సాక్షి, ముంబై: నోకియా సంస్థ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ భారత మార‍్కెట్లను పలకరించింది. హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ గత నెల లండన్ లో విడుదల చేసిన నోకియా 7.1 స్మార్ట్ ఫోన్ ని తాజాగా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ బ్యాకప్, డ్యూయల్ కెమెరాలతో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లు తమ తాజా డివైస్‌పొందుపరిచినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ నె 7నుండి వినియోగదారులకి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ధరను రూ.19,999గా ఉంది.
ఇక ఆఫర్ల విషయానికి వస్తే ఈ ఫోన్ పై ఎయిర్ టెల్, హెచ్‌డీఎఫ్‌సీ సంస్థలు పలు బంపర్ ఆఫర్లని ప్రకటించాయి. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై 10 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.199 రీచార్జీపై 1 టీబీ 4జీ డేటాని పొందనున్నారు.
నోకియా 7.1 ఫీచర్లు
5.84 అంగుళాల ఫుల్ హెడ్ ప్లస్ డిస్‌ప్లే
1080 x 2280 పిక్సల్స్ రిజల్యూషన్
స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ పై
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
12+5 ఎంపీ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు
8 ఎంపీ సెల్పీ కెమెరా
3060 ఎంఏహెచ్ బ్యాటరీ
మరోవైపు డిసెంబరు 10న నిర్వహించనున్న ఒక ఈవెంట్‌లో నోకియా 8.1 తీసుకురానుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment