ప్రముఖ స్వీడిష్ ఆడియో బ్రాండ్ అర్బనిస్టా(Ubanista) భారత మార్కెట్లలోకి అడుగుపెట్టింది. టీడబ్ల్యూఎస్ కేటగిరీలోనే కాకుండా, హెడ్‌ఫోన్, ఇయర్‌ఫోన్ ఉత్పత్తులను భారత్‌లో ప్రవేశ పెట్టనుంది.
ప్రత్యేక ఆకర్షణగా సోలార్ హెడ్‌సెట్స్..!
ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో అర్బనిస్టా అందుబాటులో ఉంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని లాస్ ఏంజెల్స్ మోడల్, లిస్బాన్ మోడల్ ఇయర్‌ఫోన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లాస్ ఏంజెల్స్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ సోలార్ పవర్‌తో ఛార్జ్ చేయవచ్చును. ఇకపోతే లిస్బాన్ మోడల్ ఇయర్‌బడ్స్ ప్రపంచంలోనే అతి చిన్న టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌గా నిలుస్తున్నాయి.
ఈ సందర్భంగా అర్బనిస్టా సీఈఓ అండర్స్ ఆండ్రీన్ మాట్లాడుతూ...“భారత మార్కెట్‌కు మా ఉత్పత్తులను పరిచయం చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ప్రపంచ మొబైల్ క్యాపిటల్‌గా భారత్ నిలుస్తున్నందున , మా బ్రాండ్ ఉత్పత్తులు భారతీయులను ఆకట్టుకుంటాయ’ని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని ప్రీమియం ఆఫ్‌లైన్ రిటైలర్ స్టోర్‌లలో ,ఎంపిక చేసిన యాపిల్ ప్రీమియం ఐఫోన్ రీసెల్లర్ స్టోర్ అందుబాటులో ఉంటాయని అర్బనిస్టా ఇండియా హెడ్ విజయ్ కణ్ణన్ తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్రధాన ఈ కామర్స్ సైట్లలో కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు.
భారత్‌లో బూమ్..!
ఆడియో ఉత్పత్తుల విభాగంలో భారత్ 11 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను కల్గి ఉంది. ప్రపంచంలోనే ఆడియో ఉత్పత్తుల్లో భారత్ అతి పెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. దీంతో ఆయా విదేశీ కంపెనీలు భారత్‌కు వచ్చేందుకు సిద్ధమైనాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సలింగ్, ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్‌కు భారీ ఆదరణ లభిస్తోంది.
చదవండి: Amazon Saving Sales: త్వరపడండి..! మొబైల్, టీవీలపై భారీ తగ్గింపును ప్రకటించిన అమెజాన్..!
Comments
Please login to add a commentAdd a comment