలు» భావోద్వేగాల్లో అనూహ్యమైన మార్పులుభారీగా పెరిగిన కాలుష్యంపాదరస ఉద్గారాలు 1960తో పోలిస్తే 2021లో 3.3 రెట్లు పెరిగాయి. మొత్తం ఉద్గారాల్లో చైనా, భారత్, ఇండోనేషియా, పెరు, బ్రెజిల్‌ల వాటా దాదాపు 50 శాతం. – ప్రపంచంలో అత్యధిక పాదరస కాలుష్యానికి కారణమవుతున్న దేశం చైనా. ఆ తరవాతి స్థానంలో మనదేశం ఉంది.» బంగారు ఆభరణాల తయారీలో, బంగారం తవ్వకాలు వంటి వాటిలో పాదరసాన్ని విరివిగా వినియోగిస్తారు.» కొన్ని రకాల పరిశ్రమలు, సిమెంటు తయారీ, ఈ–వేస్ట్ వంటి చెత్తను కాల్చడం, బొగ్గును కాల్చడం.. ఇలా పాదరసం అనేక కారణాల వల్ల వాతావరణంలోకి చేరుతోంది.ఇలా చూసుకోవచ్చు|మనం కొనే ఉత్పత్తుల్లో మెర్క్యురస్ క్లోరైడ్, క్యాలొమెల్, మెర్క్యురిక్ అయోడైడ్ అనే పేర్లు ఉంటే జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇవన్నీ పాదరస సంబంధమైనవే.
ఎన్ఆర్ఐ

Neha Reddy అమెరికాలో అందెల సవ్వడి, డాక్టర్ కావాలనేది కల
..మన కళలు మనతో ఉంటే ఏ దేశంలో ఉన్నా...మన దేశం మనలో ఉన్నట్లే! ఆ భావనతో కూచిపూడికి దగ్గరైంది నేహా. మన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేహ నృత్యప్రదర్శన ఇచ్చింది. అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ నేహా రెడ్డి ఆళ్లకు భారతీయ నృత్యకళలపై మంచి అవగాహన ఉంది.చిన్నవయసులోనే కూచిపూడి నృత్యకారిణిగా ‘శభాష్’ అనిపించుకుంది. తల్లిదండ్రులు శివరామిరెడ్డి, నాగమల్లేశ్వరిల చొరవ, ప్రోత్సాహంతో వర్జీనియాలోని ‘కళామండపం’ నృత్య పాఠశాలలో గురువు మృణాళిని సదానంద దగ్గర కూచిపూడి నేర్చుకుంది నేహ.రేపు శనివారం మరోసారి తన నృత్యప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయింది. నృత్యంలోనే కాదు చదువులోనూ రాణిస్తున్న నేహాకు డాక్టర్ కావాలనేది లక్ష్యం. నృత్య కళలో మరింతగా రాణించాలని, డాక్టర్ కావాలనే తన కలను నెరవేర్చుకోవాలని ఆశిద్దాం.ఇదీ చదవండి : Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్

క్యాషియర్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నేరమా బాస్?!
ఓ చిరుద్యోగం చేసుకునే మహిళ ఎంతో కష్టపడి, ఇష్టపడి కారు కొనుక్కుంటే..ఆ ఉద్యోగిని ఉద్యోగంలోంచి తీసేసిన ఘటన చర్చకు దారితీసింది. మంచి జీవితం గడపడం కూడా తప్పేనా అంటూ బాధిత మహిళ సోషల్ మీడియాలో తన గోడును వెళ్ల బోసుకుంది. దీంతో ఈ స్టోరీ వైరల్‌గా మారింది.దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ఒక గ్యారేజ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తోంది అసేజా లిమెలింటాకా (28) భారతీయ సంతతికి చెందిన షిరాజ్ పటేల్ ఆమె బాస్. సెకండ్‌హ్యాండ్ హోండా కారు కొనుక్కుని ఆ కారులో ఆఫీసుకు వెళ్లడమే ఆమె చేసిన నేరం. జీతం తక్కువగా ఉన్నా, కారు కొన్నావా అంటూ తన బాస్ తనను తొలగించారని ఆమె ఆరోపించింది. కష్టపడి ఎన్నో నెలల పొదుపు చేసుకుని, లోన్ తీసుకుని మరీ తన కారు కొన్నానని వాపోయింది.ఇవన్నీ చెప్పినా కూడా బాస్ పటేల్ తనను నమ్మ లేదని , వేరే చోట పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి ఆమె బ్యాంక్ ఖాతాను చూపించాలని డిమాండ్ చేశాడని ఆమె ఆరోపించింది. వివరాలు చూసి కొత్త ఫర్నిచర్ కొంటున్నావ్, ఇక నువ్వు క్యాషియర్‌గా ఉండటానికి వీల్లేదంటూ తనను తీసేసారని ఆమె ఫేస్బుక్ పోస్ట్‌లో రాసింది.అంతేకాదు దొంగతనం ఆరోపణలు కూడా చేశాడని పేర్కొంది. పెట్రోల్ పంప్ అటెండెంట్‌గా పనిచేయాలని లేదా రాజీనామా చేయాలని అతను ఆమెకు అల్టిమేటం ఇచ్చాడని ఆమె అన్నారు.అయితే బెర్క్లీ మోటార్ గ్యారేజ్ యజమాని లిమెలింటకా చేసిన ఆరోపణలను ఖండించారు. ఆమెను తొలగించలేదని పేర్కొన్నారు. తామె ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు చేయలేదద చాలా నిజాలని దాచిపెట్టిందన్నారు. అలాగే కంపెనీపై తప్పుడు ఆరోపణలు చేసినందు వల్ల ఇకపై అప్రమత్తంగా ఉంటామని తెలిపాడు.

డాలస్‌లో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో "అడాప్ట్-ఎ-విలేజ్" ఘన విజయం
డాల్లస్, టెక్సాస్ - జూన్ 28 టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లోని జాక్ సింగ్లీ ఆడిటోరియం లో శంకర నేత్రాలయ USA మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) చొరవకు మద్దతుగా మ్యూజిక్ & డ్యాన్స్ ఫర్ విజన్ అనే దాతృత్వ వేడుకను ఘనంగా నిర్వహించారు. 400 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో గ్రామీణ భారతదేశంలో నివారించదగిన అంధత్వాన్ని నిర్మూలించే లక్ష్యంతో సమాజం, కళ ,సేవా శక్తిని ప్రదర్శించింది. వారి ప్రారంభ వ్యాఖ్యలలో, "కరుణ సమాజాన్ని కలిసినప్పుడు మనం ఏమి సాధించగలమో ఈ కార్యక్రమం నిదర్శనం" అని పాలకమండలి సభ్యులు డాక్టర్ రెడ్డి ఊరిమిండి అన్నారు. "MESU చొరవ కేవలం మొబైల్ సర్జరీ గురించి కాదు - ఇది ఆశను సమీకరించడం గురించి" అని శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి వ్యాఖ్యానించారు.ఒక చిరస్మరణీయ సాయంత్రానికి హృదయపూర్వక ప్రారంభంప్రతిభావంతులైన గాయకులు,వాయిద్యకారులు ప్రదర్శించిన భక్తి మరియు శాస్త్రీయ కూర్పుల శ్రేణి ప్రేక్షకులను కదిలించాయి. - జానకి శంకర్, సంతోష్ ఖమ్మంకర్, ప్రభాకర్ కోట, భారతి అంగలకుదిటి , కామేశ్వరి చరణ్ తమగానంతో ఆకట్టుకున్నారు. రవి తుపురాని సజావుగా సమన్వయం చేసిన వారి కళాత్మకత ప్రశంసలను పొందింది. నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ స్కూల్, కూచిపూడి కళాక్షేత్రం, అభినయ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ, తత్యా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, నాట్యోం డ్యాన్స్ అకాడమీ, తాండవం స్కూల్ ఆఫ్ కూచిపూడి, రాగలీన డ్యాన్స్ అకాడెమీ నృత్య ప్రదర్శనలతో సహా డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతంలోని డాన్స్ అకాడమీలు - సంప్రదాయం, కథనాల్లో పాతుకుపోయిన నేపథ్య ఘట్టాలను ప్రదర్శించారు. ముఖ్య అతిథి, మెగా దాతకు సత్కారంశంకర నేత్రాలయ USA ముఖ్య అతిథి మరియు సలహాదారుల బోర్డు సభ్యురాలు ప్రసాద రెడ్డి కాటంరెడ్డి , కరుణామయ దాత శ్రీమతి శోభా రెడ్డి కాటంరెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కాటంరెడ్డి కొత్త మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) స్థాపనకు 5 లక్షల డాలర్ల విలువైన స్మారక విరాళాన్ని అందించారు.ఈ అసాధారణ దాతృత్వ చర్య పేద గ్రామీణ సమాజాలలో వేలాది మందికి దృష్టిని రక్షించే శస్త్రచికిత్సలను తీసుకువస్తుంది. దృష్టి సంరక్షణ కోసం వారి అచంచల నిబద్ధతను గుర్తించి, ఈ జంటను హృదయపూర్వకంగా సత్కరించారు. నివారించదగిన అంధత్వాన్ని తొలగించే లక్ష్యంలో తమ ముఖ్య అతిథిగా , నిజమైన భాగస్వామిగా కలిగి ఉండటం చాలా గౌరవంగా ఉందని అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి కొనియాడారు.ఛాంపియన్స్ ఆఫ్ విజన్: మా అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లకు గౌరవంఅలాగే ముగ్గురు విశిష్ట సమాజ నాయకులు AVN రెడ్డి, డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఆళ్ళ గౌరవ అతిథులుగా చాలా కాలంగా భారతీయ-అమెరికన్ సమాజంలో సాంస్కృతిక పరిరక్షణకు మార్గదర్శకులుగా ఉన్నారు. 35 MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు మరియు అనేక మంది కరుణామయ వ్యక్తిగత దాతల అచంచల మద్దతు ద్వారా 4లక్షల డాలర్లకుపైగా నిధులను సేకరించింది. ఆనంద్ దాసరి, ఉన్నత సలహాదారు, బెనిఫాక్టర్ స్పాన్సర్లు ప్రకాష్ బేడపూడి, మూర్తి రేకపల్లి, శ్రీని వీరవల్లి, కిషోర్ కంచర్ల, అరవింద్ కృష్ణస్వామి, మరియు MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు, తిరుమల్ రెడ్డి కుంభం, బుచ్చిరెడ్డి గోలి, సునీత & డాక్టర్ రాజు కోసూరి, శ్రీకాంత్ బీరం, శ్రీని SV, ఆండీ ఆశావ, సతీష్ కుమార్ సేగు, డాక్టర్ కల్వకుంట్ల లక్ష్మణ్ రావు, డాక్టర్ రూపేష్ కాంతాల, అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, రావు కల్వల, అర్జున్ మాదాడి (స్వర్గీయ భాను మాదాడి జ్ఞాపకార్థం), ప్రవీణ్ బిల్లా, శివ అన్నపురెడ్డి, డాక్టర్ పవన్ పామదుర్తి, డాక్టర్ శ్రీనాధ రెడ్డి వట్టం, రమన్ రెడ్డి క్రిస్టపాటి లకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అసాధారణ దాతృత్వం దాదాపు 6,000 కంటిశుక్లం శస్త్రచికిత్సలుగా మారుతుంది - ప్రతి ఒక్కటి దృష్టి లోపంతో బాధపడుతున్న పేద వ్యక్తులకు జీవితాన్ని మార్చే బహుమతి. "ప్రతి అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్ మొత్తం సమాజానికి ఆశాకిరణంగా మారారు. మీ నిబద్ధత ఆర్థిక సహాయం కంటే చాలా ఎక్కువ - ఇది వేలాది మందికి దృష్టి, గౌరవం మరియు అవకాశాన్ని పునరుద్ధరించే శక్తివంతమైన చర్య అంటూ శంకర నేత్రాలయ USA తరపున డాక్టర్ రెడ్డి ఊరిమిండి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నృత్య గురువులు, గాయకులు,కళా ప్రదర్శకులను సత్కరించారు. శంకర నేత్రాలయ USA కోశాధికారి మూర్తి రేకపల్లి, కార్యదర్శి వంశీ ఏరువారం, పాలక మండలి సభ్యులు మెహర్ చంద్ లంక, నారాయణరెడ్డి ఇందుర్తి, ఆది మొర్రెడ్డి, చంద్ర మౌళి సరస్వతి, మహిళా కమిటీ చైర్పర్సన్ రేఖ రెడ్డి, కమిటీ సభ్యులు మోహన నారాయణ్ లను పాలక మండలి సభ్యులు డాక్టర్ రెడ్డి ఊరిమిండి, డాక్టర్ ప్రవీణ వజ్జ, డల్లాస్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ చినసత్యం వీర్నపు, కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమం విజయవంతంకావడంలో కీలక పాత్ర పోషించారు. 35 మంది అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లతో పాటు, అనేక మంది వ్యక్తిగత దాతలను కూడా ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమ వ్యాఖ్యాతగా పరిమళ మార్పాక వ్యవహరించారు.మరిన్ని వివరాలకు లేదా విరాళం ఇవ్వడానికి, దయచేసి www.sankaranethralayusa.org ని సందర్శించండి లేదా (855) 463-8472 కు టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయండి.

‘స్కామర్..’: భారతీయ టెకీపై అమెరికా సీఈవోలు ధ్వజం
అమెరికాకు చెందిన అయిదు కంపెనీల సీఈవోలను మోసం చేశాడంటూ భారత్‌కు చెందిన టెకీపై ఆరోపణలు గుప్పుమన్నాయి.'స్కామర్' అంటూ ఐదుగురు సీఈవోలు భారతీయ టెక్కీపై ఆరోపణలు గుప్పించారు. అతనితో జాగ్రత్త అంటూ బహిరంగంగా స్టార్టప్‌లను హెచ్చరించడం టెక్ సర్కిల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఇంతకీ ఎవరీ టెకీ, అసలు వివాదం ఏమిటిభారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోహమ్ పరేఖ్ బహుళ స్టార్టప్‌లలో ఒకేసారి మూన్లైట్ (ఒకేసారి వివిధ కంపెనీల్లో పనిచేయడం) చేసినట్లు, యజమానులను మోసం చేసి, స్టార్టప్ కంపెనీలకు మోసగించాడు అనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని తొలుత మిక్స్‌ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ CEO సుహైల్ దోషి వెలుగులోకి తెచ్చారు. పరేఖ్ తప్పుడు సాకులతో ఒకేసారి బహుళ స్టార్టప్‌లను మోసం చేస్తున్నాడన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. పరేఖ్ తన కంపెనీ ప్లేగ్రౌండ్ AIలో కొంతకాలం ఉద్యోగంలో ఉన్నాడని, కానీ అతని నిజాయితీ లేని ప్రవర్తన కారణంగా వారంలోనే అతనిని తొలగించామని వెల్లడించారు.Guys we found Soham Parekh! pic.twitter.com/bWnODxbM8l— Satwik Singh (@itsmesatwik_) July 3, 2025 పరేఖ్‌ను బహుళ కంపెనీలలో మూన్‌లైటింగ్ ఆపమని తాను హెచ్చరించానని, కానీ అతని పట్టించుకోలేదు, అబద్ధాలు, మోసాలు ఆపమని చెస్పినా, ఏడాది తర్వాత కూడా అదే కొనసాగించాడు. అందుకే తీసి వేశామన్నారు. ఒకేసారి 3-4 స్టార్టప్‌లలో ఉద్యోగాలు చేశాడని ఆరోపించారు. తన వాదనలకు బలం చేకూర్చేలా పరేఖ్ CVని పోస్ట్ చేశాడు. PSA: there’s a guy named Soham Parekh (in India) who works at 3-4 startups at the same time. He’s been preying on YC companies and more. Beware.I fired this guy in his first week and told him to stop lying / scamming people. He hasn’t stopped a year later. No more excuses.— Suhail (@Suhail) July 2, 2025 ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 1.28 కోట్ల వ్యూస్ వచ్చాయి. అనేకమంది కంపెనీ యజమానులు ఆయనకు మద్దుతుగా నిలిచారు. ముఖ్యంగా ఫ్లీట్ AI సహ వ్యవస్థాపకుడు , CEO నికోలాయ్ ఔపోరోవ్ ఇవే ఆరోపణలు గుప్పించారు. ఇంకా AIVideo సహ వ్యవస్థాపకుడు జస్టిన్ హార్వే, అని మరొక స్టార్టప్, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మొజాయిక్ వ్యవస్థాపకుడు ఆదిష్ జైన్ ఇదే ఆరోపణలను ధృవీకరించారు, ఇంటర్వ్యూలలో బాగానే ఉన్నాడు కానీ అతను అబద్ధాలకోరు అని వ్యాఖ్యానించడం గమనార్హం. యాంటిమెటల్ CEO మాథ్యూ పార్క్హర్స్ట్ ఏమంటారంటే.. సోహామ్ 2022లో కంపెనీలో ఇంజనీర్‌గా చేరాడు. తెలివైన వాడే.. కానీ బహుళ కంపెనీలలో పనిచేస్తున్నాడని చాలా తొందరగానే గమనించాం. అందుకే అతణ్ని తొలగించామన్నారు. అంతేకాదు పరేఖ్ ముంబై విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ జార్జియా టెక్ నుండి మాస్టర్స్ డిగ్రీ బహుశా 90 శాతం నకిలీదేమో అన్ని అనుమానాల్ని కూడా వ్యక్తం చేశారు. నేను ఉద్యోగం లేక బాధపడుతోంటే, సోహమ్ పరేఖ్‌ను 79 సార్లు హైర్ చేసుకున్నారా అంటూ విచారం వ్యక్తం చేశాడో నిరుద్యోగ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే సోహమ్ పరేఖ్ ఈ ఆరోపణలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.అయితే తప్పేంటి?మూన్‌లైటింగ్ తప్పు అని మీరు ఎందుకనుకుంటున్నారు. అతను ఇంటర్వ్యూలలో పాస్ అయ్యాడు. బెస్ట్ అనే కదా మీరు అతణ్ని తీసుకున్నారు. అతను సరైన వైఖరితో సమయానికి అన్ని పనులను పూర్తి చేసినంత కాలంతప్పేంటి అంటూ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మరో టెక్నిపుణురాలు ట్వీట్ చేశారు.
క్రైమ్

తప్పెవరిది?.. తమిళనాడు ఘోర ప్రమాదంపై చర్చ
తమిళనాడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఓ స్కూల్ వ్యాన్ పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.సాక్షి, చెన్నై: తమిళనాడు కడలూరులో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం చెమ్మంగుప్పం వద్ద ఓ స్కూల్ వ్యాన్ రైలు పట్టాలను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది విధ్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే.. గేట్‌మేన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందన్న విమర్శలు వినిపిస్తుండగా.. మరోవైపు డ్రైవర్ కోరితేనే తాను గేటు తెరిచానని గేట్‌మేన్ చెబుతున్నాడు. ఈ క్రమంలో తప్పెవరిదనే చర్చ నడుస్తోంది. ఈలోపు గేట్‌మేన్ పంకజ్‌శర్మను రైల్వే అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రమాదం ధాటికి వ్యాన్ చిన్నారుల మృతదేహాలు ముక్కలై పడ్డాయి. రైలు ఢీ కొట్టిన వేగానికి 50 మీటర్ల దూరం ఎగిరిపడి తుక్కు అయిన వ్యాన్ దృశ్యాలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి.கேட் கீப்பரின் அலட்சியத்தால் பள்ளி வேன் மீது ரயில் மோதி 2 மாணவர்கள் ப**யான கோர விபத்து... தண்டவாளத்தில் சிதறிக்கிடந்த புத்தகப்பை... மனதை நொறுக்கிய காட்சிகள்....!#Cuddalore | #SchoolVan | #RailwayTrack | #GateKeeper | #CuddaloreAccidentUpdate | #TrainAccident | #PolimerNews pic.twitter.com/yv79s6oamO— Polimer News (@polimernews) July 8, 2025

‘డ్రగ్’ల్బాజీ సూత్రధారుల సంగతేంటి!
సాక్షి, విశాఖపట్నం: కూటమి నేతల అండదండలతో డ్రగ్స్ కల్చర్ విశాఖ మహా నగరంలోకి ప్రవేశించేసింది. ఎన్నికల ముందు కంటైనర్‌లో రూ.వేల కోట్ల డ్రగ్స్ విశాఖకు వచ్చాయంటూ లేనిపోని ఆరోపణలు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు ఏకంగా విశాఖ నగరాన్నే డ్రగ్స్‌కి అడ్డాగా మార్చేశారు. ఎలాగోలా వలపన్ని పట్టుకున్న పోలీసులు డ్రగ్ రాకెట్‌ను ఛేదించేందుకు ప్రయత్నిస్తుంటే.. నేరుగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలోనే తిష్టవేసి కేసు ముందుకెళ్లకుండా టీడీపీ పెద్దలు నిలువరిస్తున్నారు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకురావడం వెనుక ఉన్న అసలైన సూత్రధారుల్ని వదిలేసి.. పాత్రధారులతోనే కేసు దర్యాప్తును ముగించేస్తున్నారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టే ఓ బడా నేత కుమారుడు ఇందులో ఉండటంతో టీడీపీకి చెందిన ఓ ఎంపీ, ఎమ్మె ల్యే దగ్గరుండి కేసు వ్యవహారాల్ని నడిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే..? ఢిల్లీ నుంచి విమానంలో దక్షిణాఫ్రికాకు చెందిన థామస్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకొస్తున్నారంటూ నగర పోలీసులకు సెంట్రల్ ఏజెన్సీల నుంచి సమాచారం వచ్చింది. ఆ వ్యక్తి కస్టమ్స్‌కి చిక్కకుండా 25 గ్రాముల కొకైన్‌ని పుస్తకాల మధ్యలో పెట్టి తీసుకొచ్చేశాడు. ఎయిర్‌పోర్టులో పట్టుకుంటే డ్రగ్స్ ఎవరి కోసం తీసుకొచ్చారన్నది తెలియదన్న ఉద్దేశంతో ఈగల్ బృందం సదరు విదేశీయుడిని ఫాలో అవుతూ వచ్చింది. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో అతడు అక్షయ్‌కుమార్ అలియాస్ మున్నాను కలిసి డ్రగ్స్ ఇస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి ఫోన్‌తో పాటు మున్నా ఫోన్‌ని స్వాదీనం చేసుకున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. మున్నాను విచారించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరు వైద్యుడు కాగా, మరొకరు కూటమి నాయకుడి కుమారుడు, ఇంకొకరు ఉత్తరాంధ్ర కూటమి నేతల ఆరి్థక లావాదేవీలు చూసే బడా నేత కుమారుడు. ఈ ముగ్గుర్నీ పట్టుకోగానే.. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ నేరుగా పోలీసులకు ఫోన్‌చేసి వెంటనే వారిని విడిచి పెట్టాలని.. వారిపై ఎలాంటి కేసులు ఉండకూడదనీ.. తమకు కావల్సిన వ్యక్తులంటూ హుకుం జారీ చేశారు. పోలీసులపై తీవ్ర ఒత్తిడి రావడంతో కేవలం ఇద్దర్ని మాత్రమే అరెస్ట్ చేశామంటూ తొలిరోజు ప్రెస్మీట్లో సీపీ వెల్లడించారు. మొత్తం ఐదుగుర్ని అదుపులోకి తీసుకొని ఇద్దర్ని మాత్రమే అరెస్ట్ ఎందుకు చూపిస్తున్నారని మీడియా ప్రశ్నించగా.. మిగిలిన ముగ్గురు అనుమానితులు మాత్రమేననీ, నిందితులు కాదని సమాధానమిచ్చి తప్పించుకోవాలని చూశారు. కూటమి నేతల హస్తం ఉన్నట్టు అన్ని ఆధారాలున్నా.. టీడీపీ నేతలు పోలీసుల చేతులు కట్టేసి దర్యాప్తును తుంగలో తొక్కేస్తున్నారు. సూత్రధారుల్ని విడిచిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. లోతుగా దర్యాప్తు చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలొస్తున్నాయి. హోంమంత్రి స్పందించరేం? ప్రతి విషయంలో హడావుడి చేసే హోంమంత్రి అనిత సోమవారం సాయంత్రం నగరంలో పోలీసుల కార్యక్రమానికి హాజరైనా డ్రగ్స్ కేసుపై పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. దీంతో కూటమి నేతల హస్తం ఉందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. సీపీ కార్యాలయంలోనే ఓ ఎమ్మెల్యే తిష్ట! ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా.. టీడీపీ ఎమ్మెల్యే ఒకరు సీపీ కార్యాలయానికి నేరుగా వచ్చేసినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురూ తమకు బాగా కావాల్సినవారని, ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు నమోదు చెయ్యొద్దంటూ అక్కడే ఉండి వ్యవహారం నడిపించారు. అప్పటికే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్టు మీడియాలో వార్తలు రావడంతో ఏం చేయాలో పాలుపోక కూటమి పార్టీలకు సంబంధం లేని.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వైద్యుడిని అరెస్ట్ చేసినట్టు చూపించారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు కూటమి పార్టీ నేత, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సీఈవో.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మున్నాతో అతడికి సత్సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో అతడి పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మూడు ముళ్లు వేసి.. రూ.28 కోట్లు కాజేసి!
చిత్తూరు అర్బన్: ఒంటరిగా ఉన్న ఓ మహిళను నమ్మకంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు లాటరీ పేరుతో ఆమెకు టోకరా వేశాడు. రూ.15 కోట్లు పన్నులు చెల్లిస్తే రూ.1,700 కోట్లు వస్తాయని ఆశలు కల్పించాడు. చివరికి ఆమె ఆస్తులు అమ్మించి రూ.28 కోట్లు తీసుకుని అడ్రస్ లేకుండాపోయాడు. దీంతో బాధితురాలు సోమవారం చిత్తూరులో ఎస్పీ మణికంఠను కలిసి ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం మేరకు... చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని రాజుపేటకి చెందిన నాగమణికి 1992లో ఒక వ్యక్తితో వివాహమైంది. ఒక కొడుకు కూడా పుట్టాడు. కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కుమారుడు చనిపోగా, ఆ దిగులుతో భర్త కూడా మరణించాడు. కొడుకు బీమా డబ్బులు, భర్త ఆస్తులన్నీ నాగమణికి వారసత్వంగా వచ్చాయి. ఒంటరిగా ఉన్న ఆమె మరో పెళ్లి చేసుకోవాలని చిత్తూరులోని ఓ పెళ్లిళ్ల మధ్యవర్తిని సంప్రదించింది. ఈ క్రమంలో బంగారుపాళ్యం మండలం శేషాపురం గ్రామానికి చెందిన శివప్రసాద్ నాయుడు అనే వ్యక్తి నాగమణిని కలిసి తన భార్య చనిపోయిందని, పిల్లలు కూడా లేరని చెప్పాడు. అతని భార్య ఉన్నప్పటికీ, చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్‌ను చూపించాడు. దీంతో అతని మాటలు నమ్మిన నాగమణి పెళ్లికి అంగీకరించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో శివప్రసాద్ నాయుడిని 2022 అక్టోబర్‌లో కర్ణాటకలోని బంగారు తిరుపతి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఇద్దరు కాపురం పెట్టారు. ఆర్బీఐ నుంచి లాటరీ పేరుతో మోసం కొన్నాళ్ల తర్వాత తనకు ఆర్బీఐ నుంచి రూ.1,700 కోట్ల లాటరీ తగిలిందని శివప్రసాద్ నాయుడు ఓ పత్రాన్ని చూపించాడు. ఈ మొత్తం రావాలంటే పన్నుల రూపంలో రూ.15 కోట్లు చెల్లించాలని నాగమణిని నమ్మించాడు. దీంతో ఆమె తన బ్యాంకు ఖాతాలో ఉన్న దాదాపు రూ.3 కోట్ల నగదును శివప్రసాద్, అతని అన్న చక్రవర్తి, వదిన హేమలత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. రూ.15 కోట్ల విలువ చేసే భూములు, రూ.10 కోట్ల విలువ చేసే భవనాన్ని విక్రయించి మొత్తం రూ.28 కోట్లను శివప్రసాద్ తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా ఆర్బీఐ నుంచి రూ.1,700 కోట్లు ఇంకా రాలేదని నాగమణి ప్రశ్నించినప్పుడల్లా మాయమాటలు చెప్పి తప్పించుకునేవాడు. ఓ సారి గట్టిగా నిలదీయడంతో చంపేస్తానని నాగమణిని బెదిరించాడు. గతేడాది డిసెంబరులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడ్ని వెతుక్కుంటూ బంగారుపాళ్యానికి వెళ్లిన నాగమణికి ఊహించని షాక్ తగిలింది. శివప్రసాద్ నాయుడికి భార్యతోపాటు ఎనిమిదేళ్ల కూతురు ఉన్నారని తెలిసి విస్తుపోయింది. దీనిపై గట్టిగా నిలదీయడంతో అందరూ కలిసి ఆమెపై దాడిచేసి, చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ విచారణకు ఆదేశించారు.

అడవిలోకి తీసుకెళ్లి.. ఆలిని హతమార్చాడు
ఆదిలాబాద్ టౌన్: అనుమానం పెనుభూతమై ఓ భర్త కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.ఆదిలాబాద్ పట్టణం సుందరయ్యనగర్‌కు చెందిన హింగోలి శంకర్‌కు ఇంద్రవెల్లిలోని నర్సాపూర్‌కు చెందిన వందన (45)తో 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 20 ఏళ్లు పైబడిన ఇద్దరు కుమారులు, 17 ఏళ్ల కుమార్తె ఉన్నారు. శంకర్ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుండగా, ఆయన భార్య గృహిణి. సాఫీగా సాగిన వీరి సంసార జీవితంలో భార్యపై అనుమానం శంకర్‌లో అశాంతి రేపింది.టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యకు ఆరోగ్యం బాగాలేదని, క్షుద్రపూజలు చేయిస్తానని, ఆయుర్వేద మందు తాగిస్తానని చెప్పి ఈనెల 2న శంకర్ ఆదిలాబాద్ నుంచి వందనను బస్సులో తీసుకెళ్లాడు. తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ అటవీ ప్రాంతం (మహారాష్ట్ర సరిహద్దు)లోకి తీసుకెళ్లి చెట్లకు పసుపు కుంకుమతో పూజలు చేస్తున్నట్లు నటించాడు. వెంట తెచ్చుకున్న కారంపొడిని వందన కళ్లలో చల్లాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయగా బండరాయితో తలపై బాదాడు. దీంతో రక్తపు మడుగులో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఇంటి నుంచి వెళ్లిన అమ్మ నాన్న తిరిగి రాకపోవడంతో పిల్లలు ఆందోళనకు గురయ్యారు.శనివారం రాత్రి కూతురు ప్రియాంక టూటౌన్లో ఫిర్యాదు చేయగా, అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సంఘటన స్థలానికి ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డితో పాటు పోలీసులు వెళ్లి చూడగా ఆమె మృతదేహం కుళ్లిపోయి ఉంది. కాగా నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు.