
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లెనోవో త్వరలోనే భారీ ర్యామ్ స్టోరేజ్‌తో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లెనోవో Legion Y90 గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. ఇప్పటివరకు వచ్చినా స్మార్ట్‌ఫోన్స్‌లో లెనోవో Legion Y90 ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచే అవకాశంలేకపోలేదని స్మార్ట్‌ఫోన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పవర్‌ఫుల్ ర్యామ్..ఏకంగా 22జీబీ..!
లెనోవో Legion Y90 స్మార్ట్‌ఫోన్ క్వాలకం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్‌తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ విబోలో వైరల్‌గా మారాయి. వచ్చే నెల ఫిబ్రవరిలో లెనోవో Legion Y90 స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 22GB RAMతో రానుంది. ఈ ర్యామ్ 18GB ఫిజికల్ ర్యామ్‌తో పాటు 4GB వర్చువల్ ర్యామ్‌ను కలిగి ఉండనుంది. 512GB +128GB రెండు విభిన్న ఇంటర్నల్ స్టోరేజ్‌తో మొత్తంగా 640 జీబీతో లెనోవో లీజియన్ Y90 రానుంది.
Lenovo Legion Y90 స్పెసిఫికేషన్(అంచనా)
- 6.92-అంగుళాల E4 శాంసంగ్ AMOLED డిస్‌ప్లే
- క్వాలకం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్
- 22 జీబీ ర్యామ్+ 640 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 64ఎంపీ+16ఎంపీ రియర్ కెమెరా
- 44-ఎంపీ సెల్ఫీ కెమెరా
- ఫ్రాస్ట్ బ్లేడ్ 3.0 డ్యూయల్ ఫ్యాన్స్ ఫర్ కూలింగ్
- 68W ఫాస్ట్ ఛార్జింగ్
- 5,600mAh బ్యాటరీ
చదవండి: షార్ట్‌ఫిల్మ్ మేకర్లకు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే గుడ్‌న్యూస్..!