ఎలక్ట్రానిక్స్ తయారీదారు సోనీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2019లో ఫిబ్రవరి 25న దీన్ని లాంచ్ చేయనుందట. తాజా నివేదికల ప్రకారం 52 మెగాపిక్సెల్ మెగా కెమెరాతో ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్4 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభించనుంది. దీంతో పాటు వెనుక భాగంలో మరో రెండు కెమెరాలను అంటే మొత్తం మూడు కెమెరాలను అమర్చినట్లు సమాచారం. 52+16 ఎంపీ టెలిఫోటో లెన్స్ + 0.3 ఎంపీ కెపాసిటీ ఉన్న 3డీ కెమెరాలను పొందపర్చడం విశేషం.
అయితే ప్రస్తుతం హానర్ వ్యూ20, రెడ్‌మీ నోట్ 7 ఫోన్లలోమాత్రమే అతి పెద్ద రియర్ కెమెరా(48ఎంపీ)తో స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కంపెనీలకు పోటీగా సోనీ తన ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్4 ఫోన్‌ను తీసుకు రానుంది. ఈ స్మార్ట్ ఫోన ఆవిష్కారమైతే సోనీ ఈ విషయంలో టాప్‌లోకి దూసుకు రావడం ఖాయం. అటు ఈ ఫోన్‌కు సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్ల ఇంకా స్పష్టత లేదు. అయితే మాత్రం అంచనాలు ఇలా ఉన్నాయి
ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్ 4 ఫీచర్లు
6.5 అంగుళాల ఓల్‌ఈడీ డిస్‌ప్లే విత్ 21.9 యాస్పెక్ట్ రేషియో
1440×3360 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 9పై
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
4400 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment