marital affair
-
దారుణం: భార్యను సముద్రంలో ముంచి చంపి.. ఆపై..!
పనాజీ: గోవాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను సముద్రంలో ముంచి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వివాహేతర సంబంధంపై భార్య ప్రశ్నించినందుకు నిందితుడు హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోవాలోని కాబో డి రామా బీచ్‌లో ఈ ఘటన జరిగింది. గౌరవ్ కటియార్(29) సౌత్ గోవాలోని ఓ లగ్జరీ హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. దీక్షా గంగ్వార్(27) అనే యువతిని గతేడాదే వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ లక్నోకు చెందినవారు. గోవాలోనే నివసిస్తున్నారు. అయితే.. కటియార్ వివాహేతర సంబంధంపై గంగ్వార్ ఇటీవల ప్రశ్నించింది. దీంతో భార్యను హత్య చేయాలనే కుట్ర పన్నిన కటియార్.. ఆమెను బీచ్‌కు షికారుకు తీసుకువెళ్లాడు. ఎవరూ లేని రాళ్ల ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆమెను నీళ్లలో ముంచి చంపేశాడు. ఆ తర్వాత యథావిధిగా కార్యాలయానికి తీరిగివచ్చాడు. తన భార్య చనిపోయిందో? లేదో నిర్దారించుకోవడానికి మళ్లీ ఓ సారి వెళ్లి చూశాడు. ఆ తర్వాత తన భార్య నీళ్లలో మునిగి చనిపోయిందని పోలీసులకు తెలిపాడు. ఆందోళన పడుతున్నట్లు హంగామా సృష్టించాడు. అయితే.. ఓ యాత్రికుడు తీసిన వీడియో ఆధారంగా కటియార్ కుట్ర బయటపడింది. కటియార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: డబ్బుల కోసం బామ్మను చంపేశాడు -
లాడ్జిలో ప్రియుడితో దిగిన అక్షిత.. దారుణ హత్య
సాక్షి, శ్రీసత్యసాయి: తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థిని అక్షిత మృతి కేసులో చిక్కుముడి వీడింది. ఆమెది హత్యగా తేల్చారు జిల్లా పోలీసులు. ఆమెతో పాటు ఉన్న స్నేహితుడు, ప్రియుడైన మహేష్‌వర్మ ఆమెను చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. వరంగల్‌కు(ములుగు జిల్లా మంగపేటకు) చెందిన అక్షిత ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం కర్ణాటకలోకి చిక్‌బళ్లాపూర్ మెడికల్కాలేజీలో డీఎన్బీ (పీజీ) చేస్తోంది. అయితే అక్షిత, సంగారెడ్డి పటాన్‌చెరువుకు చెందిన మహేష్ వర్మ అనే వ్యక్తితో కలిసి తాజాగా హిందూపురంలోని ఓ లాడ్జిలో బస చేశారు. అదే రోజు సాయంత్రం ఆమె చనిపోయినట్లు మహేష్ పోలీసులకు సమాచారం అందించాడు. ఇద్దరం స్నేహితులమని, మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నామని, లేచి చూస్తే ఆమె చనిపోయి ఉందని పోలీసులకు చెప్పాడు మహేష్. దీంతో స్థానికంగా అనుమానాస్పద మృతి కలకలం రేగింది. వెంటనే పోలీసులు అక్షిత బంధువులకు సమాచారం ఇచ్చి అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో అతను స్నేహితుడు కాదని, ప్రియుడని తేలింది. హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్న మహేష్.. అక్షితతో తనకు సంబంధం ఉందని ఒప్పుకున్నాడు. లాడ్జిలో ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. అయితే.. ఆమెను ఎందుకు చంపాడనే విషయంపై ఇంకా ప్రకటన వెలువడలేదు. అక్షితకు వివాహమైందని, ఆమె భర్త వరంగల్‌లో ఆర్థోపెడిక్ వైద్యుడు కాగా, ఏడాది పాప కూడా ఉందని సమాచారం. ఇదీ చదవండి: ప్రియుడి మృతి.. ప్రియురాలి పరిస్థితి విషమం -
మైనర్ హత్యాచారంలో వీడిన మిస్టరీ, తల్లి ప్రియుడే..
ఢిల్లీ: వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో చిన్నారిపై అపహరించి.. ఆపై కిరాతకంగా ఆమెపై హత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. రాజధానిలో సంచలనం సృష్టించిన మైనర్ హత్యాచార కేసులో మిస్టరీ.. రెండు వారాలకు వీడింది. బాధితురాలి తల్లి ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే నిజం విస్మయానికి గురి చేస్తోంది. దర్యాగంజ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భార్య, నలుగురు పిల్లలతో జీవిస్తున్నాడు. ఆగస్టు ఐదవ తేదీ ఉదయం పోలీసులను ఆశ్రయించాడు అతను. తెల్లారి చూసేసరికి తన ఎనిమిదేళ్ల కూతురు కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని.. బాలిక కోసం గాలింపు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే చివరకు ఈ కేసు విషాదంగా ముగిసింది. ఆగస్టు 18న యమునా ఖాదర్ ప్రాంతంలో గాయాలతో గుర్తుపట్టలేని స్థితిలో బాలిక మృతదేహం లభించింది. పోస్ట్ మార్టం ప్రకారం.. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో డీసీసీ శ్వేతా చౌహాన్ నేతృత్వంలో యాభై మంది బృందం దర్యాప్తు చేపట్టింది. సీసీ టీవీ ఫుటేజీలోనూ ఫలితం లేకపోవడంతో.. సుమారు 200 మందిని ఇంటరాగేట్ చేశారు. ఇదిలా ఉంటే.. మాంసం కొట్టులో పని చేసే రిజ్వాన్ అలియాస్ బాద్షా అనే వ్యక్తి తరచూ బాధిత బాలికకు చాక్లెట్ కొనిస్తాడని సమాచారం పోలీసులకు అందింది. రిజ్వాన్ ఇరవై ఏళ్ల కిందట బీహార్ నుంచి ఢిల్లీకి వలస వచ్చాడు. మాంసం దుకాణాల్లో పని చేస్తూ.. మద్యం, గంజాయికి బానిసై తిరుగుతుంటాడు. ఈ క్రమంలో రిజ్వాన్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని దొరకబుచ్చుకుని.. తమదైన శైలిలో ప్రశ్నించే సరికి విస్తూపోయే నిజం వెలుగు చూసింది. బాధితురాలి తల్లితో రిజ్వాన్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో బాలిక చూడడంతో ఎక్కడ తన తండ్రికి విషయం చెబుతుందో అని ఇద్దరూ భయపడ్డారు. ఆమె అడ్డు తొలగించుకోవాలని యత్నించారని.. ఈ క్రమంలోనే నేరానికి రిజ్వాన్ పాల్పడ్డాడని డీసీపీ శ్వేతా చౌహాన్ కేసు వివరాలను వెల్లడించారు. నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి.. గంజాయి మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడఇ, ఆపై పదునైన ఆయుధంతో గొంతు కోసి.. ముఖాన్ని చెక్కేశాడని డీసీపీ తెలిపారు. నేరానికి పాల్పడ్డ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఇదీ చదవండి: మోడ్రన్ రాబిన్ హుడ్.. దోచుకోవడం-పంచడం! -
కిరాతకంగా ఐదుగురు హత్య వెనుక ప్రేమ వ్యవహారం.. అసలేం జరిగిందంటే..
మండ్య: మండ్య జిల్లా శ్రీరంగపట్టణం తాలూకా కేఆర్ఎస్ గ్రామంలో ఈనెల 6న కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మైసూరు తాలూకా బెలవెత్త గ్రామానికి చెందిన సునీల్ భార్య లక్ష్మిని నిందితురాలిగా గుర్తించి అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ఎన్.యతీశ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. గంగారామ్ భార్య లక్ష్మి (27), ఆమె ముగ్గురు పిల్లలు రాజ్ (10), కోమల్ (8), కునాల్ (6), అన్న కుమారుడు గోవింద (13)హత్యకు గురైన విషయం తెలిసిందే. నిందితురాలు లక్ష్మి, మృతురాలు లక్ష్మి ఇద్దరూ వరుసకు అక్కాచెల్లెళ్లు. నిందితురాలు లక్ష్మికి మృతురాలి భర్త గంగారామ్ అంటే ఇష్టం. మృతురాలు లక్ష్మిని గంగారామ్ నుంచి దూరం చేసేందుకు వారి మధ్య గొడవలు సృష్టించేందుకు నిందితురాలు ప్రయత్నించి విఫలమైంది. దీంతో గంగారామ్ భార్యను చంపేయాలని నిర్ణయానికి వచ్చింది. బెలవెత్త గ్రామంలోని చికెన్ షాపులో కత్తిని తీసుకుని శనివారం రాత్రి గంగారామ్ ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి వరకు లక్ష్మితో గొడవ పడింది. తెల్లవారుజామున మూడు గంటలకు కత్తితో లక్ష్మపై విచక్షణరహితంగా దాడి చేసి హత్య చేసింది. నిద్ర లేచి ఏడుస్తున్న పిల్లలు అదే కత్తితో అంతమొందించింది. మృతదేహాలపై బ్లాంకెట్ పరిచి ఇంట్లో బీరువాలో ఉన్న దుస్తులను చెల్లాచెదురుగా పడేసి దొంగతనం జరిగినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అనంతరం తన దుస్తులను వేరే చోట ఉంచి వేరే ఏదో వాహనంలో స్వగ్రామానికి వెళ్లింది. మరుసటి రోజు రోదిస్తూ అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి తన ఇంటికి చేరుకుంది. కత్తిని శుభ్రంగా కడిగి అదే చికెన్ షాపులో అప్పగించింది. పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా హత్యోదంతానికి పాల్పడినట్లు అంగీకరించింది. -
ఇష్టం లేని పెళ్లి వివాహేతర సంబంధానికి దారి తీసింది.. చివరికి..
న్యూఢిల్లీ: ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో వెలుగు చూసింది. ఈ సంఘటన నవంబర్ 2న మంగోల్‌పురి ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్-1 సమీపంలోని ఏకాంత ప్రదేశంలో జరిగగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. నిందితురాలు ఊర్మిళ తన ఇరవై ఏళ్ళ వయసులో ఆటో రిక్షా డ్రైవర్ అయిన రాజ్ కుమార్‌ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది. ఆమె తన వివాహం పట్ల అసంతృప్తిగా ఉండేది. దీంతో పాటు గత కొంత కాలంగా రాజ్ కుమార్ ఆమెను హింసించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆమెకు ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వారిద్దరు రాజ్ కుమార్ నీ అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం ఖాన్ మంగోల్‌పురి ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ Iకి వెళ్లడానికి ప్రయాణీకుడిగా కుమార్ రిక్షా ఎక్కాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఏకాంత ప్రదేశంలో ఆపమని అడిగాడు.ఆ తర్వాత కుమార్‌ని అంతమొందించేందుకు కొనుగోలు చేసిన కంట్రీ మేడ్ పిస్టల్‌తో అతని వీపుపై కాల్పులు జరిపి అతన్ని అంతమొందిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా అసలు నిజాలు బయటపడ్డాయి. విచారణలో.. తన భర్తతో కలిసి జీవించడం ఇష్టం లేనందున ఖాన్ సహాయంతో అతన్ని చంపినట్లు ఊర్మిళ అంగీకరించింది. -
వివాహేతర సంబంధం వద్దన్నందుకు అంతు చూస్తానన్న భార్య.. తట్టుకోలేక
లక్నో: భార్య మరొకరితో సంబంధం పెట్టుకోవడంతో పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించినా పట్టించుకోలేదు. దీంతో తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోమతి నగర్లో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోమతి నగర్‌కు చెందిన నిఖిల్‌కు 2012లో వివాహం కాగా, ఒక కుమార్తె ఉంది. నిఖిల్ కిరాణా దుకాణం ద్వారా జీవనం సాగిస్తుండగా, ఇటీవల కొంత కాలంగా తన భార్య ఓ ఎన్జీవో సంస్థలో పని చేయడం ప్రారంభించింది. అయితే గత కొంతకాలంగా ఆమె తన యజమానితో సన్నిహితంగా ఉంటోంది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. దీంతో ఆమె తన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసింది. ఈ విషయం నికిల్కి తెలియడంతో తన భార్య పద్ధతిని మార్చుకోవాలని ఆమెను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. మంగళవారం రాత్రి ఈ విషయమై వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకి తన అక్రమ సంబంధానికి అడ్డు రావొద్దని ఆమె తన భర్తకి తెగేసి చెప్పడంతో పాటు భర్త అంతు చూస్తానని బెదిరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నికిల్ తండ్రి పోలీసుల వద్ద.. తన కొడుకు జీవితం అతని భార్య వివాహేతర సంబంధం కారణంగా నాశనం అయ్యిందని తెలిపాడు. నికిల్ అత్మహత్యకు తన కోడలు ఆమె యజమానే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: 3 నిమిషాల్లో 3 కిలోమీటర్లు.. జెట్ స్పీడులో దూసుకొచ్చి ప్రాణం కాపాడిన పోలీసులు -
వారిద్దరు సముద్రస్నానం చేసి వచ్చారు.. అంతలో ఏం జరిగిందో బ్యాగులోంచి..
సాక్షి, శ్రీకాకుళం: మండలంలోని భావనపాడు తీరంలో గురువారం ఓ యువతి ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి సమీపంలోని దవిడిగాం గ్రామానికి చెందిన సిరిపురం ఉచిత(21) అదే గ్రామానికి చెందిన పురుకొండ దుర్గాప్రసాద్ మధ్య ఎనిమిదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దుర్గాప్రసాద్‌కు ఐదేళ్ల క్రితమే వేరే యువతితో వివాహం జరిగి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినా ఉచిత, దుర్గాప్రసాద్ మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో గురువారం భావనపాడు సముద్రతీరానికి ఇద్దరు ద్విచక్రవాహనంపై వచ్చారు. సముద్రస్నానం అనంతరం సమీప తోటకు వచ్చారు. ఇంతలో జరిగిందో గానీ ఉచిత.. తన బ్యాగులో తీసుకువచ్చిన పురుగుల మందు తాగింది. ఒక్కసారిగా పెద్ద కేకలు పెట్టడంతో అక్కడికి సమీపంలో వలలు అల్లుతున్న మత్స్యకారులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. నౌపడ ఎస్సై సాయికుమార్ సంఘటన స్థలానికి చేరుకునే సరికే యువతి మృతిచెందింది. వివరాలను తెలుసుకొని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతురాలి తండ్రి వైజాగ్ ఆటో నగర్లో టైలరింగ్ పనిచేస్తూ కొంతకాలంగా కుటుంబంతో అక్కడే ఉన్నారు. దసరా సెలవులకు సొంత ఊరికి ఒంటరిగా వచ్చిన కుమార్తె.. తీరంలో శవమై పడి ఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: ఆంధ్రా అధికారిని ఘెరావ్ చేసిన ఒడిశా ఎమ్మెల్యే -
టైలర్ హత్య కేసు: ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భార్యే..
సాక్షి, కొత్తూరు(భువనేశ్వర్): భామిని మండలంలో సంచలనం సృష్టించిన టైలర్ నల్లకేవటి కుమారస్వామి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త హత్యకు భార్యే సూత్రధారని నిగ్గుతేల్చారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మైనర్ కూడా ఉండడం గమనార్హం. ప్రేమాయణమే ప్రాణం తీసేందుకు ఉసుకొల్పిందని పోలీసులు వివరించారు. భామిని మండలం దిమ్మిడిజోల సమీపంలో ఈ నెల 25వ తేదీన నడిరోడ్డుపై ఇదే మండలం లోహజజోల గ్రామానికి చెందిన నల్లకేవటి కుమారస్వామి దారుణహత్యకు గురయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కొత్తూరు సీఐ మజ్జి చంద్రశేఖర్, బత్తిలి ఎస్సై కేవీ సురేష్‌లు తమ సిబ్బందితో కలసి అయిదు రోజుల్లో హంతకులను పట్టుకొన్నారు. వారిని కొత్తూరులో విలేకరుల ముందు శుక్రవారం ప్రవేశపెట్టారు. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమారస్వామికి మాలతితో 2012లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లికి ముందు మాలతి తాతగారి గ్రామమైన పాతపట్నం మండలం గంగువాడలో ఉండేది. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన పెనుబాకల హేమసుందరావు(శ్యామ్), మాలతిలు ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరిదీ వేర్వేరు సామాజిక వర్గాలు కావడంతో పెళ్లి చేసుకోవడానికి వీలు కాలేదు. కుటుంబీకులు అదే ఏడాదిలో వారి సమాజికవర్గాలకు చెందినవారితో పెళ్లిళ్లు చేసేశారు. అయితే వివాహాలైనప్పటికీ హేమసుందరరావు, మాలతి మధ్య ప్రేమ పోలేదు. రెండు కుటుంబాలు వేర్వేరుగా బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. వీరిలో హేమసుందరరావు తాపీ మేస్త్రీగా పని చేసేవాడు. హత్యకు గురైన కుమారస్వామి టైలర్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అక్కడ కూడా ఇద్దరి ప్రేమ కొనసాగేదని.. దీంతో రెండు కుటుంబాల మధ్య తరచూ తగాదాలు జరిగేవని సీఐ వివరించారు. ఈ నేపథ్యంలోనే కుమారస్వామి భార్య మాలతి, పిల్లలను తీసుకొని స్వగ్రామం లోహరజోల తిరిగి వచ్చేశాడు. అయితే మాలతి, హేమసుందరరావు ప్రేమ వ్యవహారం ఫోన్ ద్వారా కొనసాగుతుండేది. తమ ప్రేమకు భర్త కుమారస్వామి అడ్డుగా ఉంటున్నారని భావించిన వారు అతని ప్రాణాన్ని తీసి అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 25 తేదీన పర్లాకిమిడిలోని పెద్దమ్మ ఇంటికి వెళ్లాలని భర్త కుమారస్వామికి మాలతి చెప్పడంతో నిజమని నమ్మాడు. ఇద్దరి పిల్లలను తీసుకొని ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. అయితే తమ ప్రయాణ సమాచారాన్ని ప్రియుడు హేమసుందరరావుకు చేరవేయడంతో అతను కూడా ఓ మైనర్ బాలుడిని వెంట తీసుకొని బైక్‌పై అదేమార్గంలో వస్తూ.. కుమారస్వామి బైక్ రాక పోకలను గమనించాడు. దిమ్మిడిజోల సమీపంలోకి వచ్చేసరికి కుమారస్వామి బైక్‌ను ఆపి కత్తులతో అతన్నిపొడిచి.. హత్య చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మాలతిపై అనుమానంతో అమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. భర్త హత్యను పక్కదారి పట్టించడానికి మాలతి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు పసిగట్టారు. తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించడంతో చివరకు హంతకుడిని పట్టుకున్నారు. ఈ ఘటనలో హేమసుందరరావు, అతని వెంట వచ్చిన మైనర్ బాలుడిని, ప్రధాన సూత్రధారి మాలతిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు సీఐ వివరించారు. హత్యకు ఉపయోగించిన కత్తులను పాతపట్నంలో హంతకుడు కొనుగోలు చేసినట్లు సీఐ చెప్పారు. -
ప్రియురాలిని కాల్చి.. మామను హతమార్చిన ఎస్ఐ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రియురాలిని తుపాకితో గాయపరిచి పారిపోయిన ఎస్ఐ సందీప్ దహియా ఇవాళ (సోమవారం) ఉదయం తన మామను(భార్య తండ్రి) చంపినట్లు పోలీసులు తెలిపారు. అధికారంలో ఉన్న ఎస్ఐ దహియా.. ఇద్దరు వ్యక్తులను కాల్చడానికి ఉపయోగించిన సర్వీస్ రివాల్వర్‌తో సహా పారిపోయాడని, ప్రస్తుతం ఆయన కోసం గాలిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. వివరాలు.. ఎస్ఐ సందీప్ దహియా(36) వివాహితుడు. అయితే కొంతకాలం తన భార్యతో విడిగా ఉంటున్న క్రమంలో ఆయనకు మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి తన ప్రియురాలితో గొడవ పడిన అనంతరం ఆమెను తుపాకితో కాల్చి గాయపరిచాడు. అనంతరం తన భార్యను చంపేందుకు ఆమె పుట్టింటికి వెళ్లాడు. అక్కడ అతని భార్య లేకపోవడంతో ఆమె తండ్రి రణ్వీర్ సింగ్‌ను విచక్షణ రహితంగా కాల్చి చంపాడు. (చదవండి: పోలీసు ఉన్నతాధికారి దారుణం : వైరల్ వీడియో) అయితే దహియా తన ప్రియురాలితో లాహోరీ గేటు పోలీసు స్టేషన్ పరిధిలో కారులో గొడవ పడుతున్న క్రమంలో ఆమెను తుపాకితో కాల్చి పారిపోయాడని, అదే సమయంలో అటుగా వెళుతున్న ఎస్ఐ జైవీర్ ఆమెను రక్షించినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ గౌరవ్ శర్మ తెలిపారు. ఆమెను ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో దహియా తనను తుపాకితో కాల్చినట్లు సదరు మహిళ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, బాధిత మహిళ ఫిర్యాదు మేరకు సదరు పోలీసుల అధికారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. (చదవండి: సహజీవనం: నడిరోడ్డుపై కాల్చి పడేసి..) -
భార్యపై కన్నేశాడని హతమార్చాడు
మెట్‌పల్లిరూరల్(కరీంనగర్): మండలంలోని కొండ్రికర్లలో ఈ నెల 22న డబ్బ సుధీర్(27)ను హత్య సంఘటనలో అదే గ్రామానికి చెందిన చిట్యాల ప్రశాంత్, మల్లికార్జున్ అనే యువకులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు మెట్పల్లి సీఐ సురేందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సుధీర్ గ్రామంలోని పలువురు మహిళలతో వివాహేతర సంబంధం నెరిపాడు. తన భార్యతో కూడా సుధీర్ సంబంధం నెరుపుతున్నాడి ప్రశాంత్ కొన్నిరోజులుగా అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. శుక్రవారం రాత్రి ఫోన్ సుధీర్‌కు ఫోన్ చేశాడు. బీరు తాగుదామని, పెద్దాపూర్ రోడ్‌లోని ఊరికి చివర ఉన్న సెల్‌టవర్ వద్దకు రావాలని కోరాడు. అక్కడికి వచ్చిన సుధీర్‌తో కలిసి ప్రశాంత్ మద్యం తాగాడు. ఈ సందర్భం గా తన భార్య వైపు రోజూ ఎందుకు చూస్తున్నావని ప్రశాంత్ ప్రశ్నించాడు. సుధీర్ తన భార్య గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. భరించలేకపోయిన ప్రశాంత్ బీరు సీసాతో సుధీర్ తలపై కొట్టాడు. పారిపోయే ప్రయత్నంలో కిందపడ్డ సుధీర్ తలను రోడ్డుకు వేసి కొట్టాడు. తీవ్ర రక్త స్రావమై మృతి చెందాడు. అనంతరం తన మిత్రుడు మల్లికార్జున్‌ను సంఘటన స్థలానికి పిలుపించుకుని సమీపంలోని నీరులేని వ్యవసాయబావిలో మృతదేహాన్ని పడేశాడు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టుకు పంపినట్లు సీఐ తెలిపాడు. సమావేశంలో మెట్పల్లి ఎస్సైలు అశోక్, దేవయ్య, కానిస్టేబుళ్లు మోహన్, మల్లయ్య పాల్గొన్నారు.