కొత్త బ్యాటరీలు.. 50 ఏళ్లు పనిచేస్తాయ్..!
ఎలక్ట్రానిక్ పరికరాలకు ఉపయోగించే బ్యాటరీల జీవితకాలాన్ని గణనీయంగా పెంచేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీని కనుగొన్నారు. ప్రస్తుతం గుండె పనితీరును మెరుగుపర్చేందుకు ఉపయోగించే పేస్‌మేకర్ల వంటివాటికి అమర్చే బ్యాటరీలు గరిష్టంగా పదేళ్ల వరకూ పనిచేస్తున్నాయి. అందువల్ల పదేళ్లకోసారి ఆపరేషన్ చేసి కొత్త బ్యాటరీలను అమర్చాల్సి వస్తోంది.
ఈ కొత్త బ్యాటరీలను పేస్‌మేకర్లకు అమరిస్తే గనక.. 30-50 ఏళ్ల వరకూ పనిచేస్తాయని ఓక్ రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఘన లిథియం థియోపాస్ఫేట్ ఎలక్ట్రోలైట్‌తో తయారు చేసిన ఈ లిథియం-కార్బన్ ఫ్లోరైడ్ బ్యాటరీలు ఇప్పుడున్నవాటి కన్నా 26 శాతం సమర్థంగా పనిచేస్తాయని అంటున్నారు. ఈ కొత్త బ్యాటరీలోని ఎలక్ట్రోలైట్.. అయాన్ల రవాణాకు మాత్రమే కాకుండా క్యాథోడ్‌ల సరఫరాకూ ఉపయోగపడుతుందని, అందువల్ల బ్యాటరీల జీవితకాలం గణనీయంగా పెరుగుతుందని చెబుతున్నారు.