బంపర్ ఆఫర్.. రూ.1 కే టీడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్స్‌ | Lava Probuds TWS Earbuds With 25 Hour Playback Launched in India | Sakshi
Sakshi News home page

బంపర్ ఆఫర్.. రూ.1 కే టీడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్స్‌

Published Wed, Jun 23 2021 3:18 PM | Last Updated on Wed, Jun 23 2021 3:37 PM

Lava Probuds TWS Earbuds With 25 Hour Playback Launched in India - Sakshi

ఈ రోజుల్లో మనకు రూ.1కే ఏమి వస్తుంది. మహా అయితే ఒక చాక్లెట్ మాత్రమే వస్తుంది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా కేవలం రూ.1కే టీడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎక్కువగా హెడ్ ఫోన్ జాక్ తీసుకొని రాకపోవడంతో టీడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ కు చాలా డిమాండ్ పెరిగింది. అందుకే అనేక పరిశోదనల అనంతరం ప్రోబడ్స్ను రూపొందించినట్లు లావా పేర్కొంది. కస్టమర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా, అనేక ట్రయల్స్ చేసిన తర్వాత ఈ డిజైన్ చేసినట్లు సంస్థ తెలిపింది. 

నిజంగానే కేవలం రూపాయికే ఇయర్‌బడ్స్‌ను లావా సంస్థ ‘ఆఫర్‌’ చేస్తోంది. రూపాయికే సొంతం చేసుకోవాలంటే రేపు(జూన్ 24వ తేదీ) మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే. లావా ఈ-స్టోర్‌ కానీ, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లోగానీ గురువారం 12 గంటల నుంచి ఈ స్పెషల్‌ ఆఫర్‌ ప్రారంభవుతుంది. అయితే, ఇక్కడొక షరతు ఉంది. స్టాక్‌ అందుబాటులో ఉన్న వరకే రూపాయికి ఆఫర్‌ వర్తిస్తుందని లావా కంపెనీ పేర్కొంది. తర్వాత కొనుగోలు చేసే వారు రూ.2,199 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 11.6 mm అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్స్‌,  మీడియా టెక్‌ ఏయిరో చిప్‌సెట్ ఉన్నాయి. ప్రతి బడ్ లో 55 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, అలాగే కేసులో 500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ప్రోబడ్స్ లేటెస్ట్‌ బ్లూటూత్‌ v5.0 టెక్నాలజీ సపోర్ట్ చేయడంతో పాటు 77 గ్రాముల బరువు ఉన్నాయి.

చదవండి: చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్‌సంగ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement