భార్యపై కన్నేశాడని హతమార్చాడు | marital affair kills man in karimnagar district | Sakshi
Sakshi News home page

భార్యపై కన్నేశాడని హతమార్చాడు

Published Wed, Jul 27 2016 12:34 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

భార్యపై కన్నేశాడని హతమార్చాడు - Sakshi

భార్యపై కన్నేశాడని హతమార్చాడు

మెట్‌పల్లిరూరల్‌(కరీంనగర్): మండలంలోని కొండ్రికర్లలో ఈ నెల 22న డబ్బ సుధీర్‌(27)ను హత్య సంఘటనలో అదే గ్రామానికి చెందిన చిట్యాల ప్రశాంత్, మల్లికార్జున్‌ అనే యువకులను మంగళవారం అరెస్ట్‌ చేసినట్లు మెట్‌పల్లి సీఐ సురేందర్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సుధీర్‌ గ్రామంలోని పలువురు మహిళలతో వివాహేతర సంబంధం నెరిపాడు. తన భార్యతో కూడా సుధీర్‌ సంబంధం నెరుపుతున్నాడి ప్రశాంత్‌ కొన్నిరోజులుగా అనుమానం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. శుక్రవారం రాత్రి ఫోన్‌ సుధీర్‌కు ఫోన్‌ చేశాడు. బీరు తాగుదామని, పెద్దాపూర్‌ రోడ్‌లోని ఊరికి చివర ఉన్న సెల్‌టవర్‌ వద్దకు రావాలని కోరాడు. అక్కడికి వచ్చిన సుధీర్‌తో కలిసి ప్రశాంత్‌ మద్యం తాగాడు. ఈ సందర్భం గా తన భార్య వైపు రోజూ ఎందుకు చూస్తున్నావని ప్రశాంత్‌ ప్రశ్నించాడు. సుధీర్‌ తన భార్య గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. భరించలేకపోయిన ప్రశాంత్‌ బీరు సీసాతో సుధీర్‌ తలపై కొట్టాడు. పారిపోయే ప్రయత్నంలో కిందపడ్డ సుధీర్‌ తలను రోడ్డుకు వేసి కొట్టాడు. తీవ్ర రక్త స్రావమై మృతి చెందాడు. అనంతరం తన మిత్రుడు మల్లికార్జున్‌ను సంఘటన స్థలానికి పిలుపించుకుని సమీపంలోని నీరులేని వ్యవసాయబావిలో మృతదేహాన్ని పడేశాడు. నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేసి కోర్టుకు పంపినట్లు సీఐ తెలిపాడు. సమావేశంలో మెట్‌పల్లి ఎస్సైలు అశోక్, దేవయ్య, కానిస్టేబుళ్లు మోహన్, మల్లయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement