చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్ మీ నార్జో 30 5జీ, రియల్ మీ నార్జో 30 స్మార్ట్‌ఫోన్‌లను భారత్ లో విడుదల చేసింది. రియల్ మీ బడ్స్ క్యూ2, రియల్ మీ ఫుల్-హెచ్ డి స్మార్ట్ టీవీతో పాటు వర్చువల్ ఈవెంట్ లో రియల్ మీ ఈ రెండు ఫోన్లను లాంఛ్ చేసింది. రియల్ మీ నార్జో 30 5జీ మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ చేత పనిచేస్తే, రియల్ మీ నార్జో 30 మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్ పనిచేస్తుంది. రెండు ఫోన్ లకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి.
రియల్ మీ నార్జో 30 5జీ 6 జీబి ర్యామ్ + 128 జీబి స్టోరేజ్ ధర రూ.15,999. మరోవైపు రియల్ మీ నార్జో 30 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.12,499, 6 జీబి ర్యామ్ + 128 జీబి స్టోరేజ్ మోడల్ ధర రూ.14,499గా ఉంది. ఈ రెండు రేసింగ్ బ్లూ, రేసింగ్ సిల్వర్ రంగులలో లభిస్తాయి. నార్జో 30 5జీ మొదటి సేల్ జూన్ 30న జరుగుతుంది. అదే రోజున కొన్నవారికి రూ.500 డిస్కౌంట్(రూ.15,499) లభిస్తుంది. అలాగే, రియల్ మీ నార్జో 30 జూన్ 29న అమ్మకానికి రానుంది. మొదటి రోజు కొంటే 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ మోడల్ పై కూడా రూ.500 తగ్గింపు(రూ. 11,999 సమర్థవంతమైన ధర) లభిస్తుంది. రెండు ఫోన్ లు ఫ్లిప్ కార్ట్, రియల్ మీ.కామ్, ఆఫ్ లైన్ స్టోర్లలో లభ్యం అవుతాయి.
రియల్ మీ నార్జో 30 5జీ ఫీచర్స్:
- 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి+ డిస్ ప్లే
- ఆండ్రాయిడ్ 11 ఓఎస్(రియల్ మీ యుఐ 2.0)
- ఆక్టా కోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్
- 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ (ఎఫ్/1.8 అపెర్చర్)
- 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ (ఎఫ్/2.4 అపెర్చర్)
- 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ (ఎఫ్/2.4 అపెర్చర్)
- 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా (ఎఫ్/2.1 అపెర్చర్)
- సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
- 18 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
రియల్ మీ నార్జో 30 ఫీచర్స్:
- 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి+ డిస్ ప్లే
- ఆండ్రాయిడ్ 11 ఓఎస్(రియల్ మీ యుఐ 2.0)
- ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్
- 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్
- 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్
- 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్
- 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా (సోనీ ఐఎంఎక్స్471 సెన్సార్)
- సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
- 30 డబ్ల్యు డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
చదవండి: సెప్టెంబర్ 10న మార్కెట్లోకి రిలయన్స్ జియో చౌకైన స్మార్ట్ ఫోన్
Comments
Please login to add a commentAdd a comment