సాక్షి, ముంబై: నోకియా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లలో శుక్రవారం విడుదలైంది. గత నెలలో బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్‌ఎ టెక్ ఫెయిర్‌లో మొదట హెచ్‌ఎండి గ్లోబల్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో నోకియా 6.2 పేరుతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా, హెచ్‌డిఆర్ 10 సపోర్ట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లాంటివి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.
భారతదేశంలో నోకియా 6.2 ధర
4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ ధర రూ. 15,999. అమెజాన్‌లో నోకియా 6.2 (సిరామిక్ బ్లాక్ వెర్షన్ ) అమ్మకాలు మొదలయ్యాయి.
ఆఫర్ల విషయానికి వస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డులను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై 2,000 రూపాయలు క్యాష్‌బ్యాక్. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేసుకుంటే 10,100 వరకు ఆఫర్‌ను అందిస్తోంది.
నోకియా 6.2 ఫీచర్లు
6.3 అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 9 పై
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 సాక్
4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్
512 జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం
16+ 5 + 8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
3500 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment