
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో తన రెనో 3 ప్రో మొబైల్ ధరలను తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లపైనా ధరల కోతను ప్రకటించింది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ పై 2,000, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరపై 3వేల రూపాయల తగ్గింపును ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఒప్పో రెనో 3 ప్రో ను మార్చిలో ఇండియాలో తీసుకొచ్చింది. వీటి ధరలను 29,990 (128 జీబీ వేరియంట్) గాను, 256 జీబీ వేరియంట్‌కు 32,990 రూపాయలుగా నిర్ణయించింది. అయితే జీఎస్టీ కారణంగా బేస్ వేరియంట్ ధరను ఏప్రిల్ లో రెండు వేల రూపాయల మేర పెంచింది. దాదాపు మూడు నెలల తరువాత తాజా తగ్గింపుతో ఒప్పో రెనో 3 ప్రో ఫోన్లు వరుసగా 27,990, 29,990 రూపాయలకు లభించనున్నాయి.
ఒప్పో రెనో 3 ప్రో స్పెసిఫికేషన్లు
6.4 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 10 , 1,080x2,400 రిజల్యూషన్
64+13+8+2ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా
44+2 ఎంపీ సెల్ఫీ కెమెరా
4025 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment