సిరియాలోని డమాస్కస్‌కు దక్షిణంగా ఇరాన్ అనుకూల గ్రూపు హెజ్‌బొల్లాకు చెందిన అపార్ట్‌మెంట్‌పై ఇజ్రయెల్ సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లాకు చెందిన ఓ కమాండర్‌తో సహా తొమ్మిది మంది మరణించారని ఓ వార్ మానిటర్ వెల్లడించారు. లెబనీస్ పౌరసత్వం కలిగిన ఆ హెజొబొల్లా కమాండర్.. సిరియాలో కీలకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని పేర్కొన్నారు.
సెప్టెంబరు 23న లెబనాన్‌లోని హిజ్‌బొల్లాతో యుద్ధం చెలరేగినప్పటి నుంచి ఇజ్రాయెల్ సిరియాపై దాడులను పెంచుతోంది. సిరియా రాజధానికి దక్షిణంగా ఉన్న సయ్యిదా జైనాబ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ ఇజ్రాయెల్ దాడి చేసింది. లెబనీస్ కుటుంబాలు, హెజ్‌బొల్లా సభ్యులు నివసించే అపార్ట్‌మెంట్ ఇజ్రాయెల్ సైన్యం దాడి చేయటంతో 14 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
‘‘ఇజ్రాయెల్ సైన్యం హతమార్చిన కమాండర్ సిరియాలో చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతను లెబనీస్ జాతీయుడు. ఈ దాడుల్లో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియాకు చెందిన నలుగురు పౌరులు (ఒక మహిళ , ఆమె ముగ్గురు పిల్లలు), హిజ్‌బొల్లాల కమాండర్‌తో సహా మరో ఐదుగురు మృతి చెందారు. మృతి చెందిన కమాండర్ పేరు తెలియరాలేదు’’అని బ్రిటన్ ఆధారిత వార్ మానిటర్‌కు నాయకత్వం వహిస్తున్న రామి అబ్దేల్ రెహ్మాన్ వెల్లడించారు.
మరోవైపు.. శనివారం ఉత్తర, వాయువ్య సిరియాలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మృతి చెందిన ఐదుగురిలో నలుగురు ఇరాన్ అనుకూల ఫైటర్లు ఉన్నట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. 2011లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. సిరియాలో వందలాది దాడులకు పాల్పడింది. హెజ్‌బొల్లా సైనిక స్థావరాలు, ఫైటర్ల లక్ష్యంగా దాడులు చేసింది. సిరియాలో ఇరాన్ తన ఉనికిని విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అనుమతించబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment