జియోకి షాక్‌ : నోకియా ఫీచర్‌ ఫోన్‌ | Nokia 210 Feature Phone Launched as Most Affordable Internet Device | Sakshi
Sakshi News home page

జియోకి షాక్‌ : నోకియా ఫీచర్‌ ఫోన్‌

Published Mon, Feb 25 2019 5:48 PM | Last Updated on Mon, Feb 25 2019 6:37 PM

Nokia 210 Feature Phone Launched as Most Affordable Internet Device - Sakshi

హెచ్ఎండీ గ్లోబ‌ల్ త‌న  నోకియా   మరో ఫీచ‌ర్ ఫోన్‌ను మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ (ఎండ‌బ్ల్యూసీ) 2019లో విడుద‌ల చేసింది. నోకియా 210 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ఫోన్‌ను బడ్జెట్‌ధరలో అందుబాటులో ఉంచింది. 2జీ సపోర్టు,  డ్యుయ‌ల్ సిమ్‌  సదుపాయం ప్రధాన  ఫీచర్లుగా ఉన్నాయి.  ఫేస్‌బుక్ తోపాటు రెగ్యులర్‌ స్నేక్ గేమ్‌ను కూడా ఇందులో పొందుపర్చింది. చార్‌కోల్‌, రెడ్‌, గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో  లభిస్తున్న ఈ  మొబైల్‌ ధ‌ర  సుమారు రూ.2,500. వ‌చ్చే వారం ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి  రానుంది.
 

నోకియా 210 ఫీచర్లు
2.4 ఇంచుల డిస్ ప్లే
2జీబీ ర్యామ్‌,16 ఎంబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ 
వీజీఏ రియర్‌ కెమెరా విత్‌  ఫ్లాష్ 
ఎఫ్ఎం రేడియో, ఎంపీ3 ప్లేయ‌ర్‌
1020 ఎంఏహెచ్ బ్యాట‌రీ

20 రోజుల స్టాండ్ బై టైం, మైక్రో యూఎస్‌బీ పోర్టు త‌దిత‌ర ఫీచ‌ర్లు నోకియా 210 సొంతం. అయితే భారత్‌ మార్కెట్లలో ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement