Battery life
-
ఈ స్మార్ట్ వాచ్ సూపర్! 12 రోజుల బ్యాటరీ బ్యాకప్..
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఐటెల్ భారతదేశంలో తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. తాజగా ఐటెల్ స్మార్ట్‌వాచ్ 2ఈఎస్ (Itel 2ES)ను విడుదల చేసింది. ధర రూ. 1,699లే. బ్లూటూత్ వెర్షన్ 5.3తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ 12 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: ట్రూకాలర్‌లో అదిరిపోయే ఫీచర్.. ఆ మెసేజ్‌లను పసిగట్టేస్తుంది! ఈ స్మార్ట్ వాచ్ ఇంకా మరెన్నో కళ్లుచెదిరే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఉన్న మైక్రోఫోన్ సహాయంతో నేరుగా కాల్స్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.8 అంగుళాల IPS HD డిస్ప్లే ఉంటుంది. ఐటెల్ 2ES స్మార్ట్ వాచ్ ఆకర్షణీయమైన సిటీ బ్లూ, రెడ్, గ్రీన్, వాటర్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఐటెల్ స్మార్ట్‌వాచ్‌లో AI వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. దీంతో యూజర్లు కాల్స్ చేయవచ్చు. మెసేజ్‌లు పంపవచ్చు. వాయిస్ ఆదేశాలను ఉపయోగించి ఇతర స్మార్ట్ గ్యాడ్జెట్లను నియంత్రించవచ్చు. కాల్ ఎనీటైమ్, ఎనీవేర్ ఫీచర్‌తో పాటు, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఈ స్మార్ట్ వాచ్‌లో ఉన్నాయి. మ్యూజిక్, కెమెరా కంట్రోల్ ఉంటాయి. ఎస్సెమ్సెస్‌లు, సోషల్ మీడియా నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి స్మార్ట్ నోటిఫికేషన్ ఆప్షన్ కూడా ఉంది. ఇతర స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే IP68 వాటర్ రెసిస్టెంట్, 1.8 అంగుళాల స్క్రీన్, 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 500 నిట్స్ వరకు బ్రైట్నెస్ వంటివి ఉన్నాయి. ఇక 250mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ వాచ్ గరిష్టంగా 12 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఇది మాగ్నెటిక్ ఛార్జింగ్‌ని కలిగి ఉంటుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
కొత్త స్మార్ట్ఫోన్లు ఎందుకు పాడవుతాయో తెలుసా?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ఫోన్ల వాడకం కూడా అదే స్థాయిలో ఉంది. ఇటీవల వేల ఖర్చు పెట్టి కొన్న స్మార్ట్ఫోన్లు త్వరగా పాడైపోయిన ఘటనలు మన చుట్టు పక్కలనో లేదా స్నేహితులు, బంధువుల దగ్గరో చూసే ఉంటాం. దీనికి కారణాలు చాలానే ఉన్నా ప్రధానంగా ఉన్నది మాత్రం ఫోన్ బ్యాటరీ పాడైపోవడం. ఈ బ్యాటరీ సమస్య మాత్రం మొబైల్ కంపెనీలకు సవాలుగా మారింది. మనం తెలియకుండా చేసే పనులే మన ఫోన్‌ని రిపేర్ షాపులో ఉండేలా చేస్తున్నాయి. అవేంటో చూసేద్దాం! రకరకాల ఛార్జర్లను ఉపయోగించడం మొదట్లో ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి కంపెనీ చార్జర్ వాడుతాం. కానీ కొన్ని రోజులకే వేరే వాటిని ఉపయోగిస్తాం. దీనివల్ల చార్జింగ్ సమయంలో బ్యాటరీ పై దుష్ప్రభావం పడుతుంది. పైగా చార్జింగ్ విషయంలో కంపెనీ చార్జర్లను ఎంపిక చేసుకోవటమే ఉత్తమం. కంపెనీ చార్జర్‌ని పక్కన పెడితే అది ఫోన్ బ్యాటరీని లైఫ్టైంని ఇది తగ్గిస్తుంది. ఎలా అంటారా శాంసంగ్(Samsung) స్మార్ట్ఫోన్లు 18W లేదా 25W ఛార్జింగ్‌ను కలిగి ఉంటాయి. అలానే రియల్మీ( Realme ) స్మార్ట్‌ఫోన్‌లో 18W, 33W, 67W సాధారణ ఛార్జింగ్ ఉంటుంది. ఫుల్ చార్జ్ అవసరం లేదు చాలా సార్లు స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత కూడా ఛార్జింగ్‌లోనే ఉంటుంది. దీని వల్ల బ్యాటరీ పాడైపోయే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగితే, అది మీ ఫోన్ ప్రాసెసర్‌పై కూడా ప్రభావం చూపుతుంది. అంటే బ్యాటరీతో పాటు ఫోన్ ప్రాసెసర్ కూడా దెబ్బతింటుంది. అందుకే 90 శాతం ఛార్జింగ్ చేస్తే సరిపోతుంది. జీరో స్థాయి చార్జ్ మంచి కాదు ప్రతిసారీ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్న తరువాత చార్జింగ్ ప్రక్రియ మొదలెట్టకూడదు. ఎప్పటికప్పుడు ఫోన్ చార్జింగ్ లెవల్స్ తగ్గకుండా చూసుకోవటం ఉత్తమం. అలాగే వేడి వాతావరణంలో ఫోన్‌ను ఉంచటం మంచిదికాదు. తరచుగా ఛార్జింగ్ పెట్టకూడదు ఫోన్‌ని ఛార్జింగ్‌లో ఉంచిన తర్వాత 90 శాతం వరకు ఛార్జ్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే కొంత మంది ఏదో హడావుడిలో పడి 40, 50 ఇలా తక్కు శాతం చార్జ్ అవగానే వాడుతుంటారు. అంతలోనే ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోందని మళ్లీ చార్జ్ చేస్తుంటారు. ఈ ప్రక్రియనే మళ్లీ మళ్లీ పాటిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో, బ్యాటరీ మాత్రమే కాదు ఫోన్ లైఫ్‌టైం కూడా తగ్గిపోతుంది. పదే పదే ఛార్జింగ్ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ కెపాసిటీ నిరంతరం తగ్గుతూ ఉంటుంది. చదవండి: Edible Oil Prices: బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు! -
ఎలక్ట్రిక్ వాహనాలు ఎప్పటికీ అదే రేంజ్ ఇస్తాయా?
ఎలక్ట్రిక్ వాహనాలును ఇంధన వాహనాలతో పోలిస్తే ధీర్ఘ కాలంలో తక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పుకోవచ్చు. రేంజ్ ఎక్కువ లేకపోవడం, అధిక వాహన ధర, పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు వంటి సమస్యలు ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలలో ఈవీలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రంగం జోరు మీద ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వినియోగదారులు ఎదుర్కునే ప్రధాన సమస్య బ్యాటరీలు. భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల సగటు రేంజ్ ఒకే సారి ఛార్జ్ చేస్తే సుమారు 70 కిలోమీటర్ల వరకు వస్తుంది. కొన్ని ఇతర ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను ఒకసారి ఛార్జ్ చేస్తే 200కి పైగా రేంజ్ అందిస్తాయి. అయితే, ఎలక్ట్రిక్ వేహికల్ లైఫ్ సైకిల్ ఎప్పుడు ఒకేవిధంగా ఉండదు. ఐసీఈలు, మొబైల్ ఫోన్ బ్యాటరీల మాదిరిగానే రీఛార్జబుల్ లిథియం-అయాన్ ఈవి బ్యాటరీలు, మోటార్లు కాలంతో పాటు క్షీణిస్తాయి. ఇది ఎలక్ట్రిక్ వేహికల్ పనితీరు, రేంజ్'పై ప్రభావం చూపుతుంది. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. (చదవండి: గృహ, వాహన రుణాలను తీసుకోనే వారికి గుడ్‌న్యూస్..!) సమయం ఇంధన వాహనాల మాదిరిగా కాకుండా? ఎలక్ట్రిక్ వాహనాల కాలవ్యవధి బ్యాటరీలపై ఆధారపడి ఉంటుంది. సులభంగా చెప్పాలంటే? మన ఫోన్ కొన్నప్పుడు ఫోన్ బ్యాటరీ అనేది ఎక్కువ కాలం వస్తుంది. అదే ఒక ఏడాది ఎంతో కొంత తగ్గుతుంది. ఎందుకుంటే మన బ్యాటరీ సేల్స్ కాలవ్యవది రోజు రోజుకి తగ్గిపోతుంది. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ కాలం కూడా తగ్గి పోతుంది. లిక్విడ్ కూల్డ్, కొత్త తరం ఈవి బ్యాటరీలు తక్కువ శాతం క్షీణతతో వస్తాయి. ఇప్పుడు వచ్చే కొత్త థర్మల్ మేనేజ్ మెంట్ సిస్టమ్, కొత్త టెక్నాలజీల బ్యాటరీల కాల వ్యవది పెరుగుతుంది. ఉష్ణోగ్రత బ్యాటరీ పనితీరులో ఉష్ణోగ్రత కీలక పాత్ర పోషిస్తుంది. చల్లని ఉష్ణోగ్రతల సమయంలో ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. దీనివల్ల తాత్కాలికంగా రేంజ్ కూడా తగ్గిపోతుంది. మరోవైపు వేసవి కాలంలో బ్యాటరీలు వేగంగా చార్జ్ అయినప్పటికీ అవి పేలే అవకాశం ఉంది. అయితే, ఎండ కాలం, వాన కాలం, చలి కాలం వల్ల దీర్ఘకాలంలో బ్యాటరీ పనితీరు, రేంజ్ అనేది తగ్గే అవకాశం ఉంది. (చదవండి: హోండా కంపెనీ భారీ ప్లాన్.. ఇక తగ్గేదె లే!) ఛార్జింగ్ అలవాటు బ్యాటరీ జీవితకాలం అనేది రోజుకి/వారానికి ఎన్ని సార్లు చార్జ్ చేస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు గనుక బ్యాటరీ పూర్తి అయ్యేంత వరకు చార్జ్ చేయకపోయిన, తరచు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఈవీ కొనేవారికి చాలా ఆకర్షణీయంగా ఉండవచ్చు. కానీ, ఇది వాస్తవానికి బ్యాటరీ కణాలను దెబ్బతీస్తుంది. ఇది చివరికి ఈవీ బ్యాటరీ పనితీరు, పరిధి సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే మీరు వాడే ఎలక్ట్రిక్ వాహన జీవిత కాలం ప్రతి ఏడాది తగ్గిపోతుంది. ఒకవేల కంపెనీలు గనుక బ్యాటరీ తక్కువ ఖర్చుతో మార్కెట్లోకి తీసుకొని వస్తే మీకు అది ఒక శుభవార్త. -
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసే ముందు ఇవి తెలుసుకోండి!
దేశంలో పెట్రోల్ ధరలు 100 రూపాయల దాటేసరికి వాహనదారులు తమ వాహనాన్ని బయటకు తీయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది కొత్త వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. కరోనా మహమ్మరి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆటో పరిశ్రమకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఇది ఇలా ఉంటే ఎలక్ట్రిక్ వాహనలకు డిమాండ్, అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా చాలా మంది వినియోగదారులను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సిద్దం అవుతున్నారు.(చదవండి: సరికొత్త మోసం.. ఇలాంటి లింక్ అస్సలు క్లిక్ చేయకండి!) ప్యాసింజర్ వేహికల్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన ట్రెండ్ ఏమిటంటే, ప్రీ-ఓన్డ్ లేదా ఉపయోగించిన వాహనాలకు అధిక డిమాండ్ ఉంటుంది. దీని వెనుక కారణం కొత్త మోడల్స్ తో పోలిస్తే వాహనాలు సరసమైన ధరలకు వస్తాయి. అదే సమయంలో, పెద్దగా కొన్నవారికి కూడా ఎక్కువ నష్టం కలగదు. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరగడంతో ఈవీ ప్రీ-ఓన్డ్ వేహికల్ మార్కెట్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, సెకండ్ హ్యాండ్ లేదా ప్రీ-ఓన్డ్ ఎలక్ట్రిక్ వాహనాలను కొనేముందు కొన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. బ్యాటరీ జీవితకాలం ఉపయోగించిన ఈవీని కొనుగోలు చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశం ఇది. బ్యాటరీ మంచి కండిషన్ తో ఉన్న ఈవీలు భాగ పనిచేస్తాయి. అయితే, ఉపయోగించిన ఐసీఈ వేహికల్ కొనుగోలు చేసేటప్పుడు మీరు చెక్ చేసినట్లుగా వీటి బ్యాటరీ జీవితకాలం, రేంజ్ వంటివి చెక్ చేయాలి. ఆ తర్వాత డీల్ గురుంచి మాట్లాడండి. బ్యాటరీ జీవితకాలం ఛార్జింగ్ టైప్, ఛార్జింగ్ ఫ్రీక్వెన్సీ, బ్యాటరీ ఏ స్థాయికి డ్రెయిన్ చేశారు వంటి కారకాలపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. ఫాస్ట్ ఛార్జింగ్ ఈవీల బ్యాటరీలు త్వరగా నష్టం వాటిల్లుతుంది. రెగ్యులర్ హోమ్ ఛార్జింగ్ సాకెట్ ఎక్కువ బ్యాటరీ జీవితకాలాన్ని ఇస్తుంది. బ్యాటరీని సున్నా నుంచి చార్జ్, ఎప్పుడు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ జీవిత కాలం ప్రభావితం చెందుతుంది. ఆ లీథియం ఆయాన్ బ్యాటరీ లేదా వేరే బ్యాటరీనా అని చూసుకోవాలి. (చదవండి: డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు డౌన్లోడ్ చేశారా..?) మైలేజ్ రేంజ్ ఈవీ రేంజ్ బ్యాటరీ సైజుపై ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ ఎంత పెద్దదిగా ఉంటే ఈవీ అంత ఎక్కువ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల, ప్రీ-ఓన్డ్ ఈవిపై డీల్ ఖరారు చేసే ముందు బ్యాటరీ సైజు, సగటు రేంజ్ గురించి ఎల్లప్పుడూ విచారించండి. ఎలక్ట్రిక్ వాహనం రేంజ్ సామర్థ్యం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. మౌలిక సదుపాయాల లభ్యత ఈవీ కొనుగోలు చేసే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో కీలకమైన అంశం. నగరం, చుట్టుపక్కల ఎక్కువగా ప్రయాణించడానికి ఈవీ కొనుగోలు చేసినట్లయితే ఎలాంటి సమస్య లేదు. ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటే రహదారుల వెంట ఎక్కువ ఛార్జింగ్ సౌకర్యాలు ఉన్నాయో లేదా అనేది చూసుకోవాలి.(చదవండి: ఏటీఎం కార్డు లాంటి ఆధార్.. అప్లై ఇలా!) కాలం ఒక ఎలక్ట్రిక్ వాహనం తీసుకునే ఎన్ని ఏళ్లు అయ్యింది అనేది కూడా చాలా ముఖ్యం. ఇంధన వాహనాలతో పోలిస్తే తక్కువ లైఫ్ ఉంటాయి. నిర్వహణ ఖర్చులు పెద్దగా ఉండనప్పటికి బ్యాటరీ, ఇంజిన్ సమస్య వస్తే సాదారణ వాహనాలతో పోలిస్తే ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. వీటి జీవిత కాలం ఇంధన వాహనాలతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకే, కొనేముందు వారు తీసుకొని ఎన్ని ఏళ్లు అయింది అనేది తెలుసుకోవాలి. -
బ్యాటరీ బిజినెస్‌పై ఓయ్! రిక్షా వేలకోట్లలో పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ ఓయ్! రిక్షా దేశీయంగా బ్యాటరీల స్వాపింగ్ సౌకర్యాలపై దృష్టి పెట్టింది. ఇందుకు రానున్న మూడేళ్లలో రూ. 3,700 కోట్లను ఇన్వెస్ట్ చేయాలని ప్రణాళికలు వేసింది. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ స్వాపింగ్ మౌలికసదుపాయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ సీఈవో మోహిత్ శర్మ పేర్కొన్నారు. ఈ క్రమంలో మరోసారి బ్యాటరీ స్వాపింగ్ బిజినెస్ విస్తరణకుగాను రెండేళ్లలో రూ. 150–220 కోట్లు అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరికల్లా 10,000 లిథియం అయాన్ బ్యాటరీలను వినియోగించాలని కంపెనీ తొలుత ప్రణాళికలు వేసింది. అయితే కోవిడ్–19 సెకండ్ వేవ్ దెబ్బతీయడంతో 5,000 వాహనాలకు సరిపడా 6,500 బ్యాటరీలను అందించాలని ఆశిస్తోంది. 5,000 మంది డ్రైవర్ల భాగస్వామ్యంతో ఈరిక్షాల ద్వారా వినియోగదారులకు షేర్డ్, ఎలక్ట్రిక్, మైక్రో మొబిలిటీ సేవలు అందిస్తోంది. బ్యాటరీ స్వాపింగ్ బిజినెస్‌లోకి కొత్తగా ప్రవేశించినప్పటికీ 250–300 మంది డ్రైవర్లను భాగస్వాములుగా చేసుకున్నట్లు శర్మ వెల్లడించారు. -
ఫోన్ బ్యాటరీ లైఫ్‌లో సమస్యలా? ఈ 5 చిట్కాలు ఫాలో అవండి
గత కొన్ని ఏళ్లుగా స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలో కీలక మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ప్రాసెసర్ల నుంచి మొదలు పెడితే హై-రిజల్యూషన్ డిస్ప్లేల వరకు ఎన్నో రకాల ఫీచర్లు మనకు అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఇప్పటికి స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే పెద్దగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కేవలం బ్యాటరీ చార్జ్ అయ్యే వేగం, సామర్థ్యంలో మాత్రమే మార్పులు వచ్చాయి. అనేక ఏళ్లుగా ఇప్పటికి స్మార్ట్‌ఫోన్ యూజర్లను వేదిస్తున్న సమస్య బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం. శామ్ సంగ్ వంటి సామర్థ్యం పరంగా పెద్ద పెద్ద బ్యాటరీ ఉన్న ఫోన్లు అందుబాటులోకి వచ్చిన వాడకం కూడా అదే రీతిలో పెరిగింది. అయితే, ఈ 5 చిట్కాలతో మన స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకునే వీలుంది. 1. పవర్ సేవింగ్ మోడ్ మీకు అత్యవసర సమయాల్లో మీ ఫోన్ బ్యాటరీ తొందరగా ఖాళీ కాకుండా ఉండాలంటే పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకోవడం మంచిది. దీనివల్ల మీ ఫోన్ లో అనవసరంగా రన్ అయ్యే యాప్స్ ని బ్యాక్ గ్రౌండ్ లో తొలగిస్తుంది. దీంతో మీ బ్యాటరీ తొందరగా ఖాళీ కాదు. అలాగే, ఆండ్రాయిడ్ 10పై రన్ అవుతున్న ఫోన్లలో ఉండే అడాప్టివ్ పవర్ సేవింగ్ మోడ్ యాక్టివేట్ చేసుకోవాలి. దీనివల్ల మీరు ఫోన్ లో చాలా తక్కువగా వాడే యాప్స్ కు బ్యాటరీ అవసరం మేరకు మాత్రమే సరఫరా చేయబడుతుంది. 2. నెట్ వర్క్ డేటా మీ ఇంట్లో వై-ఫై సౌకర్యం అందుబాటులో ఉంటే వై-ఫై ఉపయోగించడం చాలా మంచిది. బయటకి వెళ్లిన సందర్భంలో మాత్రమే మీ మొబైల్ డేటాను ఆన్ చేసుకోవాలి. వై-ఫైతో పోలిస్తే మీ మొబైల్ డేటా ఆన్ చేసిన సమయంలోనే ఎక్కువ బ్యాటరీ డ్రెయిన్ అవుతుంది. రెండింటినీ ఆన్ చేసి ఉంచితే బ్యాటరీ వినియోగం పెరుగుతుంది. ఫలితంగా బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే, లొకేషన్ సేవలు అవసరం లేని సమయంలో ఆఫ్ చేసుకుంటే. ముఖ్యంగా మీరు ఇంట్లో, ఆఫీస్ లో ఉన్నప్పుడు లొకేషన్ ఆఫ్ చేసుకోవడం ఉత్తమం. 3. డార్క్ మోడ్ మీరు ఉపయోగించే ఫోన్లో గాని, యాప్స్ లో డార్క్ మోడ్ ఆప్షన్ ఉంటే అది ఆన్ చేసుకుంటే మంచిది. ఐఫిక్స్ ప్రకారం, డార్క్ మోడ్ ఆన్ చేయడం ద్వారా మీరు ఒక గంట బ్యాటరీ జీవితకాలాన్ని ఆదా చేయవచ్చు. అలాగే, అడాప్టివ్ బ్రైట్ నెస్ ఫీచర్ ఆన్ చేసుకోవడం వల్ల మీరు వెళ్లే ప్రదేశాన్ని బట్టి బ్యాటరీ ఆటోమెటిక్ గా నియంత్రించబడుతుంది. 4. స్క్రీన్ టైమ్ ఔట్ చాలామంది ఫోన్ ఉపయోగించిన ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత స్క్రీన్ ఆఫ్ అయ్యేలా టైమ్ సెట్ చేస్తారు. దీనివల్ల కూడా బ్యాటరీ కాలం త్వరగా అయిపోయే అవకాశం ఉంది. ఇక నుంచి మీ స్క్రీన్ టైమ్ ఔట్‌ను 30 సెకన్లకు తగ్గించి చూడండి. దానివల్ల బ్యాటరీ వినియోగం తగ్గిపోతుంది. 5.వాల్ పేపర్, విడ్జెట్ చాలా మంది ఎక్కువగా స్క్రీన్ మీద లైవ్ వాల్ పేపర్ పెడుతుంటారు. మీ డిస్ ప్లే వాటిని యానిమేట్ చేయడానికి ఎక్కువ శక్తి అవసరం కాబట్టి బ్యాటరీ ఖర్చు అవుతుంది. అలాంటి సందర్భాలలో సాదారణ వాల్ పేపర్ పెట్టుకోవడం మంచిది, అలాగే విడ్జెట్ లు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాయి కాబట్టి బ్యాటరీ లైఫ్ తొందరగా తగ్గిపోతుంది. చదవండి: ఫేస్బుక్ యూజర్లకు మరో షాక్.. ఈ యాప్స్ తో జర జాగ్రత్త! -
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోండిలా!
స్మార్ట్‌ఫోన్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయింది. రోజు రోజుకి స్మార్ట్‌ఫోన్ వినియోగం భారీ స్థాయిలో పెరిగిపోతుంది. అయితే, ఒకప్పటి స్మార్ట్ఫోన్లలో బ్యాటరీ సమస్యలు అధికంగా కనిపించేవి. కానీ, ఇప్పుడు అన్ని కంపెనీలు పెద్ద పెద్ద బ్యాటరీలతో కూడిన స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్నాయి. స్మార్ట్ఫోన్లలో బ్యాటరీ అనేది చాలా ముఖ్యమైనది. ఫోన్ మిగిలిన ఫీచర్స్ ఎలాగున్నా బ్యాటరీ పరిమాణాన్ని బట్టి మొబైల్ కొనుగోలు చేసే వినియోగదారులు ఇప్పటికి ఉన్నారు. అలాంటి బ్యాటరీ లైఫ్ మొదట బాగున్నప్పటికీ స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగే కొద్దీ బ్యాటరీ లైఫ్ క్రమంగా క్షీణిస్తూనే ఉంటుంది. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే బ్యాటరీ లైఫ్ పెంచుకునే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ స్థాయి 20 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు మీరు గమనిస్తే మీ ఫోన్‌ను వెంటనే ఛార్జ్ చేయడం మంచిది. అలాగే, స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ స్థాయి 90 శాతం చేరుకోగానే ఛార్జింగ్‌ను ఆపడం చాలా మంచిది. ఎక్కువ శాతం మంది రాత్రంతా బ్యాటరీని ఛార్జ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ వేగంగా క్షీణిస్తుంది. మీ ఫోన్ బ్యాటరీ అయిపోయినప్పుడు, గేమ్స్ ఆడనప్పుడు లేదా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు పవర్ సేవింగ్ మోడ్‌ను ఉపయోగించడం మంచిది. వై-ఫై, బ్లూటూత్ అనేది మీ బ్యాటరీని త్వరగా హరిస్తుంది. ఈ రెండింటినీ అవసరం లేనప్పుడు ఆఫ్ చేయడం మంచిది. వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ అనేది స్మార్ట్‌ఫోన్‌లో గల మరొక సౌలభ్యం. అయితే దీనిని అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి యాదృచ్ఛిక ఛార్జింగ్ ఎడాప్టర్లు మరియు కేబుల్లను ఉపయోగించడం మానుకోండి. మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి తక్కువ నాణ్యత గల పవర్ బ్యాంకులను ఉపయోగించడం మానుకోండి. బ్యాటరీ లైఫ్ ను పెంచుకోవడానికి ఫోన్ లో అవసరం లేని యాప్ లను తొలగించండి. చదవండి: కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్! -
లావా కొత్త ఐరిస్ ఫోన్
ఐరిస్ ఫ్యూయల్ 60@ రూ.8,888 అధిక బ్యాటరీ లైఫ్ ఈ మొబైల్ ప్రత్యేకత... ఆండ్రాయిడ్ లాలిపాప్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు న్యూఢిల్లీ నుంచి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధి: దేశీయ మొబైల్ కంపెనీ లావా ఐరిస్ సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్-ఐరిస్ ఫ్యూయల్ 60ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది.పదే పదే చార్జింగ్ చేయకుండానే ఎక్కువ గంటల పాటు ఈ ఫోన్‌ను వాడుకోవచ్చని లావా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ (ప్రోడక్ట్) నవీన్ చావ్లా చెప్పారు. ఈ డివైస్ ధర రూ.8,888 అని పేర్కొన్నారు. స్మార్ట్ఫోన్లు రోజువారీ దినచర్యలో ఒక భాగం అయ్యాయని, అయితే బ్యాటరీ లైఫ్ ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. ఈ సమస్యను నివారించడానికి ఐరిస్ ఫ్యూయల్ 60ను అందిస్తున్నామని వివరించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1.3 గిగాహెర్ట్స్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 10 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుందని, ఆండ్రాయిడ్‌లో తాజా వెర్షన్ అయిన లాలిపాప్ ఓఎస్‌కు ఈ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని వివరించారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 32 గంటల టాక్‌టైమ్(2జీ) వస్తుందని పేర్కొన్నారు. క్విక్ చార్జ్ టెక్నాలజీతో ఈ ఫోన్‌ను రూపొందించామని, దీంతో చార్జింగ్ టైమ్ 3గంటల 15 నిమిషాలకు తగ్గిందని వివరించారు. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లో విడి భాగాలను ఒకదానినొకటి అనుసంధానం చేయడానికి సోల్డరింగ్ చేస్తారని, కానీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో సోల్డరింగ్తో కాకుండా కనెక్టర్స్ ద్వారా ప్రతి విడిభాగాన్ని పీసీబీఏ(ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లి)కు అనుసంధానం చేశామని పేర్కొన్నారు. ఫలితంగా లోపాలు తక్కువగా ఉంటాయని, రిపేర్లు సులభంగా చేయవచ్చని వివరించారు. -
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను పెంచేందుకో యాప్!
మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ మాటిమాటికీ అయిపోతోందా? అది చూసి మీరు చిరాకు పడుతున్నారా? అయితే మీ కోసం ఇక్కడో యాప్ సిద్ధంగా ఉంది. కేవలం కొన్ని రకాల యాప్‌ల వల్ల మాత్రమే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా ఖర్చయిపోతుందని అమెరికాకు చెందిన ఓ ప్రొఫెసర్ చెప్పారు. ఆయన 'ఈస్టార్' అనే కొత్త యాప్‌ను రూపొందించారు. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ముందుగా బ్యాటరీని తక్కువగా వాడుకునే యాప్‌లు ఏంటో గూగుల్‌ప్లేలో చూపిస్తుంది. ఇది ప్రతి యాప్‌కు కలర్ కోడ్‌తో ఫైవ్‌స్టార్ ఎనర్జీ రేటింగ్ ఇస్తుంది. దీని ప్రకారం అదే విభాగంలోని ఇతర యాప్‌లు ఎంత బ్యాటరీ వాడుకుంటాయో, ఇది ఎంత వాడుకుంటుందో తెలుస్తుంది. అందువల్ల ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలో యూజర్లు నిర్ణయించుకోగలరని ఈ యాప్ సృష్టికర్త, పర్డ్యూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌కు చెందిన వై చార్లీ హు చెప్పారు. ఇక ఇప్పటికే డౌన్లోడ్ చేసుకుని రన్ చేస్తున్న యాప్‌లు ఎంత వాడుకుంటున్నాయో కూడా చెబుతుంది. దాని ప్రకారం యూజర్లను హెచ్చరించి బ్యాటరీ లైఫ్ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. 'ఈస్టార్' యాప్ గూగుల్ ప్లేలో ఉచితంగా అందుతుంది. -
కొత్త బ్యాటరీలు.. 50 ఏళ్లు పనిచేస్తాయ్..!
ఎలక్ట్రానిక్ పరికరాలకు ఉపయోగించే బ్యాటరీల జీవితకాలాన్ని గణనీయంగా పెంచేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీని కనుగొన్నారు. ప్రస్తుతం గుండె పనితీరును మెరుగుపర్చేందుకు ఉపయోగించే పేస్మేకర్ల వంటివాటికి అమర్చే బ్యాటరీలు గరిష్టంగా పదేళ్ల వరకూ పనిచేస్తున్నాయి. అందువల్ల పదేళ్లకోసారి ఆపరేషన్ చేసి కొత్త బ్యాటరీలను అమర్చాల్సి వస్తోంది. ఈ కొత్త బ్యాటరీలను పేస్మేకర్లకు అమరిస్తే గనక.. 30-50 ఏళ్ల వరకూ పనిచేస్తాయని ఓక్ రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఘన లిథియం థియోపాస్ఫేట్ ఎలక్ట్రోలైట్‌తో తయారు చేసిన ఈ లిథియం-కార్బన్ ఫ్లోరైడ్ బ్యాటరీలు ఇప్పుడున్నవాటి కన్నా 26 శాతం సమర్థంగా పనిచేస్తాయని అంటున్నారు. ఈ కొత్త బ్యాటరీలోని ఎలక్ట్రోలైట్.. అయాన్ల రవాణాకు మాత్రమే కాకుండా క్యాథోడ్‌ల సరఫరాకూ ఉపయోగపడుతుందని, అందువల్ల బ్యాటరీల జీవితకాలం గణనీయంగా పెరుగుతుందని చెబుతున్నారు.