భారత్‌కు చెందిన ప్రముఖ ఆడియో ఉత్పత్తుల సంస్థ బోట్ (boAt) సరికొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. బోట్ ఎయిర్‌డోప్స్ 111 (boAt Airdopes 111)ను భారత్‌లో లాంచ్ అయ్యాయి. ఇది తక్కువ ధరలోనే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి.
బోట్ ఎయిర్‌డోప్స్ 111 ఫీచర్స్ ఇవే..!
బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో సూపర్ ఫీచర్స్‌తో బోట్ ఎయిర్‌డోప్స్ 111ను కంపెనీ లాంచ్ చేసింది. మంచి సౌండ్ క్వాలిటీ కోసం 13mm సౌండ్ డ్రైవర్లతో boAt Airdopes 111 రానున్నాయి. బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో రానుంది. వీటిని ఒక్కసారి ఫుల్‌చార్జ్ చేస్తే 7గంటల పాటు నిరంతరాయంగా వాడవచ్చును. చార్జింగ్ కేస్‌తో మొత్తంగా 28 గంటల బ్యాటరీ బ్యాకప్ రానుంది. ఇది టైప్-సీ చార్జింగ్‌ను సపోర్టు చేయనుంది. గూగుల్ అసిస్టెంట్, సిరి వాయిస్ అసిస్టెంట్లకు మద్దతు తెలపనుంది.
ధర ఎంతంటే ..!
బోట్ ఎయిర్‌డోప్స్ 111 ధర రూ, 1,499 గా ఉండనుంది. వీటిని బోట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో కలదు. ఓషియన్ బ్లూ, శాండ్ పర్ల్, కార్బన్ బ్లాక్, స్నో వైట్ నాలుగు రకాల కలర్లలో రానున్నాయి.
చదవండి: సూపర్ ఫీచర్స్‌తో నోకియా లైట్ ఇయర్‌బడ్స్..! ధర ఎంతంటే..?
Comments
Please login to add a commentAdd a comment