- ఇదే అసలైన పరీక్ష
- విజయం సాధిస్తే నవ లోకమే
- బీకేర్‌ఫుల్...ఇలా ప్రిపేరవ్వండి
- నాలుగు సంవత్సరాల విద్యలో అత్యంత కీలక ఘట్టం ఇంటర్వూ్య. ఫలితాన్ని ఇచ్చే ఈ దశలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఇంటర్వూ్య నిర్వహించే గదిలోకి వేళ్లే ముందు అనుమతి తీసుకుని వెళ్లాలి. వెళ్లగానే కూర్చోకుండా కరచాలనం చేయాలి. మీకు సంబంధించిన ఫైళ్లు, హ్యాండ్ బ్యాగు టేబుల్‌పై పెట్టొద్దు. చేతిలోనే ఉంచుకోవాలి లేదా పక్కన పెట్టుకోవాలి.
- ప్రశ్న పూర్తయిన వెంటనే సమాధానం చెప్పాలి. ఇంటర్వూ్య పూర్తయ్యే వరకూ నిటారుగా కూర్చోవాలి. సమాధానం ఏదో
- ఒకటి చెప్పడం కానీ, నాన్చడం గానీ చేయొద్దు. ముఖ్యంగా ఆలోచించే సమయంలో కాళ్లు కదపడం,
- గోళ్లు గిల్లడం, పెదవుల్ని, మీసాల్ని పళ్లతో కొరకడం వంటివి చేయరాదు.
క్యాంపస్‌లలో కొలువుల కాలం
Published Mon, Dec 12 2016 11:30 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
బాలాజీచెరువు (కాకినాడ) :
క్యాంపస్ ఇంటర్వూ్యలకు సమయం ఆసన్నమైంది. ఎక్కువగా డిసెంబర్, జనవరి నెలల్లోనే వివిధ సంస్థల ప్రతినిధులు కళాశాలలకు వచ్చి క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహించి, తమకు అవసరమైన విద్యార్థులను ఎంపిక చేసుకుంటారు. జిల్లాలో 32 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా వాటిలో ప్రతి ఏటా 12 వేల మంది ప్రవేశాలు పొందుతున్నారు. వీరిలో కేవలం 60 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించి బయటకు వస్తున్నారు. కళాశాలల్లో ఏటా ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నా...ఇవి తక్కువ సంఖ్యలోనే ఉంటున్నాయి. పోటీ ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు ఆషామాషీగా కాకుండా పక్కా ప్రణాళికతో ఇంటర్వూ్యలకు సిద్ధం కావాలి. ఇంజనీరింగ్ నాల్గో సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ ఇంటర్వూ్యలో కొలువు సాధిస్తేనే దానికి సార్థకత. లేకుంటే భవిష్యత్‌లో కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. మన దగ్గర నుంచి కంపెనీలు ఏం ఆశిస్తున్నాయో దానిపై ఆరా తీసి అందుకు అనుగుణంగా తయారుకావాలి.
దుస్తుల ఎంపికలో జాగ్రత్తలు
ఇంటర్వూ్యకు హాజరయ్యే అభ్యర్థులు డ్రెస్ కోడ్‌పై జాగ్రత్తలు పాటించాలి.
అమ్మాయిలైతే హుందాగా కనిపించేందుకు చీరలు, సల్వార్‌లు ధరించవచ్చు. పాటియాలా, మిడ్డీ వంటి మోడ్ర¯ŒS డ్రస్సులు వద్దు.
ఆకర్షణీయమైన రెజ్యూమ్
విద్యార్థి తనను తాను ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దుకునే రెజ్యూమ్ ఉద్యోగ ఎంపికలో ఎంతో కీలకం. కాపీ పేస్ట్ కాకుండా తనను తాను ఆవిష్కరించుకునే విధంగా ఉండాలి. అభిరుచులు, ఇష్టాఇష్టాలు అందులో నమోదు చేయాలి. ఇది ప్రధాన భూమికను పోషిస్తుంది. ఇంజనీరిం గ్ సబ్జెక్టులు, తాజా పరిణామాలపై కొత్త లాంగ్వేజీలను నేర్చుకోవాలి. ఎప్పటి కప్పుడు తన అప్‌డేట్స్‌ను రెజ్యూమ్‌లో పొందుపరచాలి.
ఇంటర్వూ్యయే కీలకం
విద్యార్థులకు గొప్ప అవకాశం
ఇంజనీరింగ్ చివరి సంవత్సర విద్యార్థులకు ఇదొక గొప్ప అవకాశం. డిసెంబర్, జనవరి మాసాల్లో ప్రాంగణ ఎంపికలు ఎక్కువగా జరుగుతాయి. ఎంపికలు నిర్వహించే సంస్థలకు అనుగుణంగా అభ్యర్థులు మారాల్సి ఉంటుంది. వారికి కావల్సిన అన్ని వనరులు తమ దగ్గర ఉన్నాయో లేవో చూసుకుని సన్నద్ధమవ్వాలి. పరిశ్రమల్లో కావల్సినన్ని కొలువులు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి విద్యార్థులు సిద్ధం ఉండాలి.
– ఎస్.చంద్రశేఖర్,
జేఎ¯ŒSటీయూకే ప్లేస్‌మెంట్ ఆఫీసర్
Advertisement
Advertisement