సాక్షి,ముంబై: లెనోవో కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ ఎం9 పేరుతో భారీ మార్కెట్లో కొత్త టాబ్లెట్‌ను లాంచ్ చేసింది. దీని ధరను రూ. 12,999తోగా నిర్ణయించింది. మార్కెట్‌లో ఉన్న అత్యంత తేలికైన టి టాబ్లెట్‌లలో ఎమ్9 ఒకటని కంపెనీ ప్రకటించింది. LTE, Wi-Fi ఓన్లీ ఇలా రెండు వేరియంట్లలో, అలాగే ఫ్రాస్ట్ బ్లూ , స్టార్మ్ గ్రే రంగులలో లెనోవో సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ లభించనుంది. (వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు)
9 అంగుళాల IPS LCD డిస్‌ప్లే , 1,340 x 800 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 12, డాల్బీ అట్మాస్ సపోర్ట్ , MediaTek Helio G80 ఆక్టా-కోర్ ప్రాసెసర్,గరిష్టంగా 64జీబీ స్టోరేజ్,8 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,100mAh బ్యాటరీ(10W ఛార్జింగ్ సపోర్ట్) గరిష్టంగా 13 గంటల వీడియో ప్లేబ్యాక్ బ్యాటరీ లైఫ్ ,ఫేస్-అన్‌లాక్ లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. డ్యూయల్-టోన్ మెటల్ ఛాసిస్ 344 గ్రాముల బరువుతో తీసుకొచ్చిన పట్టుకోవడానికి ఎం9 సౌకర్యంగా ఉంటుంది.
జూన్ 1 నుండి రూ. 12,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది. కస్టమర్‌లు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తోపాటు, రిలయన్స్ డిజిటల్, క్రోమా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చు. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్)
ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, అప్‌డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్
Comments
Please login to add a commentAdd a comment