campus in new jobs
-
ఎటు చూసినా జాబులే! 2రోజుల్లో క్యాంపస్ ఖాళీ..ప్లేస్మెంట్లో విద్యార్ధుల జాక్ పాట్!!
పెరిగిపోతున్నటెక్నాలజీ కారణంగా ఉద్యోగులు అవసరం రోజురోజుకీ పెరిగిపోతుంది. ముఖ్యంగా టెక్ కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న ప్రాజెక్ట్‌లు పూర్తి చేసేందుకు క్యాంపస్ ప్లేస్ మెంట్ నిర్వహించి ఊహించిన దానికంటే ఎక్కువ జీతాలిచ్చి మరి ఫ్రెషర్స్ ను ఎంపిక చేసుకుంటున్నాయి. ►తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగుళూరు (ఐఐఎం-బీ) రెండు రోజుల పాటు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూల్లో ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులు జాక్ పాట్ కొట్టారు. ఏకంగా 662 మంది విద్యార్ధులు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించినట్లు ఐఐఎం-బీ ప్రతినిధులు తెలిపారు. ►క్యాంపస్ సెలక్షన్లలో యాక్సెంచర్ కు 51, అమెజాన్31, బీసీజీ 30, కెర్నీలో 27 మంది విద్యార్ధులు ఉద్యోగం సంపాదించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉద్యోగం పొందడంలో 37 శాతం వృద్ధి సాధించారు. అందులో కన్సల్టింగ్, ప్రొడక్ట్ సంబంధిత రంగాలు ఉండగా..స్ట్రాటజీ కన్సల్టింగ్ విభాగంలో ఉద్యోగం చేసేందుకు విద్యార్ధులు మక్కువ చూపుతున్నారు. ఆ తర్వాత ప్రొడక్ట్ నిర్వహణ, ఫైనాన్స్ విభాగాలు ఉన్నాయి. ►కన్సల్టింగ్ కంపెనీలు 248 ఆఫర్లను అందించాయి. యాక్సెంచర్,బీసీజీ, కెర్నీ కాకుండా, బైన్ అండ్ కో 26, మెకిన్సే అండ్ కో 22 , ఎఫై9, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ 9, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 9, ల్వారెజ్ అండ్ మార్సల్ 7, ఆర్థర్ డీ. లిటిల్ 7 మంది ఆయా కంపెనీల్లో ఉద్యోగం సంపాదించారు. ►ఐటీ, ప్రొడక్ట్ డొమైన్లో మైక్రోసాఫ్ట్ 15, ఓయో 11 ఉద్యోగాలతో పాటు మిగిలిన కంపెనీల్లో 141 మంది ఉద్యోగం పొందగా అమాగి ల్యాబ్స్ 7, ఒరాకిల్ 7, అట్లాసియన్ 6, గూగుల్ 6, ఇన్ఫో ఎడ్జ్ 6, రేజర్‌పే 6కు మంది ఎంపికయ్యారు. ►అమెజాన్ 37, పేటీఎం 16, ఫ్లిప్‌కార్ట్ 6, మిత్రా 6తో పాటు ఇతర ఈకామర్స్ కంపెనీల్లో 65 మంది ఎంపిక కాగా ఫైనాన్స్ డొమైన్లో 71 ఆఫర్లను అందుకున్నారు. గోల్డ్‌మన్ సాచ్స్ గరిష్టంగా 22 ఆఫర్ అందుకోగా అవెండస్ క్యాపిటల్ 7, సిటీ బ్యాంక్ 5, డ్యుయిష్ బ్యాంక్ లో 5 మంది ఎంపికయ్యారు. చదవండి: బంపరాఫర్!! మీ కోసమే..ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఊహించని శాలరీలు!! -
భారతీయ విద్యార్ధులకు జాక్ పాట్, ఏడాదికి శాలరీ రూ.2.16 కోట్లు..!
IIT Bombay Placements 2021 Highest Package: ఐఐటీలు, ఐఐఎంలు అంటేనే ప్రతిభకు పట్టుగొమ్మలు. అందుకే మల్టీ నేషనల్ కంపెనీలు ఐఐటీయన్స్‌కి ఏడాదికి కోట్లలో జీతం చెల్లించడానికి కూడా వెనకాడవు. ఇటీవల ఐఐటీ బాంబే ఫస్ట్ ఫేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో ఐఐటీ బాంబే విద్యార్ధులు జాక్ పాట్ కొట్టేశారు.క్యాంపస్ ప్లేస్మెంట్లో కోటి రూపాయలకు పైగా జీతంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో 1382 ఉద్యోగాలు సాధించగా అందులో 45 ఇంటర్నేషనల్ కంపెనీలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. 18రోజుల పాటు జరిపిన ఫస్ట్ ఫేజ్ క్యాంపస్ సెలక్షన్లో 12మంది విద్యార్ధులు కోటికి పైగా శాలరీ తీసుకోనున్నారని, ఇదే ఫస్ట్ ఫేజ్ ఇంటర్వ్యూలో తొలి రికార్డ్‌గా నమోదైనట్లు ఎలైట్ టెక్ అండ్ ఇంజనీరింగ్ స్కూల్ ప్రతినిధులు వెల్లడించారు. ఫస్ట్ ఫేజ్‌లో 315 కంపెనీలు డిసెంబర్ 18తో ముగిసిన ఫస్ట్ ఫేజ్ ఇంటర్వ్యూలో మొత్తం 1723 ఉద్యోగాలకు గాను 1382 ఉద్యోగాలకు విద్యార్ధులు ఎంపికైనట్లు ఐఐటీ బాంబే ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఇక ఇదే క్యాంపస్ ఇంటర్వ్యూలో 2019లో 1172 మంది, 2020లో 973 మంది సెలక్ట్ అయ్యారు. ఇంటర్వ్యూ లేకుండా గతేడాది 182మంది ప్రీప్లేస్ మెంట్ ఆఫర్ పొందగా, ఈ ఏడాది 248 మంది విద్యార్ధులు ప్రీప్లేస్‌మెంట్ ఆఫర్(ఇంటర్నషిప్ త్వరాత ఇంటర్వ్యూతో సంబంధం లేకుండా జాబ్) దక్కించుకున్నారు. ఇంజనీరింగ్ టెక్నాలజీతో పాటు ఇద్దరు విద్యార్ధులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం సంపాదించారు. త్వరలో నిర్వహించే సెకండ్ ఫేజ్‌లో ఐఐటీ బాంబే యూనివర్సిటీ విద్యార్ధులు అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తారని ఐఐటీ బాంబే ధీమా వ్యక్తం చేసింది. జాక్ పాట్ కొట్టేశారు ఐఐటీ బాంబే యూనివర్సిటీ ప్రకారం.. ఫస్ట్ ఫేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో విదేశీ కంపెనీల్లో ఏడుగురు విద్యార్ధులు వార్షిక వేతనం కోటి రూపాయలు ఉండగా..అధిక వార్షిక వేతనం రూ.2.16కోట్లుగా ఉంది. ఇక దేశీయ కంపెనీల్లో ఐదుగురు విద్యార్ధులు కోటి రూపాయలు శాలరీ దక్కించుకోగా.. వార్షిక వేతనం రూ.1.68కోట్లని ఐఐటీ బాంబే అధికారులు తెలిపారు. సీటీసీ ఎంతంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో సంవత్సరానికి యావరేజ్‌గా రూ.25లక్షలు జీతంగా అందుకోనున్నట్లు ఐఐటీ బాంబే తెలిపింది. ఫైనాన్షియల్ సెక్టార్లో యావరేజ్ శాలరీ రూ.28.4లక్షలు, ఐటీ-సాఫ్ట్వేర్ రంగంలో రూ.27.05లక్షలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టార్లో (ఆర్డీ) రూ.25.12లక్షలు, కన్సల్టింగ్ సెక్టార్లో యావరేజ్ శాలరీ రూ.18.02గా ఉన్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో ఇక విదేశాలకు చెందిన కంపెనీలు భారతీయ విద్యార్ధులు ఎంపిక చేసుకోవడంలో పోటీ పడుతున్నట్లు తేలింది. ఐఐటీ బాంబే యూనిర్సిటీలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో 45 అంతర్జాతీయ కంపెనీలు విద్యార్ధుల్ని సెలక్ట్ చేసుకోనేందుకు వచ్చినట్లు యూనివర్సిటీ ప్రతినిధులు చెప్పారు. వాటిలో యూఎస్, జపాన్, యూఏఈ, సింగపూర్, నెదర్లాండ్, హాంకాంగ్, తైవాన్ కంపెనీలు ఉన్నాయి. చదవండి: కరోనా లేదు, ఒమిక్రాన్ లేదు..2 లక్షలకు పైగా ఉద్యోగాలు రెడీగా ఉన్నాయ్ -
Campus Interview: క్యాంపస్‌లోనే కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇంజనీరింగ్ చేసిన వారికి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు పెద్దసంఖ్యలో లభించాయి. ముఖ్యంగా ప్రముఖ విద్యా సంస్థల్లో చదివినవారికి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. దేశంలో ఏఐసీటీఈ అనుబంధ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2018–19 సంవత్సరంలో 1.03 లక్షల మంది చదవగా, అందులో 46.09 శాతం మంది క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు పొందినట్లు కేంద్రం తెలిపింది. అలాగే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అదే ఏడాది 7.01 లక్షల మంది చదవగా, 53.52 శాతం మంది ఉద్యోగాలు పొంది నట్లు పేర్కొంది. క్యాంపస్ ఇంటర్వ్యూలు కాకుండా ఇతర పద్ధతుల్లోనూ ఉద్యోగావకాశాలు వస్తున్నాయని వివరించింది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే ఉద్యోగాలు పొందినవారి శాతం గణనీయంగా పెరగడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. వడబోత తర్వాతే నియామకాలు స్వదేశీ, విదేశీ కంపెనీలు నైపుణ్యం కలిగిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను వెతికి పట్టుకొని ఉద్యోగాలు ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చే ర్యాంకుల ఆధారంగా కంపెనీలు కాలేజీలను ఎంపిక చేసుకుని క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇంటర్వ్యూలు నిర్వహించేప్పుడు కంపెనీలు వివిధ దశలుగా వడబోత కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఆ తర్వాతే ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిభ కనబర్చే వారికే అవకాశాలు దక్కుతున్నాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. ఏ దశలో వెనుకబడినా అభ్యర్థులకు అవకాశాలు కల్పించడం లేదని ఆయన తెలిపారు. క్యాంపస్ ఇంటర్వ్యూలతోపాటు తమ కంపెనీల వద్దకే కాలేజీ విద్యార్థులను పిలిపించుకొని, ఉద్యోగాల కోసం వారిని వివిధ పద్ధతుల్లో పరీక్షిస్తున్నాయని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో చదువులపై శ్రద్ధ పెట్టకుండా కేవలం ఫీజులు, రీయింబర్స్మెంట్ సొమ్ము కోసమే పనిచేసే కొన్ని కాలేజీల్లో చదివిన విద్యార్థుల పరిస్థితి మాత్రం నిరాశాజనకంగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కరోనా కాలంలో ఉద్యోగావకాశాలు తగ్గినట్లు వారు తెలిపారు. కరోనా సమయంలో చివరి రెండేళ్లు చదివిన విద్యార్థులు క్లాసులు లేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోలేకపోయారని అంటున్నారు. ఈ పరిస్థితి వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలను దెబ్బ తీసిందని వివరిస్తున్నారు. -
క్యాంపస్‌లలో కొలువుల కాలం
ఇదే అసలైన పరీక్ష విజయం సాధిస్తే నవ లోకమే బీకేర్‌ఫుల్...ఇలా ప్రిపేరవ్వండి బాలాజీచెరువు (కాకినాడ) : క్యాంపస్ ఇంటర్వూ్యలకు సమయం ఆసన్నమైంది. ఎక్కువగా డిసెంబర్, జనవరి నెలల్లోనే వివిధ సంస్థల ప్రతినిధులు కళాశాలలకు వచ్చి క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహించి, తమకు అవసరమైన విద్యార్థులను ఎంపిక చేసుకుంటారు. జిల్లాలో 32 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా వాటిలో ప్రతి ఏటా 12 వేల మంది ప్రవేశాలు పొందుతున్నారు. వీరిలో కేవలం 60 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించి బయటకు వస్తున్నారు. కళాశాలల్లో ఏటా ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నా...ఇవి తక్కువ సంఖ్యలోనే ఉంటున్నాయి. పోటీ ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు ఆషామాషీగా కాకుండా పక్కా ప్రణాళికతో ఇంటర్వూ్యలకు సిద్ధం కావాలి. ఇంజనీరింగ్ నాల్గో సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ ఇంటర్వూ్యలో కొలువు సాధిస్తేనే దానికి సార్థకత. లేకుంటే భవిష్యత్‌లో కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. మన దగ్గర నుంచి కంపెనీలు ఏం ఆశిస్తున్నాయో దానిపై ఆరా తీసి అందుకు అనుగుణంగా తయారుకావాలి. దుస్తుల ఎంపికలో జాగ్రత్తలు ఇంటర్వూ్యకు హాజరయ్యే అభ్యర్థులు డ్రెస్ కోడ్‌పై జాగ్రత్తలు పాటించాలి. అమ్మాయిలైతే హుందాగా కనిపించేందుకు చీరలు, సల్వార్లు ధరించవచ్చు. పాటియాలా, మిడ్డీ వంటి మోడ్ర¯ŒS డ్రస్సులు వద్దు. ఆకర్షణీయమైన రెజ్యూమ్ విద్యార్థి తనను తాను ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దుకునే రెజ్యూమ్ ఉద్యోగ ఎంపికలో ఎంతో కీలకం. కాపీ పేస్ట్ కాకుండా తనను తాను ఆవిష్కరించుకునే విధంగా ఉండాలి. అభిరుచులు, ఇష్టాఇష్టాలు అందులో నమోదు చేయాలి. ఇది ప్రధాన భూమికను పోషిస్తుంది. ఇంజనీరిం గ్ సబ్జెక్టులు, తాజా పరిణామాలపై కొత్త లాంగ్వేజీలను నేర్చుకోవాలి. ఎప్పటి కప్పుడు తన అప్డేట్స్ను రెజ్యూమ్‌లో పొందుపరచాలి. ఇంటర్వూ్యయే కీలకం నాలుగు సంవత్సరాల విద్యలో అత్యంత కీలక ఘట్టం ఇంటర్వూ్య. ఫలితాన్ని ఇచ్చే ఈ దశలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటర్వూ్య నిర్వహించే గదిలోకి వేళ్లే ముందు అనుమతి తీసుకుని వెళ్లాలి. వెళ్లగానే కూర్చోకుండా కరచాలనం చేయాలి. మీకు సంబంధించిన ఫైళ్లు, హ్యాండ్ బ్యాగు టేబుల్‌పై పెట్టొద్దు. చేతిలోనే ఉంచుకోవాలి లేదా పక్కన పెట్టుకోవాలి. ప్రశ్న పూర్తయిన వెంటనే సమాధానం చెప్పాలి. ఇంటర్వూ్య పూర్తయ్యే వరకూ నిటారుగా కూర్చోవాలి. సమాధానం ఏదో ఒకటి చెప్పడం కానీ, నాన్చడం గానీ చేయొద్దు. ముఖ్యంగా ఆలోచించే సమయంలో కాళ్లు కదపడం, గోళ్లు గిల్లడం, పెదవుల్ని, మీసాల్ని పళ్లతో కొరకడం వంటివి చేయరాదు. విద్యార్థులకు గొప్ప అవకాశం ఇంజనీరింగ్ చివరి సంవత్సర విద్యార్థులకు ఇదొక గొప్ప అవకాశం. డిసెంబర్, జనవరి మాసాల్లో ప్రాంగణ ఎంపికలు ఎక్కువగా జరుగుతాయి. ఎంపికలు నిర్వహించే సంస్థలకు అనుగుణంగా అభ్యర్థులు మారాల్సి ఉంటుంది. వారికి కావల్సిన అన్ని వనరులు తమ దగ్గర ఉన్నాయో లేవో చూసుకుని సన్నద్ధమవ్వాలి. పరిశ్రమల్లో కావల్సినన్ని కొలువులు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి విద్యార్థులు సిద్ధం ఉండాలి. – ఎస్.చంద్రశేఖర్, జేఎ¯ŒSటీయూకే ప్లేస్మెంట్ ఆఫీసర్