5 కెమెరాల నోకియా ఫోన్‌ వచ్చేస్తోంది! | Nokia 9 PureView Coming Soon to India  | Sakshi
Sakshi News home page

5 కెమెరాల నోకియా ఫోన్‌ వచ్చేస్తోంది!

Published Sat, May 4 2019 3:46 PM | Last Updated on Sat, May 4 2019 4:43 PM

Nokia 9 PureView Coming Soon to India  - Sakshi

ఎప్పటినుంచో ఆసక్తిగా  ఎదరు చూస్తున్న నోకియా పెంటా కెమెరా నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్‌ఫోన్  అతి త్వరలోనే భారత మార్కెట్‌లో రిలీజ్ కానుంది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ ద్వారా  స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి రీ ఎంట్రీ  ఇచ్చిన నోకియా  అదిరిపోయే ఫోన్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐదు రియర్ కెమెరాలతో కొత్త ఫోన్‌ను తీసుకురానున్నట్టు గతంలోనే  నోకియా ప్రకటించిన సంగతి తెలిసిందే. 12 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న  5 ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ కెమెరాలతో నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి బ్యూరో ఆప్‌ బిజినెస్‌స్టాండర్డ్‌ (బీఐఎస్‌) సర్టిఫికెట్‌ను పొందినట్టుత తెలుస్తోంది.  ఇక ఫీచర్ల విషయంలో అంచనాలు ఇలా ఉన్నాయి.

నోకియా 9ఫ్యూర్‌ వ్యూ ఫీచర్లు
6 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 
12 ఎంపీ పెంటా రియర్‌ కెమెరా
20 ఎంపీ సెల్ఫీ కెమెరా
4150 ఎంఏహెచ్ బ్యాటరీ

2019 ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ట్రేడ్ షోలో పరిచయం  చేసిన  నోకియా 9 ప్యూర్‌ వ్యూ ధర  దాదాపు రూ.50 వేలుగా ఉండవచ్చని అంచనా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement