సాక్షి,న్యూఢిల్లీ: నోకియాకు చెందిన మరో స్మార్ట్‌ఫోన్ నోకియా7 ప్లస్ ఇండియాలో త్వరలో లాంచ్ కానుంది. ఆండ్రాయిడ్ ఫ్యామిలీలోని కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బార్సీలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్‌కాంగ్రెస్ 2018లో హెచ్‌ఎండీ గ్లోబల్ పరిచయం చేయనుందట. ముఖ్యంగా నోకియా9, నోకియా 1తో పాటు నోకియా 7 ప్లస్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుందన్నఅంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా బెజెల్ లెస్ డిస్‌ప్లేతో పాటు, కెమెరాపరంగా కూడా కార్ల్ జీస్ లెన్సెస్‌ను అమర్చినట్టు తెలుస్తోంది. కాగా ఫిబ్రవరి 25నంచి వరల్డ్ కాంగ్రెస్ (2018)లో నోకియా1, నోకియా 8 (2018) నోకియా 9 స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తున్నట్టు ఇప్పటికే హెచ్‌ఎండీ గ్లోబల్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా అంచనాల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇలా ఉండనున్నాయి. ఈడివైస్‌కు సంబంధించిన ఫోటోలు, ఫీచర్లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
నోకియా 7 ప్లస్ ఫీచర్లు
6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే
విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
2160 x 1080 పిక్సెల్ రిజల్యూషన్
క్వాల్కం స్నాప్ డ్రాగెన్ 600 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ ఓరియో 8.0
4జీబీర్యామ్
64 జీబీ స్టోరేజ్
12-13 ఎంపీ డబుల్ రియర్ కెమెరా
16ఎంపీ సెల్పీ కెమెరా విత్ టెట్రాసెల్ టెక్నాలజీ
Comments
Please login to add a commentAdd a comment