Itel Launches TWS Earbuds T1 Details Inside - Sakshi
Sakshi News home page

Itel: తక్కువ ధరలో సూపర్‌ ఫీచర్స్‌తో ఐటెల్‌ ఇయర్‌ బడ్స్‌..! ధర ఎంతంటే..?

Published Wed, Feb 16 2022 8:59 AM | Last Updated on Wed, Feb 16 2022 12:42 PM

Itel Launches TWS Earbuds T1 - Sakshi

న్యూఢిల్లీ: స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ బ్రాండ్‌.. ఐటెల్‌ కొత్తగా టీ1 ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 1,099గా ఉంటుంది. సంగీతం, ఫిట్‌నెస్‌ ప్రియుల కోసం దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు ఐటెల్‌ బ్రాండ్‌ మాతృ సంస్థ ట్రాన్షన్‌ సీఈవో అరిజిత్‌ తాళపత్ర తెలిపారు.

ఒకసారి చార్జి చేస్తే ఒక్కో ఇయర్‌బడ్‌కు 8 గంటల ప్లేబ్యాక్‌ సమయం ఉంటుందని పేర్కొన్నారు. 350 ఎంఏహెచ్‌ బ్యాటరీతో శక్తిమంతమైన చార్జింగ్‌ కేసు, 40 గంటల స్టాండ్‌బై టైమ్‌ ఉంటుంది. జూక్‌సెట్‌ ఎన్‌53 బీటీ వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్లను కూడా ఐటెల్‌ ఆవిష్కరించింది. దీని ధర రూ. 799. యువత మెరుగైన ఆడియో అనుభూతిని అందించేందుకు ఇవి ఉపయోగపడగలవని అరిజిత్‌ వివరించారు.    

చదవండి: 6జీబీ ర్యామ్‌, పవర్‌ఫుల్‌ బ్యాటరీతో అతి తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement