TWS earbuds
-
తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్‌తో ఐటెల్ ఇయర్ బడ్స్..! ధర ఎంతంటే..?
న్యూఢిల్లీ: స్మార్ట్ గ్యాడ్జెట్స్ బ్రాండ్.. ఐటెల్ కొత్తగా టీ1 ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 1,099గా ఉంటుంది. సంగీతం, ఫిట్నెస్ ప్రియుల కోసం దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు ఐటెల్ బ్రాండ్ మాతృ సంస్థ ట్రాన్షన్ సీఈవో అరిజిత్ తాళపత్ర తెలిపారు. ఒకసారి చార్జి చేస్తే ఒక్కో ఇయర్‌బడ్‌కు 8 గంటల ప్లేబ్యాక్ సమయం ఉంటుందని పేర్కొన్నారు. 350 ఎంఏహెచ్ బ్యాటరీతో శక్తిమంతమైన చార్జింగ్ కేసు, 40 గంటల స్టాండ్‌బై టైమ్ ఉంటుంది. జూక్సెట్ ఎన్53 బీటీ వైర్లెస్ ఇయర్ఫోన్లను కూడా ఐటెల్ ఆవిష్కరించింది. దీని ధర రూ. 799. యువత మెరుగైన ఆడియో అనుభూతిని అందించేందుకు ఇవి ఉపయోగపడగలవని అరిజిత్ వివరించారు. చదవండి: 6జీబీ ర్యామ్, పవర్ఫుల్ బ్యాటరీతో అతి తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్..! -
తక్కువ ధరలో బోట్ నుంచి సూపర్ ఇయర్‌బడ్స్..!
భారత్‌కు చెందిన ప్రముఖ ఆడియో ఉత్పత్తుల సంస్థ బోట్ (boAt) సరికొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. బోట్ ఎయిర్‌డోప్స్ 111 (boAt Airdopes 111)ను భారత్‌లో లాంచ్ అయ్యాయి. ఇది తక్కువ ధరలోనే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. బోట్ ఎయిర్‌డోప్స్ 111 ఫీచర్స్ ఇవే..! బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో సూపర్ ఫీచర్స్‌తో బోట్ ఎయిర్‌డోప్స్ 111ను కంపెనీ లాంచ్ చేసింది. మంచి సౌండ్ క్వాలిటీ కోసం 13mm సౌండ్ డ్రైవర్లతో boAt Airdopes 111 రానున్నాయి. బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో రానుంది. వీటిని ఒక్కసారి ఫుల్‌చార్జ్ చేస్తే 7గంటల పాటు నిరంతరాయంగా వాడవచ్చును. చార్జింగ్ కేస్‌తో మొత్తంగా 28 గంటల బ్యాటరీ బ్యాకప్ రానుంది. ఇది టైప్-సీ చార్జింగ్‌ను సపోర్టు చేయనుంది. గూగుల్ అసిస్టెంట్, సిరి వాయిస్ అసిస్టెంట్లకు మద్దతు తెలపనుంది. ధర ఎంతంటే ..! బోట్ ఎయిర్‌డోప్స్ 111 ధర రూ, 1,499 గా ఉండనుంది. వీటిని బోట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో కలదు. ఓషియన్ బ్లూ, శాండ్ పర్ల్, కార్బన్ బ్లాక్, స్నో వైట్ నాలుగు రకాల కలర్లలో రానున్నాయి. చదవండి: సూపర్ ఫీచర్స్‌తో నోకియా లైట్ ఇయర్‌బడ్స్..! ధర ఎంతంటే..? -
అంబ్రేన్ నుంచి అదిరిపోయే టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్..!
భారతదేశంలో అతిపెద్ద మేక్ ఇన్ ఇండియా మొబైల్ యాక్సెసరీస్ బ్రాండ్ అంబ్రేన్ తన సరికొత్త డాట్స్ మ్యూస్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్ 23 గంటలపాటు ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయి. వీటి ధర రూ.1999గా కంపెనీ పేర్కొంది. ఈ కొత్త టీడబ్ల్యూఎస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడంతో ఇందులో బూస్ట్ చేసిన డ్రైవర్ల వల్ల 23 గంటల ప్లేటైమ్ వస్తుంది. దీనికి 365 రోజుల వారంటీ కూడా ఉంది. ఈ ప్రొడక్ట్ Flipkart, Tata Cliq, భారతదేశంలోని అనేక ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. క్లాసిక్ స్టైల్‌తో కూడిన ఈ కాంపాక్ట్ ఇయర్‌బడ్‌లు స్పష్టమైన సంభాషణల కోసం అధిక-నాణ్యత గల ఇన్-బిల్ట్ మైక్రోఫోన్లను కలిగి ఉంటాయి. ఈ వైర్లెస్ ఇయర్‌బడ్‌ల పరిధి 10మీ. ఇవి సరికొత్త బ్లూటూత్ 5.1 టెక్నాలజీతో రూపొందించబడ్డాయి. ఇయర్ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్, సిరి కోసం వాయిస్ యాక్టివేషన్ కూడా ఉంది. అంబ్రేన్ ప్రస్తుతం భారతదేశంలో టీడబ్ల్యూఎస్‌లో బలమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. డాట్స్ సిరీస్‌లో - డాట్స్ స్లే, డాట్స్ 38, డాట్స్ 11, డాట్స్ ట్యూన్ &నియోబడ్స్ 11 & 33 ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో అంబ్రేన్ డాట్స్ మ్యూస్ టీడబ్ల్యూఎస్ కోసం బ్రాండ్ ఇన్ఫ్లుయెన్సర్గా నటి నిధి అగర్వాల్ సంతకం చేసింది. (చదవండి: ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త..!) -
సూపర్ ఫీచర్స్‌తో నోకియా లైట్ ఇయర్‌బడ్స్..! ధర ఎంతంటే..?
భారత మార్కెట్లలోకి నోకియా సరికొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. నోకియా లైట్ BH-205 ఇయర్‌బడ్స్ IPX7 వాటర్ రేసిస్టెన్స్ రేటింగ్‌తో రానుంది. దీని ఛార్జింగ్ కేస్ పిల్ ఆకారపు డిజైన్‌ను కలిగి ఉంది. బ్యాటరీ స్థాయిలను చూపించడానికి ముందు భాగంలో నాలుగు LED లైట్లు ఉన్నాయి. ఇది 36 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో రానుంది. నోకియా లైట్ ఇయర్‌బడ్స్ కేవలం క్లాసిక్ చార్కోల్, పోలార్సీ కలర్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీని ధర రూ. 2,799గా నిర్ణయించారు. ఇక నోకియా వైర్డ్ బడ్స్ ఇయర్‌ఫోన్ 3.5mm ఆడియో పోర్ట్‌తో పాత ఫోన్లకు ఉపయోగించవచ్చు. నోకియా వైర్డ్ బడ్స్ ఇయర్‌ఫోన్ బ్లాక్, వైట్, బ్లూ, రెడ్ అనే నాలుగు కలర్ వేరియంట్లలో లభిస్తాయి.దీని ధర రూ. 299. ఈ రెండు ఉత్పత్తులు నోకియా ఇండియా అధికారిక వెబ్సైట్, ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉండనున్నాయి. నోకియా లైట్ ఇయర్‌బడ్స్ (BH-205) ఫీచర్స్...! టూత్ 5.0 కనెక్టెవిటీ. ఇయర్‌బడ్‌లు 6mm ఆడియో డ్రైవ్ హ్యాండ్స్-ఫ్రీ కంట్రోల్ సిరి, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ కొనేవారికి గుడ్‌న్యూస్..! డిస్కౌంట్స్‌తో పాటుగా ఇవి కూడా..! -
ప్రపంచంలోనే అతి చిన్న ఇయర్‌ఫోన్స్, సోలార్‌పవర్‌తో ఛార్జ్..!
ప్రముఖ స్వీడిష్ ఆడియో బ్రాండ్ అర్బనిస్టా(Ubanista) భారత మార్కెట్లలోకి అడుగుపెట్టింది. టీడబ్ల్యూఎస్ కేటగిరీలోనే కాకుండా, హెడ్‌ఫోన్, ఇయర్‌ఫోన్ ఉత్పత్తులను భారత్‌లో ప్రవేశ పెట్టనుంది. ప్రత్యేక ఆకర్షణగా సోలార్ హెడ్‌సెట్స్..! ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో అర్బనిస్టా అందుబాటులో ఉంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని లాస్ ఏంజెల్స్ మోడల్, లిస్బాన్ మోడల్ ఇయర్‌ఫోన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లాస్ ఏంజెల్స్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ సోలార్ పవర్‌తో ఛార్జ్ చేయవచ్చును. ఇకపోతే లిస్బాన్ మోడల్ ఇయర్‌బడ్స్ ప్రపంచంలోనే అతి చిన్న టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌గా నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా అర్బనిస్టా సీఈఓ అండర్స్ ఆండ్రీన్ మాట్లాడుతూ...“భారత మార్కెట్‌కు మా ఉత్పత్తులను పరిచయం చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ప్రపంచ మొబైల్ క్యాపిటల్‌గా భారత్ నిలుస్తున్నందున , మా బ్రాండ్ ఉత్పత్తులు భారతీయులను ఆకట్టుకుంటాయ’ని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని ప్రీమియం ఆఫ్‌లైన్ రిటైలర్ స్టోర్లలో ,ఎంపిక చేసిన యాపిల్ ప్రీమియం ఐఫోన్ రీసెల్లర్ స్టోర్ అందుబాటులో ఉంటాయని అర్బనిస్టా ఇండియా హెడ్ విజయ్ కణ్ణన్ తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్రధాన ఈ కామర్స్ సైట్లలో కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు. భారత్‌లో బూమ్..! ఆడియో ఉత్పత్తుల విభాగంలో భారత్ 11 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను కల్గి ఉంది. ప్రపంచంలోనే ఆడియో ఉత్పత్తుల్లో భారత్ అతి పెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. దీంతో ఆయా విదేశీ కంపెనీలు భారత్‌కు వచ్చేందుకు సిద్ధమైనాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సలింగ్, ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. చదవండి: Amazon Saving Sales: త్వరపడండి..! మొబైల్, టీవీలపై భారీ తగ్గింపును ప్రకటించిన అమెజాన్..! -
అంబ్రేన్ నుంచి అదిరిపోయే టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్..!
భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉపకరణాల తయారీ దారు అంబ్రేన్ సరికొత్త డాట్స్ ట్యూన్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్ 29 గంటలపాటు ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయి. వీటి ధర రూ. 2199. చదవండి: శాంసంగ్ నుంచి చౌవకైన 5జీ స్మార్ట్‌ఫోన్..! -
బంపర్ ఆఫర్.. రూ.1 కే టీడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్స్
ఈ రోజుల్లో మనకు రూ.1కే ఏమి వస్తుంది. మహా అయితే ఒక చాక్లెట్ మాత్రమే వస్తుంది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా కేవలం రూ.1కే టీడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎక్కువగా హెడ్ ఫోన్ జాక్ తీసుకొని రాకపోవడంతో టీడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ కు చాలా డిమాండ్ పెరిగింది. అందుకే అనేక పరిశోదనల అనంతరం ప్రోబడ్స్ను రూపొందించినట్లు లావా పేర్కొంది. కస్టమర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా, అనేక ట్రయల్స్ చేసిన తర్వాత ఈ డిజైన్ చేసినట్లు సంస్థ తెలిపింది. నిజంగానే కేవలం రూపాయికే ఇయర్‌బడ్స్‌ను లావా సంస్థ ‘ఆఫర్’ చేస్తోంది. రూపాయికే సొంతం చేసుకోవాలంటే రేపు(జూన్ 24వ తేదీ) మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే. లావా ఈ-స్టోర్ కానీ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోగానీ గురువారం 12 గంటల నుంచి ఈ స్పెషల్ ఆఫర్ ప్రారంభవుతుంది. అయితే, ఇక్కడొక షరతు ఉంది. స్టాక్ అందుబాటులో ఉన్న వరకే రూపాయికి ఆఫర్ వర్తిస్తుందని లావా కంపెనీ పేర్కొంది. తర్వాత కొనుగోలు చేసే వారు రూ.2,199 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 11.6 mm అడ్వాన్స్డ్ డ్రైవర్స్, మీడియా టెక్ ఏయిరో చిప్సెట్ ఉన్నాయి. ప్రతి బడ్ లో 55 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, అలాగే కేసులో 500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ప్రోబడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ v5.0 టెక్నాలజీ సపోర్ట్ చేయడంతో పాటు 77 గ్రాముల బరువు ఉన్నాయి. చదవండి: చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్సంగ్