ఎస్సై ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని కొత్తగట్టు గ్రామానికి చెందిన తోట శివకుమార్ తన భార్యకు చెందిన రెండు తులాల పుస్తెల తాడును హన్మకొండలోని ఓ బంగారం షాపులో కుదవ పెట్టి రూ. 35 వేలు అప్పు తీసుకున్నాడు. తిరిగి ఈ నెల 14న డబ్బు చెల్లించి పుస్తెలతాడు తీసుకుని హన్మకొండ నుంచి గుడెప్పాడ్ వరకు బస్సులో వచ్చాడు. అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా గ్రామశివారులోని నల్లాల బావి వద్ద హెల్మెట్ పెట్టుకున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు శివకుమార్‌ను అపారు. తాము పోలీసులమంటూ.. లైసెన్స్, బండి కాగితాలు చూపించాలని అడిగారు. అందులో ఓ వ్యక్తి కత్తి తీసి శివకుమార్ మెడపై ఉంచి జేబుల్లో ఏమున్నాయో తీయాలని బెదిరించారు. అప్పుడే బంగారం షాపు నుంచి తెచ్చిన రెండు తులాల పుస్తెల తాడు తీసుకున్నారు. జేబులో ఉన్న రూ. 1000, మొబైల్‌ను శివకుమార్‌కే ఇచ్చి విషయం ఎక్కడైనా చెపితే చంపుతామని బెదిరించి ద్విచక్రవాహనంపై పారిపోయారు. దీంతో శివకుమార్ భయంతో బీపీ పడిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందాడు. బుధవారం స్థానిక పోలీస్‌స్టేçÙన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి విచారణ చేపట్టారు.
పోలీసులమని బెదిరించి పుస్తెలతాడు చోరీ
Published Wed, Jul 27 2016 10:00 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
శాయంపేట : ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులమంటూ బెదిరించి పుస్తెల తాడు (గోపితాడు) ఎత్తుకెళ్లిన ఘటన మండలంలోని కొత్తగట్టు సింగారంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

Advertisement
Advertisement