
న్యూఢిల్లీ: చైనా టెక్నాలజీ దిగ్గజం లెనొవొ కంపెనీ మూడు స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లోకి తెచ్చింది. లెనొవొ ఏ6నోట్, లెనొవొ కే10 నోట్, లెనొవొ జడ్6 ప్రొలను అందుబాటులోకి తెచ్చా మని లెనొవొ ఇండియా తెలిపింది. ఏ6 నోట్ ధర రూ.7,999 అని లెనొవొ ఇండియా ఎమ్‌డీ ప్రశాంత్ మణి చెప్పారు. కే10 నోట్‌లో 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఫోన్ ధర రూ.13,999 అని, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.15,999 అని పేర్కొన్నారు. ఇక జడ్6 ప్రొలో 8 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999 అని వివరించారు.
5–7% వృద్ధి: ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 5–7%రేంజ్‌లో పెరగగలవని అంచనాలున్నాయని ఎమ్‌డీ ప్రశాంత్ మణి చెప్పారు. కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ద్వారా భారత్‌లో మొబైల్ ఫోన్ల తయారీ చేపట్టామని, భారత్ నుంచి ఎగుమతులూ మొదలు పెట్టామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment