మోటరోలా కొత్త వర్షన్ మడత ఫోన్లు త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. ఈ ఏడాదిలోనే మోటరోలా రేజర్ (Motorola Razr) ఫోల్డబుల్ కొత్త వర్షన్ ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు లెనోవో సీఈవో యువాన్‌కింగ్ యాంగ్ తెలిపారు. దశాబ్దాల క్రితం బాగా పాపులరైన మడత ఫోన్ మోడళ్లు ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో మళ్లీ ఆదరణ పొందుతున్నాయి. 2000 సంవత్సరంలో మోటరోలా రేజర్ మడత ఫోన్ బాగా పాపులర్ అయిన ఫోన్లలో ఒకటి. మోటరోలా సంస్థను గూగుల్ నుంచి 2014లో లెనోవో సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా సీఎన్‌బీసీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లెనోవో సీఈవో యువాన్‌కింగ్ యాంగ్ మోటరోలా రేజర్ ఫోన్ గురించి మాట్లాడారు. కొత్త వర్షన్ మడత ఫోన్‌ను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించిన వివరాలను ఎక్కువగా ప్రస్తావించని ఆయన ఆ ఫోన్‌లో అప్లికేషన్‌లు, ఇతర ఫీచర్లు మాత్రం అందరికీ నచ్చేలా ఉంటాయన్నారు. ఫోల్డబుల్ ఫోన్ల ధరలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో తగ్గుతాయని పేర్కొన్నారు.
చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో ట్రావెల్ క్రెడిట్ కార్డ్!
కాగా ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో మోటరోలా తన ‘రోలబుల్’ కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా ప్రదర్శించింది. ఇందులో రోల్ అప్ డిస్‌ప్లే ఉంటుంది. అంటే ఫోన్ డిస్‌ప్లేను కింది నుంచి పైకి జరపవచ్చన్న మాట.
చదవండి: WTW Report: పెరగనున్న జీతాలు.. ఆసియా-పసిఫిక్‌లో భారత్ టాప్!
Comments
Please login to add a commentAdd a comment