మిలిటరీ-గ్రేడ్ రేంజ్‌లో నోకియా స్మార్ట్‌ఫోన్‌..! కొనుగోలుపై ఇయర్‌బడ్స్‌ ఉచితం..! | Nokia Xr20 With Military Grade Build First Sale Today | Sakshi
Sakshi News home page

Nokia: మిలిటరీ-గ్రేడ్ రేంజ్‌లో నోకియా స్మార్ట్‌ఫోన్‌..! కొనుగోలుపై ఇయర్‌బడ్స్‌ ఉచితం..!

Published Sat, Oct 30 2021 9:18 PM | Last Updated on Sat, Oct 30 2021 9:21 PM

Nokia Xr20 With Military Grade Build First Sale Today - Sakshi

హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ భారత మార్కెట్లలోకి నోకియా ఎక్స్‌ఆర్‌20 స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్‌ 18న లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నోకియా ఎక్స్‌ ఆర్‌20 స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.  ఈ ఏడాది జూలైలో భారత్‌ మినహా మిగతా దేశాల్లో నోకియా ఎక్స్‌ఆర్‌20ను హెచ్‌ఎమ్‌డీ లాంచ్‌ చేసింది. నోకియా ఎక్స్‌ఆర్‌20  స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత టఫెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌గా అభివర్ణించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఐపీ68 రేటింగ్‌తో రావడంతో సుమారు ఒక గంట లోపు నీటిలో ఉన్నకూడా పనిచేసే సామర్ద్యం నోకియా ఎక్స్‌ఆర్‌20 సొంతం.

గ్రానైట్‌,అల్ట్రా బ్లూకలర్‌ వేరియంట్స్‌తో ఈ స్మార్ట్ ఫోన్స్‌ కొనుగోలుదారులకు లభించనుంది.  నోకియా ఎక్స్‌ఆర్‌20 6జీబీ+128 జీబీ ఇంటర్నల్‌ వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 46,990. ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై నోకియా పవర్‌ బడ్స్‌ లైట్‌ ఇయర్‌బడ్స్‌ కొనుగోలుదారులకు ఉచితంగా లభించనున్నాయి. అంతేకాకుండా ఒక ఏడాదిపాటు స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ను కూడా నోకియా అందిస్తోంది. 

నోకియా XR20 ఫీచర్స్‌

  • 6.67-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లే
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 చిప్‌సెట్‌
  • 6జీబీ ర్యామ్‌+128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • ఆండ్రాయిడ్‌ 11
  • 48+13 మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ రియర్‌ కెమెరా
  • 8మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
  • 4,630 mAh బ్యాటరీ 
  • 18 W వైర్డ్ ఛార్జింగ్
  •  5G సపోర్ట్‌
  • NavIC ఇండియన్‌ జీపీఎస్‌ సపోర్ట్‌
  • యూఎస్‌బీ టైప్-సి చార్జింగ్‌

చదవండి: క్లియర్‌ట్రిప్‌లో వాటాలను కొనుగోలుచేసిన అదానీ..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement