be carefull
-
డేంజర్.. మీరు ఏం చేస్తున్నా అవతలి వ్యక్తికి కనిపిస్తుంది..
ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): ఎనీ డెస్క్.. టీం వీవర్.. లాంటి డెస్క్ టాప్ యాప్‌లను మీ ఫోన్లో అపరిచిత వ్యక్తులు డౌన్లోడ్ చేయిస్తే నష్టపోయే పరిస్థితి ఉంది. అవతలి వ్యక్తి చెబుతున్న విధంగానే అన్నింటికీ మీరు క్లిక్ చేస్తూ పోతే మీకు తెలియకుండానే మీ ఫోన్ అవతలి వ్యక్తి కంట్రోల్లోకి వెళ్లిపోతుంది. మీరు ఏం చేస్తున్నా అవతలి వ్యక్తికి కనిపిస్తుంది. ఉదాహరణకు.. మీరు ఫోన్ పే, యూట్యూబ్, బ్యాంకింగ్ యాప్ వంటివి మీ ఫోన్లో ఏం తెరిచినా అన్నీ అవతలి వ్యక్తికి కనిపిస్తాయి. చదవండి: మీకు తెలుసా?.. విద్యుత్ శాఖ నుంచి మెసేజ్‌లు రావు దీంతో మీ బ్యాంక్ అకౌంట్, ఫోన్ పే అకౌంట్ పాస్వర్డ్లు, ఓటీపీలు వారికి తెలుస్తాయి. తరువాత ఆయా అకౌంట్స్‌లో నగదును సులువుగా స్వాహా చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ వచ్చే సందేశాలు, మెసేజ్ లింక్‌లను పట్టించుకోకూడదు. విద్యుత్ బకాయిలు, ఈకేవైసీ పూర్తి, బ్యాంకు అనుసంధానం వంటి సేవల కోసం యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను కూడా నమ్మొద్దు. -
వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్లో పడ్డట్టే!
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): మనం రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో వివిధ వస్తువులను వినియోగిస్తుంటాం. వాటిని ఎంత కాలం ఉపయోగించాలనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. దీంతో ఎక్కువ కాలం వినియోగిస్తూనే ఉంటాం. కాలపరిమితి ముగిసిన వాటిని వాడితే ప్రమాదం పొంచి ఉంది. వీటితో పాటు వాడుకలో లేని వస్తువులను ఇంట్లోనే కుప్పలుగా వదిలేస్తుంటారు. వాటిల్లోనూ క్రిములు, బ్యాక్టీరియా వృద్ధి చెంది.. మనకు అనారోగ్య సమస్యలు తెచ్చి పెడతాయి. అలాంటి వాటిని సరైన సమయంలో మార్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేవగానే పళ్లను శుభ్రం చేసుకునే బ్రష్ నుంచి రాత్రి పడుకునేందుకు వినియోగించే తలదిండు వరకు ఎలా ఉపయోగించాలి.. ఎప్పుడు మార్చాలి అనే విషయాలు తెలుసుకుందాం. చదవండి: నిజంగా ఏలియన్ల గుట్టు సముద్రాల్లో ఉందా? రెండింటి మధ్య లింకేంటి? మంచినీటి సీసా ఇంట్లో వినియోగించే మంచి నీళ్ల సీసాలు, వాటర్ క్యాన్ల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తరచూ వాటిని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే అడుగు భాగంలో నాచు పట్టే వీలుంటుంది. మంచినీటి సీసాలను మాత్రం మూడు, నాలుగు నెలలకోసారి మార్చాలి. వీటితో పాటు మార్కెట్లో అప్పటికప్పుడు తాగేందుకు కొనుగోలు చేసే నీటి సీసాలను తిరిగి ఇంట్లో వాడడం హానికరం. పొపుల పెట్టె వంటింట్లో పప్పు దినుసులు వేసే డబ్బాలను తరచూ శుభ్రం చేసుకోవాలి. ఓ సారి వేసిన సరకు అయిపోగానే..డబ్బాలను మళ్లీ శుభ్రం చేసుకుని కొత్త సరకు వేసుకోవాలి. అంతేగాని నీటితో శుభ్రం చేయకుండా అలా ఏడాది పొడవునా సరకులు వేస్తూ ఉండకూడదు. అలా వేస్తే అందులో ఉండే కొన్ని బ్యాక్టీరియాలు సరకుల్లో చేరే వీలుంటుంది. వీలైతే ఏడాదికోసారి డబ్బాలను మార్చి కొత్తవి ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంట్లో పెంచుకునే మొక్కలు ఇంట్లోని కుండీల్లో పెంచుకునే మొక్కల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుండీల్లో చెత్త వేయకూడదు. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. లేకపోతే దోమలు వృద్ధి చెందే వీలుంటుంది. సాక్స్‌లు, దువ్వెన కాళ్లకు ధరించే సాక్స్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కాలపరిమితి ముగిసిన వెంటనే పాతవాటిని మార్చి..కొత్తవి ఉపయోగించాలి. ఇంట్లో పాడైన చెప్పులు, బూట్లను బయట పారేయాలి. లేకపోతే క్రిములు వృద్ధి చెందే వీలుంటుంది. నిత్యం తల దువ్వేందుకు వినియోగించే దువ్వెన విషయంలోనూ శుభ్రత పాటించాలి. పాడైన, పళ్లు సరిగా లేని దువ్వెనను వినియోగించకూడదు. టూత్‌బ్రష్ ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వినియోగించే టూత్ బ్రష్‌ను తప్పనిసరిగా ప్రతి మూడు నుంచి నాలుగు నెలల్లోపు మార్చాలి. బ్రష్ పాడవకపోయినా.. దానిని ఎక్కువ కాలం వినియోగిస్తే..పళ్లకు ఇబ్బంది కలగొచ్చు. చిన్న పిల్లల బ్రష్‌ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బ్రష్‌పై ఉండే కుచ్చు పాడైన వెంటనే కాలంతో సంబంధం లేకుండా మార్చేయాలి. పాడైన బ్రష్‌లతో కొందరు ఇంట్లోని వస్తువులను శుభ్రం చేస్తుంటారు. అలాంటి వాటిల్లోనూ క్రిములు చేరే వీలుంటుంది. అందుకే వినియోగంలో లేని వాటిని బయట పాడేయాలి. తలదిండులు చాలా మంది ఇంట్లో మంచాలపై ఉండే దుప్పట్లు, దిండుకవర్లను మాత్రమే సకాలంలో శుభ్రం చేస్తూ.. అప్పుడప్పుడు కొత్తవి మార్చుతుంటారు. కానీ దిండ్లను మార్చరు. నిత్యం వినియోగించే దిండ్లపై సూక్ష్మక్రిములు వేగంగా వృద్ధి చెందుతాయి. అవి మన తలలోకి చేరడంతో దురద, ఇతర సమస్యలు వస్తాయి. అందుకే కొంతకాలం వాడిన తర్వాత వాటిని మార్చుకోవాలి. లోదుస్తులు మనం ధరించే లోదుస్తులను క్రమం తప్పకుండా ఉతికి ఆరేసిన తర్వాతే ధరించాలి. వీలైతే వేడి నీటితో శుభ్రం చేసుకోవడం ఉత్తమం. అలా చేయని పక్షంలో కనీసం ఇస్త్రీ అయినా చేసి ధరించాలి. అప్పుడే వాటిల్లో ఉండే క్రిములు చనిపోతాయి. లోదుస్తుల్లో క్రిములు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. వాటితో మనకు తామర, గజ్జి వంటి చర్మ వ్యాధులు సోకే వీలుంటుంది. పాడవకపోయినా.. లోదుస్తులను కూడా ఏడాదికోసారి మార్చేయడం మంచిది. -
బీ కేర్‌ఫుల్ 12th Dec 2019
-
లొట్టలేస్తున్నారా.. జర జాగ్రత్త!
