సూపర్‌ ఫీచర్స్‌తో నోకియా లైట్‌ ఇయర్‌బడ్స్‌..! ధర ఎంతంటే..?  | Nokia Lite Earbuds and Nokia Wired Buds launch in India | Sakshi
Sakshi News home page

Nokia Lite Earbuds : సూపర్‌ ఫీచర్స్‌తో నోకియా లైట్‌ ఇయర్‌బడ్స్‌..! ధర ఎంతంటే..? 

Published Thu, Jan 13 2022 8:40 PM | Last Updated on Thu, Jan 13 2022 8:40 PM

Nokia Lite Earbuds and Nokia Wired Buds launch in India - Sakshi

భారత మార్కెట్లలోకి నోకియా సరికొత్త  టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌ బడ్స్‌, వైర్డ్‌ ఇయర్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేసింది. నోకియా లైట్‌ BH-205 ఇయర్‌బడ్స్‌ IPX7 వాటర్‌ రేసిస్టెన్స్‌ రేటింగ్‌తో రానుంది. దీని  ఛార్జింగ్ కేస్ పిల్ ఆకారపు డిజైన్‌ను కలిగి ఉంది. బ్యాటరీ స్థాయిలను చూపించడానికి ముందు భాగంలో నాలుగు LED లైట్లు ఉన్నాయి. ఇది 36 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో రానుంది. నోకియా లైట్ ఇయర్‌బడ్స్ కేవలం క్లాసిక్ చార్‌కోల్, పోలార్‌సీ కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీని ధర రూ. 2,799గా నిర్ణయించారు.

ఇక  నోకియా వైర్డ్ బడ్స్ ఇయర్‌ఫోన్‌  3.5mm ఆడియో పోర్ట్‌తో పాత ఫోన్లకు ఉపయోగించవచ్చు. నోకియా వైర్డ్ బడ్స్ ఇయర్‌ఫోన్‌ బ్లాక్, వైట్, బ్లూ,  రెడ్ అనే నాలుగు కలర్ వేరియంట్లలో లభిస్తాయి.దీని ధర రూ. 299. ఈ రెండు ఉత్పత్తులు నోకియా ఇండియా అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉండనున్నాయి.

నోకియా లైట్‌ ఇయర్‌బడ్స్ (BH-205) ఫీచర్స్‌...!

  • టూత్ 5.0 కనెక్టెవిటీ. ఇయర్‌బడ్‌లు 
  • 6mm ఆడియో డ్రైవ్‌
  • హ్యాండ్స్-ఫ్రీ కంట్రోల్‌
  • సిరి, గూగుల్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌

చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ కొనేవారికి గుడ్‌న్యూస్‌..! డిస్కౌంట్స్‌తో పాటుగా ఇవి కూడా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement