హెచ్‌ఎండీ గ్లోబల్ బ్రాండ్ నోకియా తనపాపులర్ మోడల్ మొబైల్‌ను మళ్లీ లాంచ్ చేయనుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో క్రమంగా తనస్థానాన్ని పదిల పర్చుకుంటున్న నోకియా అతి తక్కువ ధరలో ఫీచర్ ఫోన్‌ను మళ్ళీ మార్కెట్లో లాంచ చేస్తోంది. తాజాగా నోకియా 106(2018)ను రష్యాలో విడుదల చేసింది. 2013లో విడుదలై బహుళ ఆదరణ పొందిన ఈ ఫోన్‌కు మరిన్ని హంగులు చేర్చి తాజాగా విడుదల చేసింది. తాజానోకియా ఫీచర్ ఫోన్ లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 15గంటల టాక్ టైం 21 స్టాండ్ బై తమ ఫీచర్ ఫోన్ సొంతమని పేర్కొంది.
నోకియా 106(2018) ఫీచర్లు
1.8ఇంచెస్‌డిస్‌ప్లే
మీడియా టెక్ ఎంటీ 6261 డీ ప్రాసెసర్
4 ఎంబీ ర్యామ్, 4 ఎంబీ స్టోరేజ్
ఎఫ్‌ఎం రేడియో, ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్
800ఎంఏహెచ్ బ్యాటరీ
నోకియా 106(2018) ధర సుమారు 1750 రూపాయలుగా ఉండనుంది. 2013లో దీని ధర 1399రూపాయలుగా ఉంది. అయితే భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్‌లో ఈ ఫీచర్ ఫోన్ ఎప్పటికి అందుబాటులోకి వచ్చేది స్పష్టత లేదు.
Comments
Please login to add a commentAdd a comment