ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య మిసైల్స్ దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ.. శుక్రవారం సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ మసీదు వద్ద వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. అక్టోబర్ 7 హమాస్ బలగాలు.. ఇజ్రాయెల్‌పై చేసిన దాడులను సరైన చర్యగా అభివర్ణించారు.
‘మేము మా శత్రువులను ఓడిస్తాం. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనియన్లు, లెబనాన్ ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తాం. మా శత్రువులను కచ్చితంగా ఓడిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. లెబనాన్, పాలస్తీనియన్లపై ఆక్రమణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తాము తెలుపుతున్న నిరసనను అడ్డుకునే హక్కు ఏ అంతర్జాతీయ చట్టానికి లేదు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన క్షిపణి దాడులు ప్రజా సేవ వంటివి. హమాస్ , హెజ్‌బొల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఎటువంటి విజయం సాధించదు. హమాస్, హెజ్‌బొల్లాతో మేము ఉన్నాం.
Grand Ayatollah #Khamenei leads Friday Prayers in Tehran, with the presence of the Iranian nation, maybe with different opinions but a united hand against the enemy.
This is the point that some Western politicians and #Israel, could not understand and miscalculate. pic.twitter.com/w1C0VNKzAa— Pooya (@PooyaMirzaei86) October 4, 2024
సయ్యద్ హసన్ నస్రల్లా ఇప్పుడు మనతో లేరు. కానీ ఆయన స్ఫూర్తి. ఆయన ఏర్పాటు చేసిన మార్గం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన ఇజ్రాయెల్ శత్రువులకు వ్యతిరేకంగా ఎత్తిన జెండా. ఆయన బలిదానం మనపై మరింత బాధ్యత పెంచుతోంది. మన విశ్వాసాన్ని బలపరుస్తూనే శత్రువులకు వ్యతిరేకంగా నిలబడాలి. అదేవిధంగా హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై గతేడాది అక్టోబర్ 7న చేసిన మెరుపు దాడులు సరైన చర్యనే’’ అని అన్నారు.
చదవండి: అటు డోమ్..ఇటు ఫతాహ్!
Comments
Please login to add a commentAdd a comment