ఏలూరు (మెట్రో) : ఫాస్ట్‌ఫుడ్ సెంటర్.. జిల్లాలోని ఏ గల్లీలో చూసినా ఇవే దర్శనమిస్తున్నాయి. పట్టణాలు, పలెల్లు తేడా లేకుండా ప్రతి ముఖ్యకూడలిలోనూ ఒకటి నుంచి నాలుగైదు వరకు దర్శనమిస్తున్నాయి. దీంతో యువత వీటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో సుమారు 200 వరకూ పాస్ట్‌ఫుడ్ సెంటర్లు, జిల్లావ్యాప్తంగా వేలల్లో ఉన్నాయి. మున్సిపల్ కేంద్రాల్లోనూ, చిన్న పంచాయతీల్లోనూ పాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. వీటికి తోడు ఇటీవల మొబైల్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఇష్టం వచ్చిన రీతిలో పుట్టుకొస్తున్నాయి. హైస్కూల్ పిల్లలు, యువతీ, యువకులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఫాస్ట్‌ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నారు. బ్యాచిలర్స్ వీటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ప్రజల ఆదరణ చూసి ఫుడ్ కోర్టులు ఏ వీధిలో చూసినా దర్శనమిస్తున్నాయి. ప్రతి సంవత్సరం 20 నుండి 40 శాతం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు పెరుగుతూ వస్తున్నాయి. చిన్నారుల్లో స్థూలకాయం చిన్నారులు చిరుతిళ్లుపై ఎక్కువగా ఆధారపడుతుంటే కచ్చితంగా ఒబిసిటీ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తినాలని సూచిస్తున్నా వాటిని పెడచెవిన పెడుతున్నారు. అదే విధంగా జంక్‌ఫుడ్ మార్కెట్ విస్తరించడం కూడా శుభపరిమాణం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది రాబోయే అనారోగ్యానికి హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్లు, పాన్‌పరాగ్ వంటివి ఆరోగ్యాన్ని కుళ్లబొడిచినట్లే జంక్ఫుడ్స్ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. మధుమేహం, గుండె రక్తనాళాల వ్యాధులకు జంక్‌ఫుడ్ కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఆహార తనిఖీ శాఖ నిర్లక్ష్యమూ అంతే ఆహార తనిఖీ శాఖ నిర్లక్ష్యం కూడా ఈ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు పెరగడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. కనీసం వీటిపై ఏ మాత్రం దాడులు చేయకపోవడంతో ఈ సెంటర్లలో కల్తీలు చేసినా ప్రశ్నించే నాథుడే లేకుండా పోతున్నాడు. ఫాస్ట్‌ఫుడ్ వినియోగం ఇలా 10–15 సంవత్సరాల లోపు వారు 85 శాతం ఉంటే, 16–20 సంవత్సరాల లోపు 65 శాతం, 21–25 సంవత్సరాల లోపు వారు 55శాతం, 26–35 సంవత్సరాల లోపు వారు 45 శాతం, 36–45 సంవత్సరాల లోపు వారు 25 శాతం, 46–50 సంవత్సరాల లోపు వారు 20 శాతం ఈ జంక్‌ఫుడ్స్‌పై అధికాసక్తి చూపిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులు ఫాస్ట్‌ఫుడ్ వాడకాన్ని నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మూడు రకాల సిఫార్సులు చేసింది. పండ్లు, కూరగాయలు ధరలు తగ్గేలా... ఫాస్ట్‌ఫుడ్ ధరలు పెరిగేలా పన్నులు ఉండాలని పేర్కొంది. వీటిలో ఒకటి పండ్లు, కూరగాయల సాగుకు రాయితీలిచ్చి ప్రోత్సహించాలని పేర్కొంది. రెండో అంశం ఫాస్ట్ఫుడ్స్, కూల్‌డ్రింక్స్ ప్రచారాన్ని కట్టుదిట్టంగా కట్టడి చేయాలని పేర్కొంది. ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లు డబ్బాలపై మరింత స్పష్టమైన సమాచారంతో కూడిన లేబుల్స్ ఉండాలన్నది మూడో సూచన. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని సిగరెట్ ప్యాకెట్లపై ముద్రించినట్లే పాస్టుఫుడ్ సెంటర్లపైనా, ప్యాకెట్లపైనా ఇలాంటి హెచ్చరికలు ముద్రించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చెవికెక్కని వైద్యుల సూచన కాలానుగుణంగా లభించే పండ్లు తింటే రోగాలు దరిచేరవని ఫిజ్జా, బర్గర్లు, రోడ్లపై దొరికే ఫాస్ట్ఫుడ్స్ కొలెస్ట్రాల్ పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఆహారంలో పీచుపదార్థం లేకపోవడంతో మలబద్ధకం, కారం, మసాలాలు ఎక్కువగా ఉండటంలో ఎసిడిటీ పెరుగుతోంది. వీటన్నింటి నుంచి బయటపడాలంటే సంప్రదాయ వంటకాల గొప్పదనాన్ని, అవి ఇచ్చే ఆరోగ్యాన్ని నేటి తరానికి తెలపాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. చికిత్స కన్నా నివారణే మేలు జబ్బు చేసిన తరువాత చికిత్స పొందటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు. ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్స్ అంటే పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తినేస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌లో వాడే రంగులు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. బయట ఫాస్ట్ఫుడ్స్లో లభించే ఆహారం వల్ల అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మానసిక రుగ్మతలు, గురక వంటి సమస్యలు వస్తాయి. ప్రస్తుతం పిల్లలు బయట ఆ టలకు దూరం అయ్యారు. ఇంట్లో టీవీ చూస్తూ గడపడం, వీడియోగేమ్స్, స్మార్ట్ఫోన్లతో కాలం గడిపేస్తున్నారు. దీంతో చిన్నవయసులోనే ఊబకాయులుగా మారుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్ తినడం తగ్గిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. – డాక్టర్ ప్రవీణ్‌కుమార్, ప్రభుత్వ వైద్యులు -
కొత్త చట్టం వచ్చింది..రేషన్ డీలర్లు జాగ్రత్త
నెల్లూరు(అర్బన్): పౌర సరఫరాలకు సంబంధించి ప్రభుత్వం గత నెల 11న పాత చట్టం స్థానంలో కంట్రోలర్ ఆర్డర్– 2018 అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని జేసీ వెట్రి సెల్వి తెలిపారు. కొత్తచట్టం ప్రకారం రేషన్ డీలర్లు ఏ మాత్రం మోసాలకు పాల్పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో రేషన్ డీలర్లకు కంట్రోలర్ ఆర్డర్–2018పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ డీలర్లు తూకాల్లో మోసాలకు పాల్పడినా..సకాలంలో డీడీలు చెల్లించకపోయినా..రేషన్ దుకాణాన్ని సమయం ప్రకారం తీయకపోయినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. గతంలో 6(ఏ) కేసులు నమోదు చేసేవారని, కొత్త చట్టం ప్రకారం 420 కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉందన్నారు. అందువల్ల డీలర్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. ఈపాస్ యంత్రంలో వేలిముద్రలు పడని లబ్ధిదారులకు ఐరిష్ ద్వారా సరకులు ఇవ్వాలని సూచించారు. ఐరిష్ పని చేయని చోట 15వ తేదీ తరువాత మూడ్రోజుల పాటు వీఆర్వో ద్వారా సరుకులు ఇవ్వాలన్నా రు. వరికుంటపాడు, దుత్తలూరు, ఉదయగిరి, సీతారామపురం, తడ, కొండాపురం, గూడూరు, అనంతసాగరం, రాపూరు, తదితర మండలాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగా లేదన్నారు. రేషన్ సరకులు ఇచ్చిన తరువాత పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లాలోని లక్షమందికి ఫోన్ చేసి సరుకులు సక్రమంగా ఇస్తున్నారా.. తూకాల్లో మోసాలు చేస్తున్నారా.. ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయానే వివరాలు సేకరిస్తున్నారన్నారు. అందువల్ల డీలర్లు జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన వారిని నూతన ఓటర్లుగా చేర్పించేందుకు సహకారించాలని కోరారు. అనంతరం ప్రజాపంపిణీలో 100 శాతం మించి సరుకులు అందించిన ఐదుగురు డీలర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల రేషన్ డీలర్లు, డీఎస్ఓ, ఏఎస్ఓ, డిప్యూటీ తహసీల్దార్లు,తదితరులు పాల్గొన్నారు. -
క్యాంపస్‌లలో కొలువుల కాలం
ఇదే అసలైన పరీక్ష విజయం సాధిస్తే నవ లోకమే బీకేర్‌ఫుల్...ఇలా ప్రిపేరవ్వండి బాలాజీచెరువు (కాకినాడ) : క్యాంపస్ ఇంటర్వూ్యలకు సమయం ఆసన్నమైంది. ఎక్కువగా డిసెంబర్, జనవరి నెలల్లోనే వివిధ సంస్థల ప్రతినిధులు కళాశాలలకు వచ్చి క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహించి, తమకు అవసరమైన విద్యార్థులను ఎంపిక చేసుకుంటారు. జిల్లాలో 32 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా వాటిలో ప్రతి ఏటా 12 వేల మంది ప్రవేశాలు పొందుతున్నారు. వీరిలో కేవలం 60 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించి బయటకు వస్తున్నారు. కళాశాలల్లో ఏటా ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నా...ఇవి తక్కువ సంఖ్యలోనే ఉంటున్నాయి. పోటీ ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు ఆషామాషీగా కాకుండా పక్కా ప్రణాళికతో ఇంటర్వూ్యలకు సిద్ధం కావాలి. ఇంజనీరింగ్ నాల్గో సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ ఇంటర్వూ్యలో కొలువు సాధిస్తేనే దానికి సార్థకత. లేకుంటే భవిష్యత్‌లో కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. మన దగ్గర నుంచి కంపెనీలు ఏం ఆశిస్తున్నాయో దానిపై ఆరా తీసి అందుకు అనుగుణంగా తయారుకావాలి. దుస్తుల ఎంపికలో జాగ్రత్తలు ఇంటర్వూ్యకు హాజరయ్యే అభ్యర్థులు డ్రెస్ కోడ్‌పై జాగ్రత్తలు పాటించాలి. అమ్మాయిలైతే హుందాగా కనిపించేందుకు చీరలు, సల్వార్లు ధరించవచ్చు. పాటియాలా, మిడ్డీ వంటి మోడ్ర¯ŒS డ్రస్సులు వద్దు. ఆకర్షణీయమైన రెజ్యూమ్ విద్యార్థి తనను తాను ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దుకునే రెజ్యూమ్ ఉద్యోగ ఎంపికలో ఎంతో కీలకం. కాపీ పేస్ట్ కాకుండా తనను తాను ఆవిష్కరించుకునే విధంగా ఉండాలి. అభిరుచులు, ఇష్టాఇష్టాలు అందులో నమోదు చేయాలి. ఇది ప్రధాన భూమికను పోషిస్తుంది. ఇంజనీరిం గ్ సబ్జెక్టులు, తాజా పరిణామాలపై కొత్త లాంగ్వేజీలను నేర్చుకోవాలి. ఎప్పటి కప్పుడు తన అప్డేట్స్ను రెజ్యూమ్‌లో పొందుపరచాలి. ఇంటర్వూ్యయే కీలకం నాలుగు సంవత్సరాల విద్యలో అత్యంత కీలక ఘట్టం ఇంటర్వూ్య. ఫలితాన్ని ఇచ్చే ఈ దశలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటర్వూ్య నిర్వహించే గదిలోకి వేళ్లే ముందు అనుమతి తీసుకుని వెళ్లాలి. వెళ్లగానే కూర్చోకుండా కరచాలనం చేయాలి. మీకు సంబంధించిన ఫైళ్లు, హ్యాండ్ బ్యాగు టేబుల్‌పై పెట్టొద్దు. చేతిలోనే ఉంచుకోవాలి లేదా పక్కన పెట్టుకోవాలి. ప్రశ్న పూర్తయిన వెంటనే సమాధానం చెప్పాలి. ఇంటర్వూ్య పూర్తయ్యే వరకూ నిటారుగా కూర్చోవాలి. సమాధానం ఏదో ఒకటి చెప్పడం కానీ, నాన్చడం గానీ చేయొద్దు. ముఖ్యంగా ఆలోచించే సమయంలో కాళ్లు కదపడం, గోళ్లు గిల్లడం, పెదవుల్ని, మీసాల్ని పళ్లతో కొరకడం వంటివి చేయరాదు. విద్యార్థులకు గొప్ప అవకాశం ఇంజనీరింగ్ చివరి సంవత్సర విద్యార్థులకు ఇదొక గొప్ప అవకాశం. డిసెంబర్, జనవరి మాసాల్లో ప్రాంగణ ఎంపికలు ఎక్కువగా జరుగుతాయి. ఎంపికలు నిర్వహించే సంస్థలకు అనుగుణంగా అభ్యర్థులు మారాల్సి ఉంటుంది. వారికి కావల్సిన అన్ని వనరులు తమ దగ్గర ఉన్నాయో లేవో చూసుకుని సన్నద్ధమవ్వాలి. పరిశ్రమల్లో కావల్సినన్ని కొలువులు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి విద్యార్థులు సిద్ధం ఉండాలి. – ఎస్.చంద్రశేఖర్, జేఎ¯ŒSటీయూకే ప్లేస్మెంట్ ఆఫీసర్ -
పిల్లలకు ‘ఆండ్రాయిడ్’ ఇస్తే పారాహుషార్
ఇంటర్నెట్లో చేటు తెచ్చే వెబ్ సైట్లెన్నో.. వాటి విషప్రభావంతో దుష్పరిణామాలు అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు గాంధీనగర్ (కాకినాడ) : రోజురోజుకీ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎందరో చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోనుతో కనిపిస్తున్నారు. ఇక నగరాల్లో ఉన్న కుటుంబాల్లో ఆండ్రాయిడ్ ఫోను లేని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. కొంత మంది తల్లిదండ్రులు చిన్నారులకు కూడా గేమ్‌లు ఆడడానికి ఫోన్లను ఇస్తున్నారు. కౌమార దశలో ఉన్న విద్యార్థులకు తల్లిదండ్రులే స్వయంగా ప్రత్యేక ఫోన్లను కొనిస్తున్నారు. ఇదిలా ఉంచితే ఫోన్ల వాడకం అన్ని వేళలా మంచిది కాదని మానసిక వైద్యులు చెబుతున్నారు. పదో తరగతి లోపు విద్యార్థులు, యుక్త వయసులో ఉన్న వారిపై ఈ ఫోన్లు చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని వారు వెల్లడిస్తున్నారు. ఎలా వాడుతున్నారో ఓ కన్నేయాలి.. పిల్లలకు కొత్తగా ఆండ్రాయిడ్ కొనివ్వాలనుకొంటున్నారా? అయితే ఒక నిమిషం ఆలోచించండి. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ పిల్లలు ఆ ఫోన్లతో ఏం చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఆ¯ŒSలై¯ŒSలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే అనేక రకాల అనవసర వెబ్సైట్లు ఓపె¯ŒS అవుతుంటాయి. అందులో మంచి కంటే చెడు విషయాలే ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమస్యలను అధిగమించడానికి ఉచితంగా లభించే అనేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని తమ ఫోన్లలో ఇ¯ŒSస్టాల్ చేసుకోవడం ద్వారా అనవసరమైన వెబ్సైట్లను అరికట్టేందుకు వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నియంత్రణకూ ఉంది ఓ యాప్.. ‘కిడ్స్ జో¯ŒS పేరెంటల్ కంట్రోల్’ అనే అప్లికేష¯ŒSతో తమ స్మార్ట్ఫోన్లను పిల్లలు వాడకుండా తల్లిదండ్రులు నియంత్రించవచ్చు. ఇది మంచి తాళంగా పనిచేస్తుంది. ఇందులో వేటినైతే మనం ఓపె¯ŒS చేయాలనుకుంటామో ముందుగానే నమోదు చేయాలి. దీంతో వేరే సైట్లు ఓపె¯ŒS కాకుండా ఉంటాయి. ఇంటర్నెట్ సౌకార్యాన్ని కూడా దీని ద్వారా ఆపేయవచ్చు. పిల్లలు తమకు తెలియకుండా యాప్స్ ఇ¯ŒSస్టాల్ లేదా గేమ్స్ డౌ¯ŒSలోడ్ చేసినా అవి యాక్టివేట్ అవ్వవు. అప్‌గ్రేడ్ వెర్ష¯ŒS ఇ¯ŒSస్టాల్ చేసుకొని ప్రొఫైల్స్ కూడా రూపొందించుకోవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌ¯ŒSలోడ్ చేసుకొని వినియోగించవచ్చు. వాడకం సమయాన్నీ పరిమితం చేయవచ్చు.. ‘స్క్రీ¯ŒS టైం’ అనే యాప్ ద్వారా సమయాన్ని పరిమితం చేసి పిల్లలు తక్కువ సమయమే ఫోను వినియోగించేలా చేయవచ్చు. పిల్లలకు ఫోను ఇచ్చే ముందు ఈ యాప్ ద్వారా నిర్ణీత సమయం నమోదు చేసి వారికి ఇవ్వాలి. ఇచ్చిన సమయం అయిపోగానే ఫోను దానంతట అదే ఆగిపోతుంది. ఫోనులో గేమ్స్ ఆడే పిల్లలకు ఈ యాప్ ద్వారా నిర్ణీత సమయాన్ని కేటాయించి ఇవ్వవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌ¯ŒSలోడ్ చేసుకొని వినియోగించవచ్చు.