బ్లాక్ బెర్రీ తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ‘ప్రివ్’ | BlackBerry Priv Android Phone Launched in India | Sakshi
Sakshi News home page

బ్లాక్ బెర్రీ తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ‘ప్రివ్’

Published Fri, Jan 29 2016 2:04 AM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

బ్లాక్ బెర్రీ తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ‘ప్రివ్’ - Sakshi

బ్లాక్ బెర్రీ తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ‘ప్రివ్’

న్యూఢిల్లీ: కెనడాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ తొలిసారిగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై(ఓఎస్) పనిచేసే స్మార్ట్‌ఫోన్ ‘ప్రివ్’ను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.62,990. లాలీపాప్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.4 అంగుళాల తెర, 1.8 గిగాహెర్ట్జ్ హెక్జా కోర్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, సింగిల్ సిమ్, 4జీ, 18 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,410 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

 ‘ప్రివ్’ స్మార్ట్‌ఫోన్లు జనవరి 30 నుంచి అమెజాన్‌లో, బ్లాక్‌బెర్రీ అధికారిక భాగస్వాముల ఔట్‌లెట్స్, స్టోర్లలో అందుబాటులో ఉంటాయని, ఈ మొబైల్ వినియోగదారుల సమాచార భద్రతకు ఎలాంటి ప్రమాదం ఉండదని బ్లాక్‌బెర్రీ ఇండియా ఎండీ నరేంద్ర నాయక్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement