జెరూసలేం: లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది. లెబనాన్ సరిహద్దు సమీపంలో బుధవారం జరిగిన దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందినట్లు సైన్యం వెల్లడించింది.
‘‘దక్షిణ లెబనాన్‌లో జరిగిన యుద్ధంలో ఆరుగురు సైనికులు మృతిచెందారు’ అని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 30 నుంచి ఇప్పటివరకు లెబనాన్ సరిహద్దుల్లో హెజ్‌బొల్లాతో చేస్తున్న యుద్ధంలో 47 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించటం గమనార్హం.
🔴Eliminated: Muhammad Musa Salah, Ayman Muhammad Nabulsi and Hajj Ali Yussef Salah—Hezbollah’s Field Commanders of Khiam, Tebnit and Ghajar were eliminated in two separate strikes.
These terrorists directed many terror attacks against Israelis, and were responsible for the…— Israel Defense Forces (@IDF) November 13, 2024
ఆరుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతికి ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు. మరోవైపు.. లెబనాన్‌లోని హెజ్‌బొల్లాకు వ్యతిరేకంగా యుద్ధంలో ఎలాంటి సడలింపు ఉండదని ఇజ్రాయెల్ కొత్త రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకోవటం గమనార్హం.
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 13, 2024
సెప్టెంబరు 23 నుంచి లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలపై బాంబు దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యం వేగం పెంచింది. ప్రధానంగా దక్షిణ బీరుట్, దేశంలోని తూర్పు, దక్షిణాన ఉన్న హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. అక్టోబర్ 7, 2023 నుంచి గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు పాలస్తీనా మిత్రపక్షం హమాస్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment