వరల్డ్ మోస్ట్ సెక్యుర్ స్మార్ట్ఫోన్ ఇదేనట!
ప్రపంచంలో అత్యంత సురక్షితమైన స్మార్ట్ఫోన్ను బ్లాక్ బెర్రీ ఆవిష్కరించింది. "డీటీఈకే 50" పేరుతో ఈ నూతన స్మార్ట్ ఫోన్ను బ్లాక్ బెర్రీ తీసుకొచ్చింది. దీని ధర అమెరికా మార్కెట్లో 299 డాలర్లు(దాదాపు 20,000). ఆగస్టు 8 నుంచి ఈ ఫోన్ షిప్పింగ్ ప్రారంభించబోతున్నట్టు కంపెనీ వెల్లడించింది. ప్రపంచంలో ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అన్నింటిలో కెల్లా ఈ ఫోనే అత్యంత సురక్షితమైనదని బ్లాక్ బెర్రీ చెబుతోంది. ఈ ఫోన్ ప్రీబుకింగ్స్ ను యూఎస్, కెనడా, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్ లో తన ఆన్లైన్ సైటులో అందుబాటులో ఉంచింది. అయితే ఇండియన్ బ్లాక్ బెర్రీ ఫ్యాన్స్ ఈ ఫోన్ కోసం మరికొన్ని నెలలు వేచిచూడాల్సి ఉందని కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ రూ.25,000కు లాంచ్ కావొచ్చని తెలుస్తోంది. మల్టిఫుల్ సెక్యురిటీ ఫీచర్లను కంపెనీ ఈ ఫోన్లో పొందుపర్చింది. ఫుల్ డిస్క్ ఎన్ క్రిప్షన్, మాల్వేర్ ప్రొటెక్షన్, సెక్యుర్ బూట్, వాచ్డాక్స్, బిజినెస్-క్లాస్ ఈమెయిల్, కొలాబోరేషన్ టూల్స్, సెక్యుర్ వాయిస్, మెసేజింగ్ ఎన్క్రిప్టడ్కి ఐఎమ్, బీబీఎమ్ ప్రొటక్షన్ ఈ ఫోన్లో పొందుపర్చిన సెక్యురిటీ ఫీచర్లు.
ఈ ఫోన్ ప్రత్యేకతలేమిటో ఓసారి చూద్దాం..
5.2 అంగుళాల స్క్రాచ్ రెసిస్టెంట్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే
క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 617 ఆక్టా కోర్ ప్రాసెసర్
3జీబీ ర్యామ్
16జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్
2టీబీ విస్తరణ మెమరీ
ఆండ్రాయిడ్ 5.0 మార్ష్మాలో
13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా విత్ పీడీఏఎఫ్
డ్యూయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాస్
8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్
2610 ఎంఏహెచ్, ఫాస్ట్ చార్జింగ్