స్మార్ట్‌ఫోన్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయింది. రోజు రోజుకి స్మార్ట్‌ఫోన్ వినియోగం భారీ స్థాయిలో పెరిగిపోతుంది. అయితే, ఒకప్పటి స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ సమస్యలు అధికంగా కనిపించేవి. కానీ, ఇప్పుడు అన్ని కంపెనీలు పెద్ద పెద్ద బ్యాటరీలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ అనేది చాలా ముఖ్యమైనది. ఫోన్ మిగిలిన ఫీచర్స్ ఎలాగున్నా బ్యాటరీ పరిమాణాన్ని బట్టి మొబైల్ కొనుగోలు చేసే వినియోగదారులు ఇప్పటికి ఉన్నారు. అలాంటి బ్యాటరీ లైఫ్ మొదట బాగున్నప్పటికీ స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగే కొద్దీ బ్యాటరీ లైఫ్ క్రమంగా క్షీణిస్తూనే ఉంటుంది. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే బ్యాటరీ లైఫ్ పెంచుకునే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ స్థాయి 20 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు మీరు గమనిస్తే మీ ఫోన్‌ను వెంటనే ఛార్జ్ చేయడం మంచిది.
- అలాగే, స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ స్థాయి 90 శాతం చేరుకోగానే ఛార్జింగ్‌ను ఆపడం చాలా మంచిది.
- ఎక్కువ శాతం మంది రాత్రంతా బ్యాటరీని ఛార్జ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ వేగంగా క్షీణిస్తుంది.
- మీ ఫోన్ బ్యాటరీ అయిపోయినప్పుడు, గేమ్స్ ఆడనప్పుడు లేదా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు పవర్ సేవింగ్ మోడ్‌ను ఉపయోగించడం మంచిది.
- వై-ఫై, బ్లూటూత్ అనేది మీ బ్యాటరీని త్వరగా హరిస్తుంది. ఈ రెండింటినీ అవసరం లేనప్పుడు ఆఫ్ చేయడం మంచిది.
- వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ అనేది స్మార్ట్‌ఫోన్‌లో గల మరొక సౌలభ్యం. అయితే దీనిని అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి.
- మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి యాదృచ్ఛిక ఛార్జింగ్ ఎడాప్టర్లు మరియు కేబుల్‌లను ఉపయోగించడం మానుకోండి.
- మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి తక్కువ నాణ్యత గల పవర్ బ్యాంకులను ఉపయోగించడం మానుకోండి.
- బ్యాటరీ లైఫ్ ను పెంచుకోవడానికి ఫోన్ లో అవసరం లేని యాప్ లను తొలగించండి.
Comments
Please login to add a commentAdd a comment