ప్రతీకాత్మక చిత్రం
లక్నో: భార్య మరొకరితో సంబంధం పెట్టుకోవడంతో పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించినా పట్టించుకోలేదు. దీంతో తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోమతి నగర్‌లో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోమతి నగర్‌కు చెందిన నిఖిల్‌కు 2012లో వివాహం కాగా, ఒక కుమార్తె ఉంది. నిఖిల్ కిరాణా దుకాణం ద్వారా జీవనం సాగిస్తుండగా, ఇటీవల కొంత కాలంగా తన భార్య ఓ ఎన్జీవో సంస్థలో పని చేయడం ప్రారంభించింది.
అయితే గత కొంతకాలంగా ఆమె తన యజమానితో సన్నిహితంగా ఉంటోంది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. దీంతో ఆమె తన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసింది. ఈ విషయం నికిల్‌కి తెలియడంతో తన భార్య పద్ధతిని మార్చుకోవాలని ఆమెను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. మంగళవారం రాత్రి ఈ విషయమై వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
చివరకి తన అక్రమ సంబంధానికి అడ్డు రావొద్దని ఆమె తన భర్తకి తెగేసి చెప్పడంతో పాటు భర్త అంతు చూస్తానని బెదిరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నికిల్ తండ్రి పోలీసుల వద్ద.. తన కొడుకు జీవితం అతని భార్య వివాహేతర సంబంధం కారణంగా నాశనం అయ్యిందని తెలిపాడు. నికిల్ అత్మహత్యకు తన కోడలు ఆమె యజమానే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: 3 నిమిషాల్లో 3 కిలోమీటర్లు.. జెట్ స్పీడులో దూసుకొచ్చి ప్రాణం కాపాడిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment