లావా కొత్త ఐరిస్ ఫోన్
ఐరిస్ ఫ్యూయల్ 60@ రూ.8,888
అధిక బ్యాటరీ లైఫ్ ఈ మొబైల్ ప్రత్యేకత...
ఆండ్రాయిడ్ లాలిపాప్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు
న్యూఢిల్లీ నుంచి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధి: దేశీయ మొబైల్ కంపెనీ లావా ఐరిస్ సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్-ఐరిస్ ఫ్యూయల్ 60ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది.పదే పదే చార్జింగ్ చేయకుండానే ఎక్కువ గంటల పాటు ఈ ఫోన్‌ను వాడుకోవచ్చని లావా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ (ప్రోడక్ట్) నవీన్ చావ్లా చెప్పారు. ఈ డివైస్ ధర రూ.8,888 అని పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్లు రోజువారీ దినచర్యలో ఒక భాగం అయ్యాయని, అయితే బ్యాటరీ లైఫ్ ఆందోళన కలిగించే అంశమని తెలిపారు.
ఈ సమస్యను నివారించడానికి ఐరిస్ ఫ్యూయల్ 60ను అందిస్తున్నామని వివరించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3 గిగాహెర్ట్స్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 10 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుందని, ఆండ్రాయిడ్‌లో తాజా వెర్షన్ అయిన లాలిపాప్ ఓఎస్‌కు ఈ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని వివరించారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 32 గంటల టాక్‌టైమ్(2జీ) వస్తుందని పేర్కొన్నారు.
క్విక్ చార్జ్ టెక్నాలజీతో ఈ ఫోన్‌ను రూపొందించామని, దీంతో చార్జింగ్ టైమ్ 3గంటల 15 నిమిషాలకు తగ్గిందని వివరించారు. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లో విడి భాగాలను ఒకదానినొకటి అనుసంధానం చేయడానికి సోల్డరింగ్ చేస్తారని, కానీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో సోల్డరింగ్‌తో కాకుండా కనెక్టర్స్ ద్వారా ప్రతి విడిభాగాన్ని పీసీబీఏ(ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లి)కు అనుసంధానం చేశామని పేర్కొన్నారు. ఫలితంగా లోపాలు తక్కువగా ఉంటాయని, రిపేర్లు సులభంగా చేయవచ్చని వివరించారు.