బెంగళూరు: పర్సనల్ కంప్యూటర్లు తయారుచేసే లెనోవో కంపెనీ కొత్త రేంజ్ గేమింగ్ పీసీలను సోమవారం విడుదల చేసింది. వీటి ధరలు రూ.50,990 నుంచి రూ.1,36,500 రేంజ్‌లో ఉన్నాయని లెనోవో ఇండియా డెరైక్టర్(కన్సూమర్) శైలేంద్ర కత్యాల్ పేర్కొన్నారు. ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో తయారైన ఈ గేమింగ్ పీసీలు విండోస్ 8 ఓఎస్‌పై పనిచేస్తాయని తెలిపారు. లెనోవో ఐడియా ప్యాడ్ జడ్ 510 ధర రూ.50,990, లెనొవొ ఐడియా ప్యాడ్ వై 510పి ధర రూ.69,990, లెనోవో ఐడియా సెంటర్ హొరైజన్ 27 ధర రూ.1,36,500 అని వివరించారు.