ఇష్టం లేని పెళ్లి వివాహేతర సంబంధానికి దారి తీసింది.. చివరికి.. | New Delhi: Auto Driver Killed By Wife Her Boyfriend | Sakshi
Sakshi News home page

ఇష్టం లేని పెళ్లి వివాహేతర సంబంధానికి దారి తీసింది.. చివరికి.

Published Thu, Nov 11 2021 4:58 PM | Last Updated on Thu, Nov 11 2021 5:50 PM

New Delhi: Auto Driver Killed By Wife Her Boyfriend - Sakshi

న్యూఢిల్లీ: ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో వెలుగు చూసింది. ఈ సంఘటన నవంబర్ 2న మంగోల్‌పురి ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్-1 సమీపంలోని ఏకాంత ప్రదేశంలో జరిగగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. నిందితురాలు ఊర్మిళ తన ఇరవై ఏళ్ళ వయసులో ఆటో రిక్షా డ్రైవర్ అయిన రాజ్ కుమార్‌ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది. ఆమె తన వివాహం పట్ల అసంతృప్తిగా ఉండేది. దీంతో పాటు గత కొంత కాలంగా రాజ్ కుమార్ ఆమెను హింసించడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలోనే ఆమెకు ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వారిద్దరు రాజ్ కుమార్ నీ అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం ఖాన్ మంగోల్‌పురి ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ Iకి వెళ్లడానికి ప్రయాణీకుడిగా కుమార్ రిక్షా ఎక్కాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఏకాంత ప్రదేశంలో ఆపమని అడిగాడు.ఆ తర్వాత కుమార్‌ని అంతమొందించేందుకు కొనుగోలు చేసిన కంట్రీ మేడ్ పిస్టల్‌తో అతని వీపుపై కాల్పులు జరిపి అతన్ని అంతమొందిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా అసలు నిజాలు బయటపడ్డాయి. విచారణలో.. తన భర్తతో కలిసి జీవించడం ఇష్టం లేనందున ఖాన్ సహాయంతో అతన్ని చంపినట్లు ఊర్మిళ అంగీకరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement