
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఐటెల్ భారతదేశంలో తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. తాజగా ఐటెల్ స్మార్ట్‌వాచ్ 2ఈఎస్ (Itel 2ES)ను విడుదల చేసింది. ధర రూ. 1,699లే. బ్లూటూత్ వెర్షన్ 5.3తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ 12 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది.
ఇదీ చదవండి: ట్రూకాలర్‌లో అదిరిపోయే ఫీచర్.. ఆ మెసేజ్‌లను పసిగట్టేస్తుంది!
ఈ స్మార్ట్ వాచ్ ఇంకా మరెన్నో కళ్లుచెదిరే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఉన్న మైక్రోఫోన్ సహాయంతో నేరుగా కాల్స్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.8 అంగుళాల IPS HD డిస్‌ప్లే ఉంటుంది. ఐటెల్ 2ES స్మార్ట్ వాచ్ ఆకర్షణీయమైన సిటీ బ్లూ, రెడ్, గ్రీన్, వాటర్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.
ఐటెల్ స్మార్ట్‌వాచ్‌లో AI వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. దీంతో యూజర్లు కాల్స్ చేయవచ్చు. మెసేజ్‌లు పంపవచ్చు. వాయిస్ ఆదేశాలను ఉపయోగించి ఇతర స్మార్ట్ గ్యాడ్జెట్‌లను నియంత్రించవచ్చు. కాల్ ఎనీటైమ్, ఎనీవేర్ ఫీచర్‌తో పాటు, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఈ స్మార్ట్ వాచ్‌లో ఉన్నాయి. మ్యూజిక్, కెమెరా కంట్రోల్ ఉంటాయి. ఎస్సెమ్సెస్‌లు, సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి స్మార్ట్ నోటిఫికేషన్ ఆప్షన్ కూడా ఉంది.
ఇతర స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే IP68 వాటర్ రెసిస్టెంట్, 1.8 అంగుళాల స్క్రీన్, 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ వంటివి ఉన్నాయి. ఇక 250mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ వాచ్ గరిష్టంగా 12 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఇది మాగ్నెటిక్ ఛార్జింగ్‌ని కలిగి ఉంటుంది.
ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!
Comments
Please login to add a commentAdd a comment