
దాడికి గురైన మహిళ
సారవకోట: మండలంలోని మూగుపురం గ్రామానికి చెందిన బి.ఆదిలక్ష్మిపై గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి తన కుమార్తెతో కలసి బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపేందుకు ప్రయత్నించారని, పక్కనే ఉన్న కుమార్తె కేకలు వేయడంతో వారు పారిపోయారనిట్లు స్థానికులు తెలిపారు.
అనంతరం ఆదిలక్ష్మిని 108 వాహనంలో టెక్కలి ఆస్పత్రికి తరలించి పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఎస్‌ఐ సత్యనారాయణ మాట్లాడుతూ.. దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పార్ధి గ్యాంగ్‌పై వస్తున్న వదంతుల్లో భాగంగా కొంతమంది ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారే తప్ప వాస్తవాలు లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment